2026 Skoda Kushaq : సరికొత్త అవతారంలో ‘స్కోడా కుషాక్’- రూ. 10.6లక్షల ధరకు ఎస్​యూవీ లాంచ్​..

Skoda Kushaq facelift : స్కోడా సంస్థ కొత్త కుషాక్​ని ఇండియాలో లాంచ్​ చేసింది. ఈ కుషాక్​ ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 10.69లక్షలుగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ వేరియంట్లు, ఫీచర్లు, ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 21, 2026, 15:30:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్​లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్కోడా కుషాక్.. ఇప్పుడు మరిన్ని హంగులతో మార్కెట్లోకి ప్రవేశించింది. రూ. 10.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదలైన ఈ స్కోడా కుషాక్​ ఫేస్​లిఫ్ట్​.. కొత్త ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు, వేరియంట్లలో కీలక మార్పులు చేశారు. వాటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

2026 స్కోడా కుషాక్​..
2026 స్కోడా కుషాక్​..

2026 స్కోడా కుషాక్​- ఇంజిన్, పర్ఫార్మెన్స్​..

కొత్త కుషాక్ పాత రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగిస్తోంది, కానీ గేర్‌బాక్స్ విషయంలో కీలక మార్పులు వచ్చాయి:

1.0-లీటర్ టీఎస్​ఐ: ఇది 115 హెచ్​పీ పవర్, 178 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఇది 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. దీని మైలేజీ లీటరుకు 19.66 కి.మీ (మాన్యువల్), 19.09 కి.మీ (ఆటోమేటిక్) గా కంపెనీ పేర్కొంది.

1.5-లీటర్ టీఎస్​ఐ: ఇది 150 హెచ్​పీ పవర్, 250 ఎన్​ఎం టార్క్‌ను ఇస్తుంది. దీనికి 7-స్పీడ్ డీఎస్​జీ గేర్‌బాక్స్ జత చేశారు. ఇందులో ఉన్న 'యాక్టివ్ సిలిండర్ టెక్నాలజీ' వల్ల ఇంజిన్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు రెండు సిలిండర్లు ఆగిపోయి, ఇంధన పొదుపును (18.72 కేఎంపీఎల్​) పెంచుతాయి.

2026 స్కోడా కుషాక్​- వేరియంట్లు, ఫీచర్లు..

స్కోడా కుషాక్ ఫేస్​లిఫ్ట్​ మొత్తం ఐదు ట్రిమ్స్‌లో లభిస్తుంది. అవి క్లాసిక్+, సిగ్నేచర్​, స్పోర్ట్​లైన్​, ప్రెస్టీజ్​ అండ్​ మాంటే కార్లో.

బేస్ వేరియంట్ (క్లాసిక్+): ఇందులో ఇప్పుడు ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగులు, ఎల్​ఈడీ లైటింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హై-ఎండ్ వేరియంట్లు: ప్రెస్టీజ్ వేరియంట్‌లో వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్, వెనుక సీటు మసాజ్ ఫంక్షన్ వంటి లగ్జరీ ఫీచర్లు చేర్చారు.

మాంటే కార్లో : ఇది స్పోర్టీ లుక్ కోరుకునే వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. బ్లాక్-అవుట్ ఎక్స్‌టీరియర్, రెడ్ యాక్సెంట్స్‌తో ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

2026 స్కోడా కుషాక్​- భద్రత, కేర్​..

భద్రత విషయంలో కుషాక్ రాజీ పడలేదు. ఇది గ్లోబల్​ ఎన్​సీఏపీలో 5-స్టార్ రేటింగ్‌ను నిలబెట్టుకుంది. ఇప్పుడు అన్ని వేరియంట్లలో కలిపి మొత్తం 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, స్కోడా 'సూపర్ కేర్' ప్యాకేజీని అందిస్తోంది. దీని కింద 4 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఉచిత మెయింటెనెన్స్ సౌకర్యాలు లభిస్తాయి.

2026 స్కోడా కుషాక్​- వేరియంట్లు, వాటి ధరలు..

వేరియంట్

1.0 టీఎస్​ఐ ఎంటీ

1.0 టీఎస్​ఐ ఏటీ

1.5 టీఎస్​ఐ డీఎస్​జీ

Classic+రూ. 10.69 లక్షలురూ. 12.69 లక్షలు
Signatureరూ. 14.59 లక్షలురూ. 15.59 లక్షలు
Sportlineరూ. 14.74 లక్షలురూ. 15.74 లక్షలు
Prestigeరూ. 16.79 లక్షలురూ. 17.59 లక్షలురూ. 18.79 లక్షలు
Monte Carloరూ. 17.89 లక్షలురూ. 18.99 లక్షలు
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More