Renault car discounts : కొత్త కారు కొంటున్నారా? రెనాల్ట్ కార్లపై అదిరిపోయే ఆఫర్లు..

వేసవి కాలంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి రెనాల్ట్ ఇండియా తీపి కబురు అందించింది! తన పాపులర్ మోడల్స్ అయిన క్విడ్, కైగర్, ట్రైబర్‌లపై మే 2026 నెలలో భారీ తగ్గింపులను ప్రకటించింది. పాత స్టాక్‌ను క్లియర్ చేయడంతో పాటు అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. పూర్తి వివరాలు..

Published on: May 8, 2026, 09:08:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Renault Kiger discounts : ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్.. భారత మార్కెట్​లో తన పట్టును నిలుపుకునేందుకు మే నెలలో బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాలు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు, లాయల్టీ బెనిఫిట్స్ రూపంలో ఉన్నాయి. ఈ ఆఫర్లు మే 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా 2025 మోడల్ ఇయర్ (ఎంవై25) కార్లపై రాయితీలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

రెనాల్ట్​ కార్లపై అదిరిపోయే ఆఫర్లు..
రెనాల్ట్​ కార్లపై అదిరిపోయే ఆఫర్లు..

రెనాల్ట్ కైగర్- అత్యధిక తగ్గింపు ఇక్కడే!

మీరు ఎస్‌యూవీ ప్రియులైతే, రెనాల్ట్ కైగర్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు ఉన్నాయి.

ఎంవై25 వెర్షన్: ఈ మోడల్‌పై ఏకంగా రూ. 98,500 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో రూ. 48,500 వరకు నగదు తగ్గింపు, రూ. 25,000 వరకు ఎక్స్​ఛేంజ్ బోనస్ ఉన్నాయి. వీటితో పాటు కార్పొరేట్ డిస్కౌంట్, రెఫరల్ బెనిఫిట్స్ అదనం.

ఎంవై26 వెర్షన్: కొత్త 2026 మోడల్‌పై రూ. 60,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

రెనాల్ట్ ట్రైబర్- ఫ్యామిలీ కారుపై భారీ రాయితీ..

మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఇష్టమైన 7-సీటర్ ఎంపీవీ ట్రైబర్‌పై కూడా రెనాల్ట్ ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తోంది.

ఎంవై25 వెర్షన్: దీనిపై రూ. 45,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్​ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది.

ఎంవై26 వెర్షన్: కొత్త మోడల్‌పై రూ. 30,000 వరకు తగ్గింపు ఉంది. దీనికి అదనంగా రూ. 25,000 వరకు ఎక్స్​ఛేంజ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది.

రెనాల్ట్ క్విడ్- బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌పై ఆఫర్లు..

చిన్న కారు కొనాలనుకునే వారి కోసం క్విడ్‌పై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఎంవై25 వెర్షన్: రూ. 35,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో రూ. 20,000 వరకు నేరుగా నగదు తగ్గింపు పొందే వీలుంది.

ఎంవై26 వెర్షన్: ఈ మోడల్‌పై రూ. 25,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. కార్పొరేట్, రిఫరల్ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తున్నారు.

ఈ ఆఫర్లు డీలర్‌షిప్‌ను బట్టి, మీరు ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి కారు బుక్ చేసే ముందు మీ సమీపంలోని రెనాల్ట్ షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ఉత్తమం.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. రెనాల్ట్ కార్లపై ఈ ఆఫర్లు ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి?

రెనాల్ట్ ఇండియా ప్రకటించిన ఈ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్​ఛేంజ్ బెనిఫిట్స్ మే 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

2. ఏ రెనాల్ట్ కారుపై అత్యధిక తగ్గింపు లభిస్తోంది?

రెనాల్ట్ కైగర్ ఎంవై25 మోడల్‌పై అత్యధికంగా రూ. 98,500 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఇందులో నగదు తగ్గింపు మాత్రమే రూ. 48,500 వరకు ఉంది.

3. ఎంవై25, ఎంవై26 మోడల్స్ అంటే ఏంటి?

ఎంవై25 అంటే 2025లో తయారైన పాత స్టాక్ (మోడల్ ఇయర్ 2025), ఎంవై26 అంటే ఈ ఏడాది (2026) తయారైన కొత్త కార్లు. సాధారణంగా పాత స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీలు ఎంవై25 కార్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తుంటాయి.

4. ఎక్స్​ఛేంజ్ బోనస్ అంటే ఏంటి?

మీ పాత కారును రెనాల్ట్ షోరూమ్‌లో ఇచ్చి, కొత్త రెనాల్ట్ కారును కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే అదనపు తగ్గింపును ఎక్స్​ఛేంద్ బోనస్ అంటారు. ఇది మోడల్‌ను బట్టి రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More