Renault Duster : 2026 రెనాల్ట్ డస్టర్ లాంచ్ రేపే- హైలైట్స్ ఇవి..
Renault Duster 2026 price : 2026 రెనాల్ట్ డస్టర్ రేపు (మార్చి 17) భారత్‌లో విడుదల కానుంది. రూ. 21,000తో ప్రీ-బుకింగ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది టర్బో-పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు లెవల్-2 అడాస్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో రాబోతోంది.
మచ్ అవైటెడ్ 2026 రెనాల్ట్ డస్టర్.. రేపు, అంటే మార్చ్ 17న ఇండియా మార్కెట్లోకి ఘనంగా లాంచ్ కాబోతోంది. ఈ ఎస్‌యూవీని ఇప్పటికే ఆవిష్కరించిన రెనాల్ట్ సంస్థ, రేపు ధరల వివరాలను వెల్లడించనుంది.

ఒకప్పుడు దేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో సంచలనం సృష్టించిన ఈ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. హ్యుందాయ్ క్రెటాకు ప్రధాన పోటీదారుగా వస్తున్న ఈ కొత్త డస్టర్.. ఆధునిక డిజైన్, టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లతో కస్టమర్లను ఆకర్షించనుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఈ 2026 రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
2026 రెనాల్ట్ డస్టర్- డిజైన్..
2026 రెనాల్ట్ డస్టర్ గ్లోబల్ థర్డ్-జనరేషన్ మోడల్ ఆధారంగా రూపొందినప్పటికీ, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేశారు.
ముందు భాగం: ఇందులో ఐబ్రో-స్టైల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉన్నాయి. ఇవి టర్న్ ఇండికేటర్లుగా కూడా పనిచేస్తాయి.
గ్రిల్: రీడిజైన్ చేసిన గ్రిల్‌పై 'Duster' అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. బంపర్‌పై సిల్వర్ యాక్సెంట్స్ మొదటి తరం డస్టర్‌ను గుర్తుకు తెస్తాయి.
లైటింగ్: పిక్సెల్-స్టైల్ ఫాగ్ ల్యాంప్స్ ఈ ఎస్‌యూవీకి మరింత రగ్గడ్, మోడ్రన్ లుక్‌ను ఇస్తున్నాయి.
2026 రెనాల్ట్ డస్టర్- ఇంటీరియర్..
ఎస్‌యూవీ క్యాబిన్ లోపల రెనాల్ట్ విలాసవంతమైన, టెక్-ఓరియెంటెడ్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించే ప్రయత్నం చేసింది.
స్టీరింగ్ అండ్ డ్యాష్‌బోర్డ్: పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ ఆకట్టుకుంటాయి.
ఫీచర్లు: యాంబియంట్ లైటింగ్, స్పోర్టీ లుక్ కోసం ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఇన్‌సర్ట్స్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి సదుపాయాలు ఉన్నాయి.
2026 రెనాల్ట్ డస్టర్- కీలక ఫీచర్లు..
ఇన్ఫోటైన్‌మెంట్: గూగుల్ ఓఎస్‌పై నడిచే 10.1- ఇంచ్ టచ్‌స్క్రీన్, 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్.
కన్వీనియన్స్: డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, పవర్డ్ టెయిల్‌గేట్, 360-డిగ్రీ కెమెరా.
సేఫ్టీ: ఆరు ఎయిర్‌బ్యాగులు, లెవల్ 2 అడాస్ ఫీచర్లతో అత్యంత సురక్షితంగా రూపొందించారు.
2026 రెనాల్ట్ డస్టర్- ఇంజిన్, పవర్‌ట్రెయిన్..
రెనాల్ట్ డస్టర్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభించనుంది:
హైబ్రిడ్ (ఈ-టెక్ 160): 1.8-లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిసి 160 బీహెచ్పీ పవర్, 172 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది.
టర్బో పెట్రోల్ (Turbo TCe 160): 1.3-లీటర్ ఇంజిన్ 160 బీహెచ్పీ పవర్, 280 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లతో వస్తుంది.
బేస్ వేరియంట్: 1.0-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (100 బీహెచ్పీ, 160 ఎన్ఎం), ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
2026 రెనాల్ట్ డస్టర్- బుకింగ్స్, డెలివరీ..
కొత్త రెనాల్ట్ డస్టర్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల వినియోగదారులు రూ. 21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టర్బో-పెట్రోల్ వేరియంట్ల డెలివరీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అయితే, హైబ్రిడ్ వెర్షన్లు మాత్రం ఈ ఏడాది దీపావళి పండుగ సమయానికి అందుబాటులోకి వస్తాయని సమాచారం.
మరిన్ని వివరాల కోసం రేపటి లాంచ్ ఈవెంట్ వరకు ఎదురుచూడాల్సిందే!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


