Electric cars : మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్​- ఏది కొనాలి?

Best electric car under 20 lakhs : మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్.. ఏ ఈవీలో రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? ఎందులో ఫీచర్లు అధికం? ఏది కొంటే బెటర్? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: May 15, 2026 4:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Maruti Suzuki e Vitara vs Hyundai Creta Electric : పెట్రోల్​, డీజిల్​ ధరలపై అనిశ్చితి, పర్యావరణ స్పృహ పెరగడంతో భారత ఆటోమొబైల్ మార్కెట్​లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ప్రజలు ఈ-ఎస్​యూవీలవైపు మొగ్గుచూపుతున్నారు. అందుకే, ఈ విభాగంలో పట్టు సాధించేందుకు దేశీయ కార్ల సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రధానంగా మారుతీ సుజుకీ ఈ విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలు కస్టమర్స్​ని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏ కారు పవర్‌ఫుల్? ఎందులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి? ఏది కొంటే బెస్ట్? పూర్తి వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా..
మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా..

మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- బ్యాటరీ ప్యాక్, రేంజ్..

మారుతీ సుజుకీ ఈ విటారా: ఇందులో వినియోగదారులకు రెండు బ్యాటరీ ఆప్షన్లు లభిస్తాయి. ఒకటి 49కేడబ్ల్యూహెచ్ కాగా, మరొకటి 61కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 543 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 144 బీహెచ్​పీ, 171 బీహెచ్​పీ పవర్‌ను జనరేట్ చేసే రెండు ఇంజన్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 189 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్: ఈ ఎలక్ట్రిక్ ఎస్​యూవీలో కూడా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 42 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ 420 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ 510 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇవి వరుసగా 132.7 బీహెచ్​పీ, 168.9 బీహెచ్​పీ పవర్‌ను ఉత్పత్తి చేసే పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌తో వస్తాయి.

మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- ఫీచర్లు..

ఫీచర్ల విషయానికి వస్తే రెండు కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేలా అత్యాధునిక టెక్నాలజీని జోడించాయి.

మారుతీ సుజుకీ ఈ విటారా ఫీచర్లు: ఈ ఈవీలో డ్యూయల్-టోన్ ఇంటీరియర్, 10.25-ఇంచ్​ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.09-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్​ప్లే, ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ-కలర్ అంబియెంట్ లైటింగ్, హర్మాన్ ఇన్‌ఫినిటీ ఆడియో సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు (10-వే పవర్ అడ్జస్టబుల్), పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఫీచర్లు: 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెహికల్-టు-లోడ్ (వీ2ఎల్) క్యాపబిలిటీ (దీని ద్వారా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు పవర్ ఇవ్వచ్చు), కూల్డ్ గ్లోవ్‌బాక్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్లు, 10.25-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- ధరలు..

ధర విషయంలో మారుతీ సుజుకీ సరికొత్త వ్యూహంతో మార్కెట్​లోకి వచ్చింది.

మారుతీ సుజుకీ ఈ విటారా సాధారణ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.99 లక్షలుగా ఉంది. అయితే, సంస్థ దీనిని బీఏఏఎస్ (బ్యాటరీ యాజ్​ ఏ సర్వీస్) ప్లాన్‌తో కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ ఎంచుకుంటే కారు ముందస్తు ధర కేవలం రూ. 10.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది. కాకపోతే బ్యాటరీ వినియోగానికి కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.02 లక్షలుగా ఉంది.

మారుతీ సుజుకీ ఈ విటారా వర్సెస్​ హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- ఏది కొనాలి?

మీకు ఎక్కువ రేంజ్, తక్కువ ముందస్తు ధర (బీఏఏఎస్ ప్లాన్ ద్వారా), మారుతీ సుజుకీ నమ్మకమైన సర్వీస్ కావాలనుకుంటే ‘ఈ విటారా’ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా వీ2ఎల్ ఫీచర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి లగ్జరీ ఫీచర్లు, క్రెటా బ్రాండ్ ఇమేజ్ కావాలనుకునే వారికి ‘క్రెటా ఎలక్ట్రిక్’ మంచి ఎంపిక.

మరి ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో మీరు ఏది కొంటున్నారు?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More