మహీంద్రా స్కార్పియో లైనప్​లో కొత్త ఎస్​యూవీ- 'విజన్​ ఎస్​' లాంచ్​ ఎప్పుడు?

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రాబోతున్న సబ్-4 మీటర్ ఎస్‌యూవీ 'విజన్ ఎస్' టెస్టింగ్ సమయంలో కెమెరాకు చిక్కింది. స్కార్పియో లైనప్‌లోకి రానున్న ఈ కారు విశేషాలు ఇవే.

Published on: Jan 11, 2026, 10:46:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎస్‌యూవీల రారాజు మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో సంచలనం రాబోతోంది! గతేడాది ఆగస్టులో జరిగిన ‘ఫ్రీడమ్_ఎన్.యూ’ ఈవెంట్‌లో కంపెనీ ప్రదర్శించిన నాలుగు కాన్సెప్ట్ కార్లలో ఒకటైన ‘విజన్ ఎస్’ ఇప్పుడు రోడ్లపై ప్రత్యక్షమైంది. తమిళనాడులో ఈ కారును టెస్టింగ్ చేస్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్​లో పోస్ట్ చేశారు. ఫలితంగా ఈ కారుకు సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

మహీంద్రా విజన్​ ఎస్​ స్పైషాట్​.. (CarsIndia/Reddit)
మహీంద్రా విజన్​ ఎస్​ స్పైషాట్​.. (CarsIndia/Reddit)

ఏంటీ ఈ విజన్ ఎస్? దీని ప్రత్యేకతలేంటి?

మహీంద్రా విజన్.ఎస్, విజన్.ఎస్​ఎక్స్​టీ, విజన్​.టీ, విజన్.ఎక్స్ అనే నాలుగు రకాల కాన్సెప్ట్ ఎస్‌యూవీలను గత ఆగస్టులో పరిచయం చేసింది మహీంద్రా. ఇవన్నీ కూడా మహీంద్రా కొత్తగా రూపొందించిన ‘ఫ్రీడమ్_ఎన్.యూ’ మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి తయారయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ విశేషం ఏంటంటే.. దీనిపై పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్లను కూడా అమర్చుకునే వెసులుబాటు ఉంటుంది.

ముఖ్యంగా 'విజన్ ఎస్' మోడల్ స్కార్పియో ఫ్యామిలీలో చేరబోతోంది. మహీంద్రాకు బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటిగా ఉన్న స్కార్పియో-ఎన్​కి ఇది బుడ్డి వర్షెన్​ని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇప్పుడున్న స్కార్పియో-ఎన్ లేదా స్కార్పియో క్లాసిక్ లాగా ఇది లాడర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై కాకుండా, మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమవుతోంది. అంతేకాదు, ఇది 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రాబోతోంది.

టెస్ట్ వెహికల్‌లో ఏం గమనించవచ్చు?

టెస్ట్​ డ్రైవ్​ ద్వారా బయటకు వచ్చిన స్పై షాట్స్ ప్రకారం.. మహీంద్రా విజన్​ ఎస్​ కాన్సెప్ట్ మోడల్‌లో చూపించిన బాక్సీ డిజైన్ అలాగే ఉంది. వెనుక వైపు స్పేర్ వీల్ (స్టెపినీ) అమర్చారు. ఇది స్కార్పియో సిరీస్ గుర్తింపును ప్రతిబింబిస్తోంది. అయితే కాన్సెప్ట్ వెర్షన్‌లో ఉన్న 'ఎల్​' ఆకారపు లైట్ల స్థానంలో, టెస్టింగ్ కారులో గుండ్రని హెడ్‌ల్యాంప్‌లను అమర్చారు.

ఎస్​యూవీ ఇంటీరియర్​ వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ కాన్సెప్ట్​ వర్షెన్​ని పరిగణలోకి తీసుకుంటే ఈ విజన్​ ఎస్​లో టెక్​-ఫోకస్డ్​ క్యాబినే ఉంటుంది. డ్యూయెల్​ టల్ స్క్రీన్లతో కూడిన అత్యాధునిక క్యాబిన్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. లాంచ్​ నాటికి మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.

మహీంద్రా అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ, ప్రారంభంలో ఈ విజన్​ ఎస్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో దీని హైబ్రిడ్, ఫుల్లీ ఎలక్ట్రిక్ వెర్షన్లను కూడా రావొచ్చు.

మహీంద్రా విజన్​ ఎస్​- లాంచ్​ ఎప్పుడు?

మహీంద్రా తన కొత్త ప్లాట్‌ఫామ్‌లో మొదటిగా ఈ 'విజన్ ఎస్'ను మార్కెట్​లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ కారు వివిధ రకాల రోడ్లపై టెస్టింగ్ దశలో ఉంది. కాగా, అన్నీ అనుకున్నట్టు జరిగితే 2027 నాటికి ఇది షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా విజన్​ ఎస్​ ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

లాంచ్​ తర్వాత ఈ కొత్త ఎస్​యూవీ టాటా సియెర్రా వంటి మోడల్స్​కి గట్టి పోటీ ఇవ్వనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More