Tata Nexon : బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌లో.. వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది?
Tata Nexon value for money variants : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్ ఒకటి. అయితే ఇందులో ఉన్న డజన్ల కొద్దీ వేరియంట్లలో ఏది కొనాలా అని కన్ఫ్యూజ్ అవ్వడం సాధారణం! ఈ నేపథ్యంలో ఫీచర్లు, బడ్జెట్ పరంగా పర్ఫెక్ట్ ఛాయిస్ ఏదో ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్‌కు చెందిన 'టాటా నెక్సాన్' తిరుగులేని అమ్మకాలతో దూసుకుపోతోంది. స్టైలిష్ లుక్, అదిరిపోయే ఫైవ్-స్టార్ సేఫ్టీ రేటింగ్స్ ఉండటంతో ఎస్‌యూవీ ప్రియులు దీనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే షోరూమ్‌కి వెళ్లిన కస్టమర్లకు టాటా నెక్సాన్ వేరియంట్ల లిస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం! ప్రస్తుతం ఈ కారు స్మార్ట్, ప్యూర్+, క్రియేటివ్, క్రియేటివ్+, ఫియర్‌లెస్+ అనే ఐదు ప్రధాన ట్రిమ్స్‌లో లభిస్తోంది.

దీనికి తోడు సన్‌రూఫ్ కోసం (ఎస్), పనోరమిక్ సన్‌రూఫ్ కోసం (పీఎస్), అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ కోసం (ఏ) వంటి సబ్-వేరియంట్లు కూడా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆప్షన్లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరలు రూ. 7.37 లక్షల నుంచి రూ. 14.22 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇంత పెద్ద లైనప్‌లో సగటు కస్టమర్‌కు పైసా వసూల్ అన్పించే బెస్ట్ వేరియంట్ ఏది అంటే.. కచ్చితంగా టాటా నెక్సాన్ ‘క్రియేటివ్+’ అని చెప్పవచ్చు.
ఎందుకు 'క్రియేటివ్+' వేరియంట్ బెస్ట్ ఛాయిస్?
బడ్జెట్ పరిమితులు ఉంటూనే.. లగ్జరీ కార్లలో ఉండే ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారికి టాటా నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్ ఒక పర్ఫెక్ట్ బ్రిడ్జ్‌లా పనిచేస్తుంది. టాప్-ఎండ్ వేరియంట్లకు పెట్టే భారీ ధరతో పనిలేకుండా, నిత్య జీవితంలో కచ్చితంగా అవసరమయ్యే అప్‌డేటెడ్ టెక్నాలజీ ఫీచర్లన్నీ టాటా మోటార్స్ ఇందులో అందించింది. అందుకే ఇది నెక్సాన్ లైనప్‌లోనే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌గా నిలిచింది.
టాటా నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్‌లో లభించే ఫీచర్లు ఇవే..
ఎక్స్‌టీరియర్ లుక్: ఈ వేరియంట్‌లో 16-ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్, సీక్వెన్షియల్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ వస్తాయి. ఇవి కారుకు రోడ్ ప్రెజెన్స్‌తో పాటు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
ఇంటీరియర్ కంఫర్ట్: క్యాబిన్ లోపల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి.
ఇన్ఫోటైన్‌మెంట్: ఈ ఎస్‌యూవీలో భారీ 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది.
సేఫ్టీ ఫీచర్లు: ఈ ప్రైస్ రేంజ్‌లో మరే కారులో లేని విధంగా 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి హై-ఎండ్ సేఫ్టీ ఫీచర్లు లభిస్తాయి.
టాటా నెక్సాన్ క్రియేటివ్+ ధర ఎంత? ఎందుకు కొనాలి?
టాటా నెక్సాన్ క్రియేటివ్+ వేరియంట్ ధరలు రూ. 10.34 లక్షల నుంచి రూ. 13.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉన్నాయి. "టాప్ ఎండ్ వేరియంట్ అయిన ఫియర్‌లెస్‌కు భారీగా అదనపు డబ్బులు పెట్టే కంటే, క్రియేటివ్+ ఎంచుకోవడం వల్ల కస్టమర్లకు భారీగా డబ్బు ఆదా అవుతుంది," అని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని ట్రాఫిక్‌లో కారును నడపడానికి, పార్కింగ్ చేయడానికి ఇందులో ఇచ్చే 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్ ఫీచర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. లోయర్ వేరియంట్లలో అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ లైటింగ్ ఉండవు కాబట్టి అవి చూడటానికి కాస్త సాధారణంగా అన్పిస్తాయి. అంతేకాదు, ఈ క్రియేటివ్+ ట్రిమ్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ మూడు ఇంజన్ ఆప్షన్లలోనూ.. మాన్యువల్, ఏఎంటీ, డీసీఏ గేర్‌బాక్స్ కాంబినేషన్లలో లభిస్తుండటం విశేషం. వీటిల్లో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


