Renault Duster : టాప్ ఎండ్‌ని తలపించేలా 2026 రెనాల్ట్ డస్టర్ ‘బేస్ వేరియంట్’! ఫీచర్స్, ధర..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన 'రెనాల్ట్ డస్టర్' తిరిగొచ్చింది. కేవలం రూ. 10.29 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లాంచ్ అయిన దీని బేస్ వేరియంట్ 'ఆథెంటిక్', అద్భుతమైన డిజైన్, రాజీలేని భద్రత, సౌకర్యవంతమైన ఫీచర్లతో మధ్యతరగతి వాహనదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వేరియంట్ వివరాలు..
ఎస్‌యూవీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ సరికొత్త అవతారంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదలైన ఈ ఎస్‌యూవీ.. తన పాత వైభవాన్ని మళ్లీ సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా దీని ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ‘ఆథెంటిక్’.. ధర తక్కువైనా సరే ఫీచర్ల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎస్‌యూవీకి ఉండాల్సిన రగ్గడ్నెస్, ప్రయాణికులకు కావాల్సిన భద్రతను మేళవించి ఈ వేరియంట్‌ను రూపొందించారు.

ఈ నేపథ్యంలో రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్ 'ఆథెంటిక్'లో ఉన్న ప్రత్యేకతలు, ఫీచర్ల వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
2026 రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్- ఎక్స్టీరియర్..
కొత్త తరం రెనాల్ట్ డస్టర్ తన రగ్గడ్ స్టైలింగ్‌ను ఆథెంటిక్ వేరియంట్‌లోనూ కొనసాగించింది. ఇది చూసేందుకు చాలా దృఢంగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది:
ఎల్‌ఈడీ లైటింగ్: ఇందులో ఎకో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్‌ను అందించారు. దీనివల్ల రాత్రి వేళల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.
సిగ్నేచర్ గ్రిల్: ముందు భాగంలో 'DUSTER' అనే పేరుతో ఉన్న సిగ్నేచర్ గ్రిల్ కారుకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది.
ఎల్‌ఈడీ ఇండికేటర్లు: ఓఆర్వీఎంలపైనే ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్లను అమర్చారు.
రక్షణ కవచం: కారు బాడీకి అదనపు బలాన్నిచ్చేలా రీఇన్‌ఫోర్స్డ్ వీల్ ఆర్చెస్, డోర్ సైడ్ ప్రొటెక్షన్, స్కిడ్ ప్లేట్లను ఇచ్చారు. ఇవి కారుకు కేవలం అందాన్నే కాదు, రోడ్డుపై ఒక గంభీరమైన రూపాన్ని కూడా కల్పిస్తాయి.
2026 రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్- ఇంటీరియర్ అండ్ కంఫర్ట్స్..
లోపలి భాగంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రాథమిక అవసరాలకు మించిన ఫీచర్లను రెనాల్ట్ చేర్చింది. అవి..
డిజిటల్ డిస్‌ప్లే: డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని అందించడానికి 7-ఇంచ్ టీఎఫ్టీ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది.
పవర్ విండోస్: నాలుగు తలుపులకు 'ఆటో అప్/డౌన్' ఫీచర్‌తో కూడిన పవర్ విండోస్ రావడం గమనార్హం.
సెంట్రల్ కన్సోల్: లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు చేతులకు విశ్రాంతినిచ్చేలా స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్‌ను అందించారు.
అదనపు ఫీచర్లు: ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, వన్-టచ్ ఎల్‌ఈడీ రూమ్ లైట్లు, 2026 రెనాల్ట్ డస్టర్ వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి.
కీలెస్ ఎంట్రీ: రోజువారీ వాడకంలో సౌలభ్యం కోసం రిమోట్ కీలెస్ ఎంట్రీని ఇందులో చేర్చారు.
రెనాల్ట్ డస్టర్ వేరింట్లు- వాటి ధరల వివరాలను డీటైల్డ్‌గా తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2026 రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్- భద్రతా ప్రమాణాలు..
భద్రత విషయంలో రెనాల్ట్ సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. బేస్ వేరియంట్ అయినప్పటికీ, ఇందులో ఏకంగా 35 సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. అవి..
6 ఎయిర్‌బ్యాగ్‌లు: కారులోని అందరికీ రక్షణనిచ్చేలా 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేశారు.
టీపీఎంఎస్: టైర్లలో గాలి ఒత్తిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది.
హెచ్ఎస్ఏ అండ్ ఈఎస్పీ: కొండ ప్రాంతాల్లో కారు వెనక్కి జారకుండా ఉండేందుకు హిల్ స్టార్ట్ అసిస్ట్, డ్రైవింగ్ చేసేటప్పుడు కారు స్థిరత్వం కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ) వంటి ఫీచర్లు ఉన్నాయి.
2026 రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్- కొనుగోలుదారుల కోసం..
కేవలం రూ. 10.29 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభిస్తున్న డస్టర్ ఆథెంటిక్ వేరియంట్, ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం అని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ధరలో ఎక్కువ భద్రత, అవసరమైన అన్ని సౌకర్యాలు, డస్టర్ రగ్గడ్ లుక్, మంచి రోడ్ ప్రెజెన్స్ కోరుకునే వారికి ఇది ఒక ప్రాక్టికల్ ఛాయిస్ అని అంటున్నారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. కొత్త డస్టర్ 'గ్రౌండ్ క్లియరెన్స్' ఎంత? ఇది ఆఫ్-రోడింగ్‌కు సరిపోతుందా
కొత్త రెనాల్ట్ డస్టర్ 212 mm నుంచి 217 mm (వేరియంట్‌ను బట్టి) అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. ఇది తన విభాగంలోని హ్యుందాయ్ క్రెటా (190 mm), సెల్టోస్ (190 mm) కంటే చాలా ఎక్కువ.
ఆఫ్-రోడింగ్: దీని రగ్గడ్ డిజైన్, వెడల్పాటి వీల్ ఆర్చెస్, మెరుగైన అప్రోచ్/డిపార్చర్ యాంగిల్స్ వల్ల ఇది గుంతల రోడ్లపై, గరుకుగా ఉండే ప్రాంతాల్లో చాలా సునాయాసంగా వెళ్లగలదు. ప్రస్తుతం ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో వచ్చినప్పటికీ, దీని ఎత్తు వల్ల ఆఫ్-రోడ్ ప్రియులకు ఇది మంచి ఎంపిక.
2. డస్టర్ బేస్ వేరియంట్ 'ఆథెంటిక్'లో టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందా?
లేదు, డస్టర్ బేస్ వేరియంట్ ఆథెంటిక్లో కంపెనీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ సిస్టమ్‌ను అందించడం లేదు.ఇందులో కేవలం 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మాత్రమే ఉంటుంది. మీకు టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు కావాలంటే, దీని తర్వాత వేరియంట్ అయిన ‘ఎవల్యూషన్’ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో 10.1-ఇంచ్ పెద్ద టచ్‌స్క్రీన్ అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


