Renault Kwid : రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్- ధర, వేరియంట్లు, ఫీచర్లు ఇలా..
2026 Renault Kwid : భారత మార్కెట్లో మోస్ట్ పాపులర్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ‘రెనాల్ట్ క్విడ్’ సరికొత్త మార్పులతో విడుదలైంది. వేరియంట్ల సంఖ్యను తగ్గించి, ధరకు భారీగా కోత విధిస్తూ కస్టమర్లకు రెనాల్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ వివరాలను ఇక్కడ చూసేయండి..
రెనాల్ట్ ఇండియా తన క్విడ్ లైన్-అప్‌ను మరింత సులభతరం చేసింది. పాత వేరియంట్లను తీసేసి కేవలం ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు వేరియంట్లతో రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ని లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ 'అథెంటిక్'ను నిలిపివేయడం వల్ల కారు ప్రారంభ ధర రూ. 4.29 లక్షల నుంచి రూ. 4.52 లక్షలకు పెరిగినట్లు అనిపించినప్పటికీ.. మిగిలిన టాప్ వేరియంట్ల ధరలను కంపెనీ భారీగా తగ్గించింది.

ఈ నేపథ్యంలో ఈ 2026 రెనాల్ట్ క్విడ్ ఎస్‌యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- ఎక్స్‌షోరూం ధరలు..
ఎవల్యూషన్ (మాన్యువల్): రూ. 4.52 లక్షలు (గతంలో రూ. 4.66 లక్షలు - రూ. 14 వేలు తగ్గింది)
ఎవల్యూషన్ (ఏఎంటీ) : రూ. 4.89 లక్షలు (ధర తగ్గింది)
క్లైంబర్ (మాన్యువల్) : రూ. 5.14 లక్షలు (గతంలో రూ. 5.47 లక్షలు - రూ. 33 వేలు తగ్గింది)
క్లైంబర్ (ఏఎంటీ) : రూ. 5.60 లక్షలు (ధర తగ్గింది)
ఆన్‌లైన్ డిస్కౌంట్ ఆఫర్: రెనాల్ట్ అఫీషియల్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా 'క్లైంబర్' వేరియంట్‌ను బుక్ చేసుకునే కస్టమర్లకు రూ. 15,000 అదనపు క్యాష్ బెనిఫిట్ లభిస్తుంది. దీనివల్ల క్లైంబర్ మాన్యువల్ ఎఫెక్టివ్ ధర కేవలం రూ. 4.99 లక్షలకే (ఎక్స్-షోరూమ్) మారుతుంది.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- కొత్త లోగో.. అదిరిపోయే ఫీచర్లు
ఈ 2026 రెనాల్ట్ క్విడ్‌లో జరిగిన అతిపెద్ద మార్పు.. కారుపై సంస్థకు చెందిన అధునాతన గ్లోబల్ బ్రాండ్ లోగోను చేర్చడం. క్విడ్ తన పాత ఎస్‌యూవీ తరహా బోల్డ్ డిజైన్, బాడీ క్లాడింగ్‌ను అలాగే కొనసాగిస్తోంది. క్లైంబర్ వేరియంట్‌లో ప్రత్యేకమైన కలర్ యాక్సెంట్లు ఉన్నాయి.
కారు లోపలి భాగంలో లభించే ఫీచర్లు:
వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్-వ్యూ కెమెరా
డ్యూయల్ టోన్ క్యాబిన్ ఎంటీరియర్
రిమోట్ కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్
279 లీటర్ల భారీ బూట్ స్పేస్, ఎత్తు పల్లాల రోడ్లను తట్టుకునేలా 184 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్, పవర్‌ట్రెయిన్..
మెకానికల్‌గా కారులో ఎలాంటి మార్పులు లేవు. ఇది నమ్మకమైన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఈజీ-ఆర్ ఏఎంటీ ఆప్షన్లతో లభిస్తుంది. ఏఎంటీ వెర్షన్‌లో ప్రీమియం కార్లలో ఉండేలా రొటరీ గేర్ సెలెక్టర్ (రోటరీ నాబ్) రావడం విశేషం.
భద్రత పరంగా ఈ రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, సీట్ బెల్ట్ రిమైండర్లతో పాటు మొత్తం 17 రకాల స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను అందించారు.
భారత్‌లో 2015లో లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 4.5 లక్షలకు పైగా క్విడ్ కార్లు అమ్ముడైనట్లు రెనాల్ట్ ప్రకటించింది. మొదటిసారి కారు కొనేవారికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకే రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌లో భాగంగా సింప్లిఫైడ్ వేరియంట్లను తెచ్చినట్లు పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా ఉన్న రెనాల్ట్ షోరూమ్‌లలో ఈ కొత్త మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్షిప్షోరూమ్స్ని సందర్శించవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


