ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3ఏళ్ల వరకు ‘టారీఫ్ హైక్’ నుంచి విముక్తి! జియో అదిరే ప్లాన్- క్రేజీ బెనిఫిట్స్‌తో!
దీపావళి పండుగ వేళ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మార్కెట్లోకి రూ. 10,000 ఆఫర్‌తో ఒకే రీఛార్జ్‌తో 3 ఏళ్ల పాటు అన్లిమిటెడ్ కాల్స్, 5జీ డేటా, ఓటీటీ సబ్స్క్రిప్షన్లను అందిస్తోంది. ఈ ప్లాన్ వల్ల దక్కే ప్రయోజనాలు, రోజూ ఎంత ఖర్చు అవుతుందో ఇక్కడ వివరంగా చూడండి..
భారతీయ టెలికాం రంగంలో తన సంచలన ఆఫర్లతో మార్కెట్ నెట్‌వర్క్‌ను ఏలుతున్న రిలయన్స్ జియో మరో భారీ ధన్తేరస్, దీపావళి ధమాకాను ప్రకటించింది. ప్రతి నెలా లేదా ఏడాదికి ఒకసారి రీఛార్జ్ చేసుకునే తిప్పలు లేకుండా, ఏకంగా మూడేళ్ల పాటు (36 నెలలు) మొబైల్ కనెక్టివిటీని అందించే లాంగ్-టర్మ్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది! ఈ నూతన ప్లాన్ ధరను రూ. 10,000 గా నిర్ణయించింది.

మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జియో యూజర్లు కోట్లలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పనిచేసే ఉద్యోగులు, ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థులు, డిజిటల్ క్రియేటర్లు నిరంతరం హై-స్పీడ్ డేటాపై ఆధారపడతారు. భవిష్యత్తులో టారిఫ్ ధరలు పెరిగే అవకాశం ఉన్న తరుణంలో, ఒకేసారి మూడేళ్ల పాటు ప్రస్తుత ధరలకే ప్రయోజనాలను లాక్ చేసుకునే అవకాశం ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు లభిస్తుండటం విశేషం.
జియో 3ఏళ్ల రీఛార్జ్ ప్లాన్- డేటా, అన్లిమిటెడ్ 5జీ ఫీచర్లు..
నవంబర్ 7 నుంచే దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన ఈ రూ. 10,000 జియో ప్లాన్ ద్వారా వినియోగదారులు పొందే ప్రధాన ప్రయోజనాలు ఇవే:
వాలిడిటీ: ఏకంగా 1,095 రోజులు (3 సంవత్సరాలు) నిరంతర సేవలు లభిస్తాయి.
హై-స్పీడ్ డేటా: ప్రతిరోజూ 2.5 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది.
ఉచిత కాలింగ్ అండ్ ఎస్ఎంఎస్ : భారతదేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేస్తుండగా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం.
ఉచిత 5జీ సేవలు: 5జీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండి, జియో ట్రూ 5జీ నెట్వర్క్ కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అదనపు రుసుము లేకుండా అన్లిమిటెడ్ 5జీ డేటాను వాడుకోవచ్చు.
జియో 3ఏళ్ల రీఛార్జ్ ప్లాన్- ఉచిత ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్లు..
కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా ఉచిత డిజిటల్ సబ్స్క్రిప్షన్లతో జియో ఈ ప్లాన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
JioHotstarఉచిత ఓటీటీ, క్లౌడ్ స్టోరేజ్ ఆఫర్లు
కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా ఉచిత డిజిటల్ సబ్స్క్రిప్షన్లతో జియో ఈ ప్లాన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది.
జియోహాట్‌స్టార్ మోబైల్ + హాలీవుడ్: లైవ్ స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచ్‌లు, హాట్‌స్టార్ ఒరిజినల్స్, వినోద కార్యక్రమాలు, హాలీవుడ్ సినిమాలను వీక్షించడానికి ఈ కంటెంట్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
కాన్వా ప్రో లైట్ : డిజైన్ టెంప్లేట్లు, క్రియేటివ్ టూల్స్ కోసం ఫ్రీగా 12 నెలల 'కాన్వా ప్రొ లైట్' సబ్స్క్రిప్షన్ అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ మూడేళ్లు ఉండదని, కేవలం తొలి 12 నెలలు మాత్రమే వర్తిస్తుందని గ్రహించాలి.
జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్: మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కీలకమైన పత్రాలను సురక్షితంగా దాచుకోవడానికి 50 జీబీ ఉచిత 'జియో ఏఐ క్లౌడ్' స్టోరేజ్‌ను ఇస్తున్నారు.
జియో 3ఏళ్ల రీఛార్జ్- నెలకు రూ. 278 మాత్రమే.. ఎంత ఆదా అవుతుంది?
ఈ ప్లాన్ ఆర్థికంగా ఎంత ప్రయోజనకరమో చూస్తే:
1,095 రోజులకు గాను రూ. 10,000 వెచ్చిస్తే, రోజుకు పడే ఖర్చు కేవలం రూ. 9.13 పైసలు మాత్రమే. అంటే నెలకు దాదాపు రూ. 278 చొప్పున పడుతుంది.
ప్రస్తుతం జియో ఆఫర్ చేస్తున్న వార్షిక ప్లాన్ (రూ. 3,599) ని పరిశీలిస్తే, అందులో 365 రోజులకు రోజుకు 2.5జీబీ డేటా, అన్లిమిటెడ్ 5జీ లభిస్తాయి. ఈ వార్షిక ప్లాన్‌ను మూడేళ్ల పాటు వరుసగా రీఛార్జ్ చేసుకుంటే మొత్తం రూ. 10,797 ఖర్చు అవుతుంది. అదే కొత్త రూ. 10,000 ప్లాన్ ఎంచుకోవడం వల్ల వినియోగదారులకు నేరుగా రూ. 797 ఆదా అవుతుంది. భవిష్యత్తులో టారిఫ్ చార్జీలు పెరిగినా ఆ ప్రభావం మీపై పడదు.
రీఛార్జ్ ఎలా చేసుకోవాలి?
ఈ నూతన 36 నెలల ప్లాన్‌ను వినియోగదారులు మైజియో యాప్, కంపెనీ అధికారిక వెబ్సైట్ (Jio.com), గుర్తింపు పొందిన జియో రిటైల్ స్టోర్లు ఇంకా ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సులువుగా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


