Renault Bridger : రెనాల్ట్ నుంచి అదిరిపోయే కాంపాక్ట్ ఎస్​యూవీ- 'బ్రిడ్జర్' కాన్సెప్ట్ ఆవిష్కరణ..

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. అంతర్జాతీయ మార్కెట్ల కోసం సరికొత్త ‘బ్రిడ్జర్’ ఎస్‌యూవీకి చెందిన కాన్సెప్ట్​ని ఆవిష్కరించింది. 4-మీటర్ల కంటే తక్కువ పొడవుతో, అత్యంత శక్తివంతమైన లుక్‌తో రానున్న ఈ కారు మొదటగా భారత మార్కెట్​లోనే విడుదల కానుంది.

Published on: Mar 11, 2026, 05:25:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లపై పట్టు సాధించే దిశగా కీలక అడుగు వేసింది. అందులో భాగంగానే ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘బ్రిడ్జర్’ ఎస్​యూవీ కాన్సెప్ట్​ని అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. భవిష్యత్తులో రాబోయే సబ్-4 మీటర్ ఎస్‌యూవీలకు ఈ కాన్సెప్ట్ ఒక రోడ్ మ్యాప్‌లా నిలవనుంది. విశేషమేమిటంటే, ఈ కారు ఉత్పత్తి వెర్షన్ మొట్టమొదటగా మన భారతదేశంలోనే లాంచ్ అవుతుండటం విశేషం.

రెనాల్ట్​ బ్రిడ్జర్​ కాన్సెప్ట్​..
రెనాల్ట్​ బ్రిడ్జర్​ కాన్సెప్ట్​..

రెనాల్ట్​ బ్రిడ్జర్- రగ్గడ్ లుక్.. అదిరిపోయే డిజైన్

రెనాల్ట్ బ్రిడ్జర్ కాన్సెప్ట్ చూడటానికి చాలా గంభీరంగా, పటిష్టంగా కనిపిస్తోంది. సాధారణ క్రాస్ ఓవర్లలా కాకుండా, ఇది ఒక పూర్తిస్థాయి ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ తరహాలో పొడవుగా, దృఢమైన బాడీ లైన్లతో రూపొందింది.

టైర్లు అండ్​ గ్రౌండ్ క్లియరెన్స్: ఇందులో 18-ఇంచ్​ భారీ చక్రాలను అమర్చారు. అలాగే 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల కఠినమైన రోడ్లపై కూడా సులువుగా ప్రయాణించవచ్చు.

ముందు భాగం: స్క్వేర్ షేప్‌లో ఉన్న ఫ్రంట్ ఫాసియా, షార్ప్ లైన్లు, గ్రిల్ వరకు విస్తరించిన సన్నని హెడ్‌ల్యాంప్స్ దీనికి ఒక మోడ్రన్ లుక్‌ని ఇచ్చాయి. గ్రిల్‌పై 'RENAULT' అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి.

వెనుక భాగం: ఆఫ్‌రోడ్ ప్రియులను ఆకట్టుకునేలా వెనుక డోర్‌పై స్పేర్ వీల్‌ను అమర్చారు. 'బీజ్ డ్యూన్ సాటిన్' ఫినిషింగ్‌తో ఈ కారు డిజైన్ మరింత ప్రీమియంగా కనిపిస్తోంది.

దీని డిజైన్ ల్యాండ్​ రోవర్​ డిఫెండర్​లా ఉందని, ఇది మారుతీ సుజుకీ జిమ్నీ, మహీంద్రా థార్​కు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్​లో అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.​

రెనాల్ట్​ బ్రిడ్జర్- ఇంటీరియర్ అండ్​ సౌకర్యాలు..

ఈ కారు పొడవు 4 మీటర్ల లోపే ఉన్నప్పటికీ, లోపల స్పేస్​ విషయంలో రెనాల్ట్ ఎక్కడా రాజీ పడలేదు. ముఖ్యంగా వెనుక కూర్చునే ప్రయాణికులకు 200 ఎంఎం మేర ‘నీ రూమ్’ లభిస్తుందని సంస్థ పేర్కొంది.

బూట్ స్పేస్: ప్రయాణాల్లో లగేజీ కోసం 400 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్‌ను కేటాయించారు.

డ్రైవింగ్ అనుభవం: డ్రైవర్ సీటు కాస్త ఎత్తులో ఉండటం వల్ల రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది, ఇది ప్రయాణికులకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది.

రెనాల్ట్​ బ్రిడ్జర్- భారత్‌లో లాంచ్ ఎప్పుడు?

భారతదేశాన్ని బేస్ చేసుకుని అభివృద్ధి చేస్తున్న సరికొత్త ‘ఆర్​జీఎంపీ స్మాల్’ ప్లాట్‌ఫారమ్‌పై ఈ ఎస్​యూవీ రూపొందుతోంది. మార్కెట్ అవసరాలను బట్టి ఇందులో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

షెడ్యూల్ ప్రకారం.. 2027 చివరి నాటికి ఈ రెనాల్ట్​ బ్రిడ్జర్ భారత్‌లో సేల్​కి రానుంది.

సాధారణంగా ఒక కాన్సెప్ట్ కారు ప్రొడక్షన్ స్టేజ్‌కు రావడానికి చాలా సమయం పడుతుంది, కానీ రెనాల్ట్ మాత్రం కేవలం రెండేళ్లలోపే దీనిని రోడ్లపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రెనాల్ట్ భవిష్యత్తు ప్రణాళికలు..

వచ్చే నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 26 కొత్త వాహనాలను ప్రవేశపెట్టాలని రెనాల్ట్ నిర్ణయించింది. 2030 నాటికి ఏడాదికి 20 లక్షల కార్లను విక్రయించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, తన పోర్ట్‌ఫోలియోలో సగం కార్లను ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ మోడళ్లుగా మార్చాలని యోచిస్తోంది.

ఇండియాలో మార్చ్​ 17న డస్టర్​ని లాంచ్​ చేయనున్న రెనాల్ట్​, ఎస్​యూవీ ధరలను ప్రకటించనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More