Renault Duster Price : ‘వెల్కమ్​ బ్యాక్​ రెనాల్ట్​ డస్టర్​’- ఎస్​యూవీ లాంచ్​, ధర ఎంతంటే..

Renault Duster price in India : 2026 రెనాల్ట్​ డస్టర్​ లాంచ్​ అయ్యింది. మంగళవారం జరిగిన ఈవెంట్​లో ఈ ఎస్​యూవీ ధరలు, వారంటీ వంటి వివరాలను సంస్థ అధికారికంగా ప్రకటించింది. వాటి వివరాలను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి..

Published on: Mar 17, 2026, 11:59:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మచ్​ అవైటెడ్​ 2026 రెనాల్ట్​ డస్టర్​ని సంస్థ ఎట్టకేలకు ఇండియాలో లాంచ్​ చేసింది. జనవరిలో ఈ ఎస్​యూవీని ఆవిష్కరించిన దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ.. మంగళవారం జరిగిన ఈవెంట్​లో భాగంగా రెనాల్ట్​ డస్టర్​కి సంబంధించిన ధరలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2026 రెనాల్ట్​ డస్టర్​.. (REUTERS)
2026 రెనాల్ట్​ డస్టర్​.. (REUTERS)

2026 రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ ఎక్స్​షోరూం ధరలు..

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధరను రూ. 10.49లక్షలుగా నిర్ణయించారు. కాగా, సంస్థకు చెందిన “ఆర్​-పాస్​”ని తీసుకున్న వారికి దీని ధర రూ. 10.29లక్షలకు తగ్గుతుంది.

ఇంజిన్​ వారీగా ఎక్స్​షోరూం ధరల వివరాలు-

టర్బో టీసీఈ 100 ఎంటీ-

ఆథెంటిక్​:- స్టాండర్డ్​- రూ. 10.49 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 10.29 లక్షలు

ఇవొల్యూషన్​:- స్టాండర్డ్​- రూ. 11.69 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 11.39 లక్షలు

టెక్నో:- స్టాండర్డ్​- రూ. 13.49 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 13.19 లక్షలు

టర్బో టీసీఈ 160 ఎంటీ-

ఇవొల్యూషన్​:- స్టాండర్డ్​- రూ. 12.99 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 12.69 లక్షలు

టెక్నో:- స్టాండర్డ్​- రూ. 14.49 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 14.19 లక్షలు

టెక్నో+ :- స్టాండర్డ్​- రూ. 15.29 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 14.99 లక్షలు

ఐకానిక్​:- స్టాండర్డ్​- రూ. 16.99 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 16.59 లక్షలు

టర్బో టీసీఈ 160 డీసీటీ-

ఇవొల్యూషన్​:- స్టాండర్డ్​- రూ. 14.49 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 13.99 లక్షలు

టెక్నో:- స్టాండర్డ్​- రూ. 15.89 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 15.49 లక్షలు

టెక్నో+ :- స్టాండర్డ్​- రూ. 16.69 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 16.29 లక్షలు

ఐకానిక్​:- స్టాండర్డ్​- రూ. 18.49 లక్షలు, ఆర్​- పాస్​తో రూ. 18.09 లక్షలు

చివరి

2026 రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీపై 7ఏళ్ల వారంటీ..

'రెనాల్ట్​ ఫరెవర్​ ప్రోగ్రామ్​'లో భాగంగా ఈ కొత్త డస్టర్​ ఎస్​యూవీపై 7ఏళ్ల వారంటీని ఇస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. తద్వారా కస్టమర్లతో దీర్ఘకాలిక అనుబంధాన్ని పెంచుకునేందుకు సంస్థ ముందడుగు వేసింది. ఈ వారంటీ అనేది ప్రతి ఏటా పెరుగుతూ వెళుతుంది. అంతేకాదు, కారును అమ్మినప్పుడు కొత్త ఓనర్​కి కూడా చేరుతుంది. ఫలితంగా ఈ మోడల్​ రీసేల్​ వాల్యూ కూడా పెరుగుతుంది.

2026 రెనాల్ట్​ డస్టర్​ ఇంటీరియర్ అండ్​ ఫీచర్స్​..

రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ క్యాబిన్ లోపల రెనాల్ట్ విలాసవంతమైన, టెక్-ఓరియెంటెడ్ ఎక్స్​పీరియెన్స్​ని అందించే ప్రయత్నం చేసింది.

పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఆకట్టుకుంటాయి. యాంబియంట్ లైటింగ్, స్పోర్టీ లుక్ కోసం ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఇన్‌సర్ట్స్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.

గూగుల్ ఓఎస్​పై నడిచే 10.1- ఇంచ్​ టచ్‌స్క్రీన్, 7-ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ వంటివి ఇందులో ఉన్నాయి.

డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా వంటివి లభిస్తున్నాయి.

ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 అడాస్ ఫీచర్లతో ఈ 2026 రెనాల్ట్​ డస్టర్​ ఎస్​యూవీ సేఫ్టీకి తిరుగు లేదు.

ఈ మోడల్​కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

అనాటి డస్టర్​- ఇప్పుడు కొత్తగా..

భారత ఆటోమొబైల్​ సెగ్మెంటోల్​ రెనాల్ట్​ డస్టర్​ ఓ వెలుగు వెలిగిందనే చెప్పుకోవాలి. ఎస్​యూవీ ప్రభంజనం ఇంకా మొదలవ్వని కాలంలోనే ఈ మోడల్​ బెస్ట్​ సెల్లింగ్​గా దూసుకెళ్లింది. భారతీయల్లో ఒక ఎమోషన్​గా నిలిచిపోయింది. కాగా అనంతర కాలంలో మాత్రం ఎస్​యూవీ సెగ్మెంట్​లో పోటీని తట్టుకోలేకపోయింది. ఫలితంగా, కొన్నేళ్ల క్రితం ఈ మోడల్​ని ఇండియాలో సంస్థ డిస్కంటిన్యూ చేసింది.

నేటి లాంచ్​తో డస్టర్​ని రెనాల్ట్​ తిరిగి ఇండియాలో సరికొత్తగా, భారతీయుల ఇష్టాలకు తగ్గట్టుగా లాంచ్​ చేసింది. మరి ఈ మోడల్​ భారతీయులను ఏమేరకు ఆకర్షిస్తుందో చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More