Renault Duster : 2026 రెనాల్ట్​ డస్టర్​పై బిగ్​ అప్డేట్​! ఎస్​యూవీ డెలివరీలు షురూ..

Renault Duster delivery : సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఐకానిక్ ఎస్‌యూవీ 'డస్టర్' భారత రోడ్లపైకి మళ్లీ వచ్చేసింది. డస్టర్ టర్బో-పెట్రోల్ వేరియంట్ల డెలివరీలను రెనాల్ట్ ఇండియా ఇటీవలే ప్రారంభించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Apr 15, 2026, 06:01:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

2026 Renault Duster : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ ట్రెండ్‌కు బీజం వేసిన రెనాల్ట్ డస్టర్.. సరికొత్త అవతారంలో మళ్లీ పలకరిస్తోంది. రూ. 10.49లక్షల ఎక్స్​షోరూం ధరతో ఈ ఎస్​యూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మోడల్​ డీలర్​షిప్​ షోరూమ్స్​లో సందడి చేస్తోంది. ఆర్​-పాస్​ వోచర్ల ద్వారా రూ. 21వేలు చెల్లించి ప్రీ- బుకింగ్​ చేసుకున్న కస్టమర్లకు రెనాల్ట్​ డస్టర్​ టర్బో పెట్రోల్​ వేరియంట్లను డెలివరీ చేస్తున్నారు. హైబ్రిడ్​ వేరియంట్ల కోసం మాత్రం వేచి చూడక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2026 రెనాల్ట్ డస్టర్ ఎస్​యూవీ ఇదిగో.. (REUTERS)
2026 రెనాల్ట్ డస్టర్ ఎస్​యూవీ ఇదిగో.. (REUTERS)

2026 రెనాల్ట్​ డస్టర్​- పవర్ ప్యాక్డ్ ఇంజన్.. అడ్వెంచర్​కు కేరాఫ్ అడ్రస్

కొత్త డస్టర్‌ను రెనాల్ట్ గ్రూప్ మోడ్యులర్ ప్లాట్‌ఫారమ్​పై రూపొందించారు. ఇది భారతీయ రోడ్లకు తగ్గట్టుగా దృఢంగా ఉండటమే కాకుండా, 5-స్టార్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేయబడింది.

టర్బో TCe 160: ఇది 163 hp పవర్, 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్, డీసీటీ ఆప్షన్లు ఉన్నాయి.

టర్బో TCe 100: ఎంట్రీ లెవల్ వేరియంట్ 100 hp పవర్, 160 Nm టార్క్‌తో వస్తుంది.

ఆఫ్-రోడింగ్ సామర్థ్యం: 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు, కఠినమైన దారుల్లో సులభంగా వెళ్లేలా అప్రోచ్ (26.9 డిగ్రీలు), డిపార్చర్ (34.7 డిగ్రీలు) యాంగిల్స్‌ను సెట్ చేశారు.

2026 రెనాల్ట్​ డస్టర్​- ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు..

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ క్యాబిన్ లోపల అడుగుపెడితే అన్నీ అత్యాధునిక హంగులే కనిపిస్తాయి.

డిజిటల్ స్క్రీన్స్: 10.1 ఇంచ్ ఓపెన్-ఆర్ లింక్ టచ్‌స్క్రీన్ (గూగుల్ ఇంటిగ్రేషన్‌తో), 10.25 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి.

సేఫ్టీ & కనెక్టివిటీ: ఇందులో 17 రకాల అడాస్ ఫీచర్లు (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో సహా), 60కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి.

లగ్జరీ టచ్: వెన్టిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ ఏసీ, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ ఎస్‌యూవీ సొంతం.

2026 రెనాల్ట్​ డస్టర్​ హైబ్రిడ్ కోసం వేచి చూడాల్సిందే..

అయితే 2026 రెనాల్ట్​ డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ (E-Tech 160) బుక్ చేసుకున్న వారికి మాత్రం నిరాశే మిగిలింది. 1.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌లో వచ్చే ఈ మోడల్ 2026 దీపావళి నాటికి గానీ మార్కెట్లోకి రాదు. బ్యాటరీ సెటప్‌లో మార్పులు, ప్రొడక్షన్ ప్లాన్ రీ-షెడ్యూల్ కారణంగా ఈ జాప్యం జరుగుతోందని సంస్థ తెలిపింది.

2026 రెనాల్ట్​ డస్టర్​ పోటీ, ధర..

టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 18.69 లక్షల వరకు ఉంది. ఈ సెగ్మెంట్​లో డస్టర్.. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, టాటా సియెర్రా, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి గట్టి పోటీదారులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2012లో ఈ సెగ్మెంట్‌ను సృష్టించిన డస్టర్, ఇప్పుడు మళ్లీ అదే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందో లేదో చూడాలి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. కొత్త రెనాల్ట్ డస్టర్ ప్రారంభ ధర ఎంత?

బేస్ వేరియంట్ ధర రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

2. హైబ్రిడ్ మోడల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?

స్ట్రాంగ్ హైబ్రిడ్ (E-Tech 160) మోడల్ 2026 దీపావళి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

3. ఇందులో అడాస్ ఫీచర్లు ఉన్నాయా?

అవును, భద్రత కోసం ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో కూడిన 17 రకాల అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) ఫీచర్లు ఉన్నాయి.

4. డస్టర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత?

కొత్త డస్టర్ 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది, ఇది ఆఫ్-రోడింగ్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More