Renault Kwid : 2026 రెనాల్ట్ క్విడ్- వేరియంట్లు, వాటి ధరలు, ఫీచర్లు..
Renault Kwid 2026 : ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్, భారత మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌తో ‘రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్’ మోడల్‌ను ఇటీవలే విడుదల చేసింది. ఈ కారు వేరియంట్లు, వాటి ధరలు, వాటి ఫీచర్ల వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతదేశపు మోస్ట్ పాపులర్ ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన 'రెనాల్ట్ క్విడ్' సరికొత్త అవతారంలో మార్కెట్లోకి అడుగుపెట్టింది. మైల్డ్ డిజైన్ మార్పులు, అదనపు సేఫ్టీ ఫీచర్లతో కూడిన 2026 క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రెనాల్ట్ ఇండియా ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సరికొత్త లైనప్‌ను కంపెనీ కేవలం రెండు ట్రిమ్స్- ‘ఎవల్యూషన్’, ‘క్లైంబర్’లలో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. మెకానికల్ పరంగా ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయనప్పటికీ, ఫీచర్లు, ధరల విషయంలో కియా కొన్ని కీలక సర్దుబాట్లు చేసింది.

రెనాల్ట్ క్విడ్ ఫేస్లిఫ్ట- ధరలు..
క్విడ్ ఎవల్యూషన్ (మాన్యువల్): రూ. 4.53 లక్షలు
క్విడ్ ఎవల్యూషన్ (ఏఎంటీ): రూ. 4.90 లక్షలు
క్విడ్ క్లైంబర్ (మాన్యువల్): రూ. 5.15 లక్షలు
క్విడ్ క్లైంబర్ (ఏఎంటీ): రూ. 5.61 లక్షలు
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- డీలర్ ఫిట్టెడ్ సీఎన్జీ కిట్..
సీఎన్జీ వేరియంట్ కావాలనుకునే కస్టమర్ల కోసం డీలర్ వద్దే రెట్రోఫిట్టెడ్ సీఎన్జీ కిట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మాన్యువల్ వేరియంట్లకు అదనంగా రూ. 70,450 చెల్లించి ఈ కిట్ ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చు. దీనికి కంపెనీ స్టాండర్డ్‌గా 3 సంవత్సరాలు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- వేరియంట్ల వారీగా లభించే ముఖ్యమైన ఫీచర్లు..
క్విడ్ ఎవల్యూషన్ :
- ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్
- డిజిటల్ ఎల్‌ఈడీ క్లస్టర్
- ఫోన్ మిర్రరింగ్‌తో కూడిన 8.0-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- కీలెస్ ఎంట్రీ
- ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్
క్విడ్ క్లైంబర్ :
- డ్యూయల్ టోన్ వీల్ కవర్స్
- స్టైలిష్ డోర్ క్లాడింగ్ అండ్ రూఫ్ రైల్స్
- పవర్ మిర్రర్స్ అండ్ ఆల్ 4 పవర్ విండోస్
- డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్
- స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
- సిక్స్ ఎయిర్‌బ్యాగ్‌లు అండ్ రివర్స్ కెమెరా
- రియర్ పార్సెల్ షెల్ఫ్
రెనాల్ట్ క్విడ్ 2026- ఇంటీరియర్, సేఫ్టీ అప్‌డేట్స్..
2026 క్విడ్ క్యాబిన్ లేఔట్‌లో జరిగిన అతిపెద్ద మార్పు ఏమిటంటే, ఇందులో రెనాల్ట్ కైగర్ కారు నుంచి సేకరించిన త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను అమర్చారు. దీనిపైనే ఇన్ఫోటైన్‌మెంట్ కంట్రోల్స్ ఉంటాయి. మిగిలిన ఫీచర్లలో సెంటర్ మిడ్ స్క్రీన్‌తో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్డ్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 8-ఇంచ్ టచ్‌స్క్రీన్, ఎల్లో యాక్సెంట్స్‌తో కూడిన బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు ఉన్నాయి.
భద్రతకు పెద్దపీట వేస్తూ రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పుడు స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించారు. వీటితో పాటు ఈబీడీతో కూడిన ఏబీఎస్, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్‌బెల్ట్ రిమైండర్- ఏఎంటీ వేరియంట్లలో మాత్రమే లభించే 'హిల్ స్టార్ట్ అసిస్ట్' వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


