Affordable Electric car : కియా నుంచి అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. టాటా నెక్సాన్ ఈవీకి పోటీగా!
Kia Syros EV : కియా సంస్థలోనే అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ కారు ఒకటి ఇండియాలో లాంచ్‌కు రెడీ అవుతోంది. దాని పేరు కియా సైరోస్ ఈవీ. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్ ఈవీకి గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మోడల్ లాంచ్, రేంజ్, ధర సహా ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రముఖ దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ ‘కియా మోటార్స్’ భారత మార్కెట్లో తన ఈవీ పోర్ట్‌ఫోలియోను భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ మార్కెట్లో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలనే లక్ష్యంలో భాగంగా 8 ఎలక్ట్రిఫైడ్ (ఎలక్ట్రిక్/హైబ్రిడ్) వాహనాలను తీసుకురానుంది. ఇందులో కియా నుంచి రాబోతున్న అత్యంత చౌకైన, చిన్న ఎలక్ట్రిక్ కారు ‘కియా సైరోస్ ఈవీ’పై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 2026లో లాంచ్ కానున్న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, ఫీచర్లపై ఇప్పటివరకు ఉన్న వివరాలు ఇక్కడ చూసేయండి..

కియా సైరోస్ ఈవీ భారతదేశంలో విభిన్న బడ్జెట్ శ్రేణుల్లో ఉన్న కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. టెస్టింగ్ సమయంలో లీకైన చిత్రాల ప్రకారం ఈ కారుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కియా సైరోస్ ఈవీ- ధర, మార్కెట్ పోటీ..
కియా సైరోస్ ఈవీ భారతదేశంలో ఈ బ్రాండ్ నుండి రాబోతున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారు కానుంది.
ధర అంచనా: ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అధికారిక ధరలను ఆగస్టు 2026 లో ప్రకటించనున్నారు. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 15 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ ధర రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది.
ప్రత్యర్థులు: ఈ ప్రైస్ పాయింట్లో ఇది మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
కియా సైరోస్ ఈవీ- బ్యాటరీ, రేంజ్..
ఈ కారును కియా సంస్థ అంతర్జాతీయంగా విక్రయించే హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ఆధారిత 'కే1 ఆర్కిటెక్చర్' పై నిర్మిస్తోంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ (ఎఫ్‌డబ్ల్యూడీ) సిస్టమ్‌తో రానుంది.
గ్లోబల్ మార్కెట్లో ఉన్న ఇన్‌స్టర్ ఈవీ స్పెసిఫికేషన్ల ఆధారంగా సైరోస్ ఈవీలో రెండు బ్యాటరీ ఆప్షన్లను ఆశించవచ్చు:
స్టాండర్డ్ రేంజ్ (42కేడబ్ల్యూహెచ్): ఇది 97పీఎస్ పవర్, 147ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 355 కిలోమీటర్ల (డబ్ల్యూఎల్టీపీ) రేంజ్ ఇస్తుందని అంచనా.
లాంగ్ రేంజ్ (49కేడబ్ల్యూహెచ్): ఇది 115పీఎస్ పవర్, 147ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 370 నుంచి 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
కియా సైరోస్ ఈవీ- ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లు..
స్పై షాట్స్ (టెస్టింగ్ చిత్రాల) ప్రకారం.. ఈ కియా సైరోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ తన ఐసీఈ (పెట్రోల్/డీజిల్) మోడల్ లాగే బాక్సీ స్టైల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఎలక్ట్రిక్ వెర్షన్ కాబట్టి కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు.
సైరోస్ ఈవీ ముఖ్యమైన అప్‌డేట్స్ :
- ఫ్రంట్ ప్యానెల్‌పైనే ఛార్జింగ్ ఫ్లాప్ ఉంటుంది.
- గాలిని తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, కొత్త బంపర్లు, రూఫ్ రైల్స్ ఉంటాయి.
- ఇందులో అతి ముఖ్యంగా వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్), వెహికల్-టు-వెహికల్ (వీ2వీ) ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంటే, ఈ కారు బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు లేదా మరొక ఈవీ కారుకు ఛార్జింగ్ ఇచ్చుకోవచ్చు.
ఇక ఈ కియా అఫార్డిబుల్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ డేట్‌ని సంస్థ ప్రకటిచాల్సి ఉంది.
కియా ఫ్యూచర్ రోడ్ మ్యాప్..
కియా ఇండియా లైనప్‌లో కేవలం సైరోస్ ఈవీ మాత్రమే కాకుండా మరికొన్ని హైబ్రిడ్ కార్లు కూడా రాబోతున్నాయి. ఇందులో సోరెంటో హైబ్రిడ్, కార్నివాల్ హైబ్రిడ్, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ హైబ్రిడ్ కారును 2027లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


