2026 Renault Duster : రెనాల్ట్ డస్టర్ కొనాలా? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఇలా..
Renault Duster on road price in Hyderabad : రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే హైదరాబాద్‌లో ఈ 2026 రెనాల్ట్ డస్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
భారత ఎస్యూవీ సెగ్మెంట్లో మరో సంచలనం! ఐకానిక్ ‘డస్టర్’ని రెనాల్ట్ సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. మరి ఈ 2026 రెనాల్ట్ డస్టర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్‌లో రెనాల్ట్ డస్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు..
2026 రెనాల్ట్ డస్టర్ ఆథెంటిక్ 1.0 టర్బో- రూ. 12.82 లక్షలు
ఇవొల్యూషన్ 1.0 టర్బో- రూ. 14.28 లక్షలు
ఇవొల్యూషన్ 1.3 టర్బో- రూ. 15.93 లక్షలు
టెక్నో 1.0 టర్బో- రూ. 16.47 లక్షలు
ఇవొల్యూషన్ 1.3 టర్బో డీసీటీ- రూ. 17.76 లక్షలు
టెక్నో 1.3 టర్బో- రూ. 17.76 లక్షలు
టెక్నో 1.3 టర్బో డీసీటీ- రూ. 18 లక్షలు
టెక్నో ప్లస్ 1.3 టర్బో- రూ. 18.73 లక్షలు
టెక్నో ప్లస్ 1.3 టర్బో డీటీ- రూ. 18.98 లక్షలు
టెక్నో 1.3 టర్బో డీసీటీ- రూ. 19.46 లక్షలు
టెక్నో 1.3 టర్బో డీటీ డీసీటీ- రూ. 19.71 లక్షలు
టెక్నో ప్లస్ 1.3 టర్బో డీసీటీ- రూ. 20.44 లక్షలు
ఐకానిక్ 1.3 టర్బో - రూ. 20.80 లక్షలు
ఐకానిక్ లాంచ్ ఎడిషన్- రూ. 20.80 లక్షలు
ఐకానిక్ 1.3 టర్బో డీటీ- రూ. 21.04 లక్షలు
ఐకానిక్ 1.3 టర్బో డీసీటీ- రూ. 22.63 లక్షలు
ఐకానిక్ లాంచ్ ఎడిషన్ డీసీటీ- రూ. 22.63 లక్షలు
ఐకానిక్ 1.3 టర్బో డీటీ డీసీటీ- రూ. 22.87 లక్షలు
అంటే హైదరాబాద్‌లో 2026 రెనాల్ట్ డస్టర్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 12.82 లక్షల నుంచి రూ. 22.87 లక్షల వరకు ఉంటుంది. పైన చెప్పినవి అన్నీ పెట్రోల్ వేరియంట్లే. డస్టర్ ఎస్‌యూవీలో డీజిల్, సీఎన్జీ ఆప్షన్స్‌ని సంస్థ ఇవ్వలేదు.
సాధారణంగా ఏదైనా కొత్త మోడల్ని లాంచ్ చేసినప్పుడు సంస్థ దాని ఎక్స్‌షోరూం ధరను మాత్రమే ప్రకటిస్తుంది. కానీ దాని ఆన్‌రోడ్ ప్రైజ్ వేరుగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్సులు వేరువేరుగా ఉండటమే ఇందుకు కారణం.
అందుకే ఏదైనా కారు కొనాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, దాని ఎక్స్‌షోరూం ప్రైజ్‌తో పాటు ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకోవడం కూడా ఉత్తమం.
అంతేకాదు, మీరు మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే, కారు టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు, ఆ సమయంలో ఏవైనా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. మీ బడ్జెట్‌కి అది ఉపయోగపడుతుంది.
2026 రెనాల్ట్ డస్టర్ బేస్ వేరియంట్ కొనొచ్చా?
రెనాల్ట్ డస్టర్ ఎస్యూవీ ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ‘ఆథెంటిక్’.. ధర తక్కువైనా సరే ఫీచర్ల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎస్‌యూవీకి ఉండాల్సిన రగ్గడ్నెస్, ప్రయాణికులకు కావాల్సిన భద్రతను మేళవించి ఈ వేరియంట్‌ను రూపొందించారు.
లోపలి భాగంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రాథమిక అవసరాలకు మించిన ఫీచర్లను రెనాల్ట్ చేర్చింది. అవి..
డిజిటల్ డిస్‌ప్లే: డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని అందించడానికి 7-ఇంచ్ టీఎఫ్టీ డ్రైవర్ డిస్‌ప్లే ఉంది.
పవర్ విండోస్: నాలుగు తలుపులకు 'ఆటో అప్/డౌన్' ఫీచర్‌తో కూడిన పవర్ విండోస్ రావడం గమనార్హం.
సెంట్రల్ కన్సోల్: లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు చేతులకు విశ్రాంతినిచ్చేలా స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్‌తో కూడిన సెంట్రల్ కన్సోల్‌ను అందించారు.
అదనపు ఫీచర్లు: ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, వన్-టచ్ ఎల్‌ఈడీ రూమ్ లైట్లు, 2026 రెనాల్ట్ డస్టర్ వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


