Hyundai Creta Facelift : 2027 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ.. మరింత పెద్దగా, హైబ్రిడ్ ఇంజన్‌తో!
2027 Hyundai Creta : హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌పై బిగ్ అప్డేట్! ఈ ఎస్‌యూవీకి సంబంధించిన స్పై షాట్స్ లీక్ అయ్యాయి. చూస్తుంటే, ఈ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీకి హ్యుందాయ్ సంస్థ భారీ మార్పులే చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 2027 హ్యుందాయ్ క్రెటాపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగుగొందుతున్న హ్యుందాయ్ క్రెటా.. తన చరిత్రలోనే అతిపెద్ద జనరేషన్ మార్పునకు సిద్ధమవుతోంది! మూడొవ జనరేషన్‌కు చెందిన ఈ సరికొత్త క్రెటా టెస్ట్ మోడల్.. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ రోడ్లపై ప్రస్తుత క్రెటాతో కలిసి నడుస్తూ తొలిసారి కెమెరాకు చిక్కింది. కంపెనీ దీనిని సరికొత్త కే3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తోంది. దీనివల్ల కారు సైజ్ పెరగడమే కాకుండా.. ఫ్యూచరిస్టిక్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్లకు ఇది సపోర్ట్ చేయనుంది. ఈ మోడల్ 2026 చివరి నాటికి గ్లోబల్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చి, 2027 ప్రారంభంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే సరికొత్త క్రెటా లుక్, స్పేస్, టెక్నాలజీ పరంగా పూర్తిగా మారిపోనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ‘హ్యుందాయ్ కోనా’ లైన్-అప్‌తో కలిసి 'ఎస్ఎక్స్3' అనే కోడ్‌నేమ్‌తో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది.
లీకైన వివరాల ప్రకారం నెక్ట్స్-జనరేషన్ హ్యుందాయ్ క్రెటాలో రాబోయే టాప్ 5 మేజర్ అప్‌డేట్లు ఇక్కడ చూద్దాము..
1. భారీ సైజ్ - అదిరిపోయే రోడ్ ప్రెజెన్స్..
మనాలీలో లీకైన స్పై వీడియోల ప్రకారం, పాత క్రెటా పక్కన నిలబెట్టినప్పుడు హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ చాలా పొడవుగా, వెడల్పుగా, ఎత్తుగా కనిపించింది!
పొడవు: ప్రస్తుత క్రెటా పొడవు 4,330 ఎంఎం ఉండగా.. కొత్త మోడల్ ఏకంగా 4,500 ఎంఎం పొడవుతో రానుంది.
క్యాబిన్ స్పేస్: కారు వీల్‌బేస్ పెరగడం వల్ల వెనుక సీట్లలో ప్రయాణించే వారికి అద్భుతమైన లెగ్‌రూమ్, షోల్డర్ రూమ్ లభిస్తుంది. అలాగే బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) కూడా ప్రస్తుతమున్న 433 లీటర్ల కంటే చాలా ఎక్కువగా ఉండబోతోంది.
డిజైన్: పాత కర్వీ లుక్ కాకుండా, బాక్సీ, మరింత మస్క్యులర్ ఎస్‌యూవీ స్టాన్స్‌తో ఇది రోడ్డుపై గంభీరంగా కనిపించనుంది.
2. సరికొత్త 'కే3' ప్లాట్‌ఫామ్..
2027 క్రెటా ఎస్‌యూవీని హ్యుందాయ్ గ్రూప్‌కి చెందిన అడ్వాన్స్‌డ్ 'కే3' ప్లాట్‌ఫామ్‌పై డెవలప్ చేస్తున్నారు. (ఇదే ప్లాట్‌ఫామ్‌పై నెక్ట్స్ జనరేషన్ కియా సెల్టోస్ కూడా రానుంది).
ఈ ప్లాట్‌ఫామ్ కారు క్రాష్ సేఫ్టీని పెంచడమే కాకుండా, రైడింగ్ కంఫర్ట్, డ్రైవింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరుస్తుంది.
ముఖ్యంగా ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు హైబ్రిడ్, ఈవీ మోటార్లకు కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
3. రంగంలోకి 'స్ట్రాంగ్ హైబ్రిడ్' ఇంజన్!
ప్రస్తుతమున్న నమ్మకమైన 1.5ఎల్ పెట్రోల్, 1.5ఎల్ టర్బో-పెట్రోల్, 1.5ఎల్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అలాగే కొనసాగుతాయి.
పెద్ద మార్పు: మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు హ్యుందాయ్ ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త 1.5-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను పరిచయం చేయనుంది.
ఇది సిటీ ట్రాఫిక్‌లో అద్భుతమైన మైలేజీని అందిస్తుంది. అదనంగా, టాప్ వేరియంట్లలో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ, మల్టీ-లింక్ రియర్ సస్పెన్షన్ వచ్చే అవకాశం ఉంది.
4. ప్లియోస్ కనెక్ట్ అండ్ ఎస్‌డీవీ టెక్నాలజీ..
సాంకేతికత పరంగా క్రెటా సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. హ్యుందాయ్ ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా పరిచయం చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటీరియర్‌లోకి రానుంది.
ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్: ఇందులో ఆండ్రాయిడ్ ఆధారిత సరికొత్త 'ప్లియోస్ కనెక్ట్' (Pleos Connect) ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉండబోతోంది. ఇది బూట్ అవ్వడానికి చాలా వేగంగా స్పందిస్తూ, స్మార్ట్‌ఫోన్ లాంటి ఇంటర్‌ఫేస్‌ను ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్ ఆధారిత వాహనం (ఎస్‌డీవీ): కొత్త క్రెటా కంప్లీట్ సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్‌గా మారనుంది. దీనివల్ల ఓవర్-ది-ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్స్ ద్వారా భవిష్యత్తులో కారు ఫీచర్లు, ఇన్ఫోటైన్‌మెంట్ మాత్రమే కాకుండా.. పర్ఫార్మెన్స్ లేదా సస్పెన్షన్ సెట్టింగ్స్‌ను కూడా కంపెనీ రిమోట్‌గా అప్‌గ్రేడ్ చేయగలదు.
కారు లోపల భారీ స్క్రీన్లతో పాటు గేర్ మార్చడానికి లగ్జరీ ఈవీ కార్ల తరహాలో స్టీరింగ్ పక్కనే 'స్టాక్ టైప్ గేర్ సెలెక్టర్' ఇచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌లో లెవల్2+ అడాస్ సేఫ్టీ!
భద్రత విషయంలో రాజీ పడకుండా, మరిన్ని అదనపు సెన్సార్లు, కెమెరాలతో కూడిన 'లెవెల్ 2+ అడాస్ సూట్‌ను 2027 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీలో అందించనున్నారు. ఇది అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లను మరింత ఖచ్చితత్వంతో ఆపరేట్ చేస్తుంది.
ఈ విప్లవాత్మక మార్పులన్నీ చూస్తుంటే, నెక్ట్స్-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా మార్కెట్లోకి వచ్చాక మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మళ్లీ తన ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


