Mahindra Thar Roxx స్పెషల్ ఎడిషన్- సరికొత్త లుక్‌తో అదరగొడుతున్న ఆఫ్‌రోడ్ కింగ్..
మహీంద్రా థార్ రాక్స్ లైనప్‌లో 'స్టార్ ఎడిషన్' పేరుతో సరికొత్త మోడల్‌ను సంస్థ విడుదల చేసింది. సిట్రిన్ యెల్లో రంగుతో పాటు ప్రీమియం ఇంటీరియర్స్‌తో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ధరలు, ఫీచర్లు, ఇతర విశేషాలు మీకోసం..
ఆఫ్‌రోడ్ వాహన ప్రియుల మనసు దోచుకున్న మహీంద్రా థార్ రాక్స్ శ్రేణిలో మరో కొత్త మోడల్ చేరింది. థార్ రాక్స్ ‘స్టార్ ఎడిషన్’ పేరుతో ఒక స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న మోడళ్ల కంటే మరింత ప్రీమియంగా, స్టైలిష్‌గా ఈ ఎడిషన్‌ను తీర్చిదిద్దారు. 5-డోర్ ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు మహీంద్రా ఈ అడుగు వేసింది.

మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్- చూడగానే ఆకట్టుకునే మార్పులు..
ఈ కొత్త మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌లో ప్రధానంగా కనిపించే మార్పు దాని బాహ్య రూపం. మునుపటి గ్రిల్ స్థానంలో మెరిసిపోయే 'పియానో బ్లాక్' గ్రిల్, అలాగే అల్లాయ్ వీల్స్‌కు కూడా అదే పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. వీటికి తోడు 'సిట్రిన్ యెల్లో' అనే సరికొత్త రంగును పరిచయం చేశారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో కూడా ఇది లభిస్తుంది.
| వేరియంట్ | ఇంజిన్ | ట్రాన్స్మిషన్ | డ్రైవ్ట్రెన్ | ధర (ఎక్స్‌షోరూం) |
|---|---|---|---|---|
| Thar ROXX STAR EDN | 2.0L turbo-petrol | Automatic | RWD | ₹17.85 lakh |
| Thar ROXX STAR EDN | 2.2L diesel | Manual | RWD | ₹16.85 lakh |
| Thar ROXX STAR EDN | 2.2L diesel | Automatic | RWD | ₹18.35 lakh |
మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్- లోపల విలాసవంతమైన ఇంటీరియర్స్..
క్యాబిన్ లోపలికి వెళితే అచ్చం లగ్జరీ కారులో ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనిలో ఆల్-బ్లాక్ లెదరెట్ సీట్లు, స్వేడ్ అంచులు క్లాస్ లుక్‌ని ఇస్తాయి. సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్.
60:40 స్ల్పిట్ రియర్ సీట్లు (మల్టీ పాయింట్ రీక్లైన్ సౌకర్యంతో).
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్లు.
26.03 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్.
వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే.
9-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ మరియు అలెక్సా ఇంటిగ్రేషన్.
మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్- భద్రతకు పెద్దపీట..
భద్రత విషయంలో మహీంద్రా ఎప్పుడూ ముందుంటుంది. "ఈ ఎస్‌యూవీని భారత్ ఎన్సీఏపీలో 5-స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడం జరిగింది," అని సంస్థ స్పష్టం చేసింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎస్ఓఎస్ ఫంక్షన్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్- ఇంజిన్ సామర్థ్యం..
మెకానికల్ పరంగా ఈ మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ ఎస్‌యూవీలో ఎలాంటి మార్పులు లేవు. 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ (mStallion), 2.2 లీటర్ డీజిల్ (mHawk) ఇంజిన్లతో ఇది లభిస్తుంది. అయితే, ఈ స్టార్ ఎడిషన్ కేవలం 'రియర్ వీల్ డ్రైవ్' ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. టెర్రైన్ మోడ్స్, బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ వంటి ఆఫ్‌రోడ్ హార్డ్‌వేర్ దీని ప్రత్యేకత.
మహీంద్రా థార్ రాక్స్ స్టార్ ఎడిషన్- ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్)..
డీజిల్ మాన్యువల్: రూ. 16.85 లక్షలు
డీజిల్ ఆటోమేటిక్: రూ. 18.35 లక్షలు
పెట్రోల్ ఆటోమేటిక్: రూ. 17.85 లక్షలు
(గమనిక: ఈ ఎడిషన్‌లో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అందుబాటులో లేదు).
స్టైల్, పర్ఫార్మెన్స్ రెండూ కోరుకునే యువతకు, ఫ్యామిలీలకు థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


