Hyundai Tucson : ఇండియాలో డిస్కంటిన్యూ- అంతర్జాతీయ మార్కెట్లోకి కొత్తగా- ఈ ఎస్‌యూవీ ఎలా ఉండబోతోంది?
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ 'టక్సన్'ను భారత వెబ్‌సైట్ నుంచి నిశ్శబ్దంగా తొలగించిన విషయం తెలిసిందే. కాగా ఈ మోడల్‌కి సంబంధించిన సరికొత్త వర్షెన్‌ని సంస్థ రెడీ చేస్తోంది. ఆ వివరాలు..
ఇండియా రోడ్లపై కనిపంచే బడా ఎస్‌యూవీల్లో హ్యుందాయ్ టక్సన్ ఒకటి. కానీ ఈ 5 సీటర్ని హ్యుందాయ్ సంస్థ గతేడాది నవంబర్‌లో ఇండియాలో డిస్కంటిన్యూ చేసింది. సైలెంట్‌గా తన వెబ్‌సైట్ నుంచి ఈ మోడల్ని దింపేసింది. ఆ తర్వాత కొత్త బుకింగ్‌లను సైతం ఆపేసింది. 2022లో భారత్‌లో విడుదలైన నాలుగో తరం టక్సన్, అప్పట్లో హ్యుందాయ్‌కి చెందిన అత్యంత అధునాతన సాంకేతికత ఫీచర్లతో కూడిన ఎస్‌యూవీగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ మోడల్ స్థానంలో ఏ కారు వస్తుంది లేదా ఎప్పుడు మళ్లీ విడుదల అవుతుందనే దానిపై కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే, నెక్ట్స్ జనరేషన్ టక్సన్కి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చూస్తుంటే, ఈ మోడల్‌కి సంస్థ భారీ మార్పులే చేసి, రీ-లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని అనిపిస్తోంది.
నెక్ట్స్ జెన్ హ్యుందాయ్ టక్సన్ పనులు ప్రారంభం..!
భారత్‌లో నిలిపివేసినప్పటికీ, అంతర్జాతీయంగా హ్యుందాయ్ ఇప్పటికే తదుపరి తరం టక్సన్ పనుల్లో నిమగ్నమైంది. అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో 2027 నాటికి ఇది ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి తుది మెరుగులు దిద్దే పనిలో కంపెనీ ఉంది.
డిజైన్ ఎలా ఉండబోతోంది? (అంచనా)
ఇటీవల సోషల్ మీడియాలో డిజిటల్ ఆర్టిస్ట్ 'కెల్సోనిక్' షేర్ చేసిన రెండర్డ్ చిత్రాల ప్రకారం, కొత్త టక్సన్ డిజైన్‌లో భారీ మార్పులు ఉండనున్నాయి:
బాక్సీ స్టైల్: ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త వెర్షన్ మరింత నిటారుగా, బాక్సీ ఆకారంలో ఉండనుంది. బాడీపై షార్ప్ క్రీజులు, మృదువైన వంపులు ఉంటాయని తెలుస్తోంది.
ముందు భాగం: ఫ్లాటర్ నోస్ డిజైన్, బోనెట్, బంపర్ మధ్య సన్నని లైట్ బార్ ఉండనుంది. క్లామ్‌షెల్ స్టైల్ బోనెట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లు దీనికి గంభీరమైన రూపాన్ని ఇస్తాయి.
సైడ్ ప్రొఫైల్: ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్, రీడిజైన్ చేసిన వింగ్ మిర్రర్స్ మరియు పెద్ద కిటికీలు ఈ ఎస్‌యూవీకి క్లీన్ లుక్‌ను అందిస్తాయి.
వెనుక భాగం: హారిజాంటల్ టైల్ ల్యాంప్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు మెటాలిక్ ఇన్సర్ట్‌తో కూడిన కొత్త రియర్ బంపర్ అంచనా వేస్తున్నారు.
కొత్త హ్యుందాయ్ టక్సన్- ఇంజిన్, సామర్థ్యం..
కొత్త తరం టక్సన్‌లో కూడా హ్యుందాయ్ పాత ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగించే అవకాశం ఉంది. గతంలో భారత్‌లో లభించిన టక్సన్ ఇంజిన్ వివరాలు ఇవే:
పెట్రోల్: 2.0-లీటర్ ఇంజిన్, 154 హెచ్‌పీ పవర్‌ని, 192 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది (6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్).
డీజిల్: 2.0-లీటర్ ఇంజిన్, 184 హెచ్‌పీ పవర్‌ని, 416 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది (8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్).
అధునాతన ప్యాకేజింగ్ వల్ల కొత్త మోడల్‌లో క్యాబిన్ స్పేస్, బూట్ స్పేస్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్‌లో ఈ కొత్త మోడల్ ఎప్పుడు విడుదలవుతుందనే దానిపై కార్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మోడల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


