భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న తన పాపులర్ ఎస్‌యూవీ ‘డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160’ డెలివరీలను ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ‘రెనాల్ట్ ఇండియా’ అధికారికంగా ప్రారంభించింది. అక్టోబర్ 17న గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ కారు డెలివరీలను దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థ మొదలుపెట్టింది.

తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో ఈ డెలివరీ పర్వం ప్రారంభం కావడం విశేషం. హైటెక్ సిటీలో నూతనంగా ప్రారంభించిన షోరూమ్‌లో రెనాల్ట్ ఇండియా ఉన్నతాధికారులు స్వయంగా పాల్గొని తొలి కస్టమర్‌కు వాహన తాళాలను అందజేశారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో డస్టర్ బ్రాండ్‌కు బలమైన ఆదరణ ఉంది. పెట్రోల్, కరెంట్ రెండింటితో పనిచేసే ఈ 'సెల్ఫ్ ఛార్జింగ్' హైబ్రిడ్ వెహికల్‌కు తెలుగు నేలపై రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదవుతున్నాయి. భారతదేశంలో ఈ తరహా ‘ఈ-టెక్’ టెక్నాలజీతో వస్తున్న తొలి రెనాల్ట్ కారు ఇదే కావడం విశేషం.
"మా కస్టమర్లకు ఇచ్చిన మాట ప్రకారం దీపావళి నాటికి డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ డెలివరీలు ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉంది," అని రెనాల్ట్ ఇండియా ప్రతినిధి హర్షం వ్యక్తం చేశారు.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- రీటైల్ షోరూమ్‌లు, నెట్‌వర్క్..
విక్రయాల విస్తరణతో పాటు కస్టమర్ అనుభూతిని మెరుగుపరిచేందుకు రెనాల్ట్ ఇండియా దేశవ్యాప్తంగా తన షోరూమ్‌లను ఆధునిక పద్ధతిలో పునర్నిర్మిస్తోంది. 2027 జులై నాటికి దేశంలోని 24 ప్రధాన నగరాల్లో ఉన్న 73 షోరూమ్‌లను న్యూ రీటైల్ ఫార్మాట్‌లోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 30 షోరూమ్‌లు ఈ నూతన ఆకర్షణీయమైన లుక్‌తో సేవలందిస్తున్నాయి.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- ధరలు, వేరియంట్ల వివరాలు..
ఇక రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 మోడల్ ‘ఇవాల్యూషన్’, ‘టెక్నో’, ‘ఎమోషన్’ అనే మూడు ఆకర్షణీయమైన వేరియంట్లలో లభిస్తోంది.
- ఇవాల్యూషన్ : రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఎమోషన్ (టాప్ ఎండ్): రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ఇక రెనాల్ట్ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160 మోడల్ ‘ఇవాల్యూషన్’, ‘టెక్నో’, ‘ఎమోషన్’ అనే మూడు ఆకర్షణీయమైన వేరియంట్లలో లభిస్తోంది.
- ఇవాల్యూషన్ : రూ. 16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఎమోషన్ (టాప్ ఎండ్): రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)
ఈ ఆకర్షణీయమైన ఇంట్రొడక్టరీ ధరలు డిసెంబర్ 31, 2026 వరకు జరిగే డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. రెనాల్ట్ 'ఆర్-పాస్' కలిగిన కస్టమర్లకు ప్రాధాన్యత క్రమంలో డెలివరీలు ఇస్తుండగా, సాధారణ బుకింగ్స్ రూ. 21,000 చెల్లించి చేసుకోవచ్చు.
రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్- పవర్‌ఫుల్ ఇంజిన్, అడాస్..
ఈ రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలో 1.8 లీటర్ల ఫోర్ సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 1.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇవి కలసి గరిష్టంగా 160 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇందులోని ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మోటార్ 208 Nm టార్క్‌ను అందిస్తుంది.
మల్టీమోడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న ఈ కారు కేవలం 9.6 సెకెన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. బ్రేకింగ్ వేసినప్పుడు ఉత్పత్తయ్యే విద్యుత్ ఇంకా పెట్రోల్ ఇంజిన్ ద్వారానే బ్యాటరీ స్వయంచాలకంగా ఛార్జ్ అవుతుంది. కాబట్టి బయటి ప్లగ్ పాయింట్లతో పనిలేకుండా నిరంతరాయంగా ప్రయాణించవచ్చు.
ఈ రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ 29 కేఎంపీఎల్ మైలేజ్ ఇస్తుందని సంస్థ చెబుతోంది.
విశ్వసనీయత, అత్యుత్తమ మైలేజ్ కోరుకునే తెలుగు వాహనదారులకు ఈ కొత్త డస్టర్ హైబ్రిడ్ సరైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.