Hybrid cars : హ్యుందాయ్ నుంచి 3 హైబ్రిడ్ ఎస్‌యూవీలు- మారుతీ, టయోటాలకు గట్టి పోటీ..!
Hyundai Creta Hybrid : హ్యుందాయ్ నుంచి రానున్న రోజుల్లో 3 హైబ్రిడ్ ఎస్‌యూవీలు లాంచ్ కాబోతున్నాయి. ఇవి మారుతీ సుజుకీ- టయోటా రాజ్యమేలుతున్న ఈ విభాగంలో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. వీటి వివరాలను ఇక్కడ చూసేయండి..
Hyundai Hybrid SUVs India Launch : భారతదేశంలో ప్రస్తుతం అమ్ముడవుతున్న హైబ్రిడ్ (పెట్రోల్ + ఎలక్ట్రిక్) ప్యాసింజర్ వాహనాలలో దాదాపు 80 శాతం వాటా టయోటా, మారుతీ సుజుకీ సుజుకీదే ఉంది. ఈ విభాగంలో ఇప్పటివరకు సరైన పట్టు సాధించని కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. రాబోయే కొద్ది సంవత్సరాల్లో మార్కెట్‌ను శాసించేందుకు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని చెప్పుకోవాలి. తన అత్యంత ప్రజాదరణ పొందిన 'క్రెటా' నెక్ట్స్ జనరేషన్ మోడల్‌తో పాటు వేర్వేరు ధరల శ్రేణిలో 3 సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి కసరత్తులు చేస్తోంది. ఈ హైబ్రిడ్ ఎస్‌యూవీల లాంచ్ టైమ్‌లైన్, ప్రత్యేకతల వివరాలు ఇక్కడ చూద్దాం.
గత ఆర్థిక సంవత్సరం 2026 (ఎఫ్వై26) లో భారత్‌లో ఏడాదికి 2 లక్షలకు పైగా సేల్స్ సాధించిన ఏకైక మిడ్‌సైజ్ ఎస్‌యూవీగా క్రెటా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న మోడల్‌లో హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురావడం ద్వారా హ్యుందాయ్ మార్కెట్ రారాజుగా మారాలని చూస్తోంది.
హ్యుందాయ్ తీసుకురాబోతున్న ఆ 3 కీలక హైబ్రిడ్ ఎస్‌యూవీల వివరాలు ఇవీ..
1. నెక్ట్స్-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్..
హ్యుందాయ్ హైబ్రిడ్ ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మోడల్ ఇదే. ఈ హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
కొత్త ప్లాట్‌ఫారమ్: రాబోయే కొత్త తరం క్రెటా కారును సరికొత్త 'కే3 ప్లాట్‌ఫారమ్' పై తయారు చేయనున్నారు. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత పెద్దదిగా, దాదాపు 4.5 మీటర్ల పొడవుతో ఉండబోతోంది. ఇప్పటికే దీని టెస్టింగ్ మోడల్స్ రోడ్లపై కనిపించాయి.
క్యాబిన్ అండ్ ఇంజన్: దీని ఇంటీరియర్ క్యాబిన్‌లో అత్యాధునిక టెక్నాలజీ, ప్రీమియం మెటీరియల్స్ వాడనున్నారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అలాగే కొనసాగినప్పటికీ.. ఇందులో రాబోయే 'హైబ్రిడ్ వేరియంట్' అతిపెద్ద మెకానికల్ అప్‌గ్రేడ్‌గా నిలవనుంది.
2. సరికొత్త 3-రో ఫ్యామిలీ ఎస్‌యూవీ..
అల్కజార్ కారుకు పైన, ఇటీవల నిలిపివేసిన టక్సన్ కారుకు కింద ఉండేలా హ్యుందాయ్ ఒక సరికొత్త త్రీ-రో ఫ్యామిలీ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. దీనికి అంతర్గతంగా 'Ni1i' అనే కోడ్‌నేమ్ పెట్టారు.
లాంచ్ టైమ్‌లైన్: ఈ లార్జ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ 2027 చివరి నాటికి మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇంజన్ టెక్నాలజీ: ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌కు ఎలక్ట్రిక్ అసిస్టెన్స్‌ను జోడించిన హైబ్రిడ్ సెటప్‌ను వాడనున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు (సిటీ ట్రాఫిక్‌లో) ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుంది. దీనివల్ల మైలేజ్/ఇంధన సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇదే ఇంజన్ సెటప్‌ను క్రెటా, కియా సెల్టోస్ కార్లలోకి కూడా తీసుకురానున్నారు.
3. ప్రీమియం ఫుల్-సైజ్ ‘పాలిసేడ్ హైబ్రిడ్’..
హ్యుందాయ్ తన అప్పర్ ఎండ్ ప్రీమియం విభాగంలో గ్లోబల్ మోడల్ అయిన 'హ్యుందాయ్ పాలిసేడ్ హైబ్రిడ్' ను భారత్‌కు తీసుకురావడానికి అధ్యయనం చేస్తోంది.
హ్యుందాయ్ హైబ్రిడ్ కార్లు- 2028లో ఎంట్రీ!
ఒకవేళ ఇది 2028 నాటికి లాంచ్ అయితే.. భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ నుంచి లభించే అత్యంత ఖరీదైన, ప్రీమియం ఐసీఈ ఎస్‌యూవీగా ఇది నిలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ఈ ఫుల్-సైజ్ 7-సీటర్ పాలిసేడ్‌లో పవర్‌ఫుల్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ ఉంటుంది.
ఈ మూడు ప్రీమియం, మిడ్-సైజ్ కార్లతో పాటు, రాబోయే రోజుల్లో బడ్జెట్ (తక్కువ ధర) విభాగంలో కూడా మరిన్ని హైబ్రిడ్ ఎస్‌యూవీలను ప్రవేశపెట్టాలని హ్యుందాయ్ భావిస్తోంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో హైబ్రిడ్ కార్ల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


