...
...
Next Story

Rinku Singh Father: కొడుకు క్రికెట్ కల కోసం గ్యాస్ సిలిండర్లు మోసి.. చివరి కోరిక తీరకుండానే మరణించిన రింకు సింగ్ తండ్రి

Rinku Singh Father: భారత డేంజరస్ బ్యాటర్ రింకు సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రింకును క్రికెటర్ గా తీర్చిదిద్దేందుకు జీవితం త్యాగం చేసిన అతని తండ్రి ఖాన్‌చంద్‌ మరణించారు. కొడుకును క్రికెటర్ ను చేసిన ఆయన చివరి కోరిక తీరకుండానే మరణించడం మరింత విషాదాన్ని నింపుతోంది.

Published on: Feb 27, 2026, 14:07:33 IST
Advertisement

కొడుకు కెరీర్ కోసం కష్టాలు పడి, తనయుడి క్రికెట్ కలను నిజం చేసిన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. ఇప్పుడు ఆ కొడుకు టీమిండియాకు ఆడుతున్నాడు. తండ్రి కష్టాన్ని వృథా కానివ్వలేదు. ఆ క్రికెటర్ పేరు రింకు సింగ్. రింకు కెరీర్ ను తీర్చిదిద్దిన ఆ తండ్రి ఖాన్‌చంద్‌ సింగ్. ఇవాళ (ఫిబ్రవరి 27) ఉదయం ఖాన్‌చంద్‌ మరణించారు. చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు.

ఎల్పీజీ సిలిండర్లు మోసి

తండ్రితో రింకు సింగ్ (instagram-rinkukumar12)
తండ్రితో రింకు సింగ్ (instagram-rinkukumar12)

రింకు సింగ్ ను క్రికెటర్ చేయడం కోసం ఖాన్‌చంద్‌ చాలా కష్టపడ్డారు. ఇండియన్ ఆయిల్ కు చెందిన గ్యాస్ కంపెనీ ఇండేన్‌లో ఖాన్‌చంద్‌ పనిచేశారు. రోజు ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసేవారు. ఆ సిలిండర్లను భుజాలపై మోసేవారు. ఈ సంపాదనతోనే కొడుకుకు క్రికెట్లో మెరుగైన శిక్షణ అందించారు.

ఆ తర్వాత కూడా

ఇండియన్ క్రికెటర్ గా రింకు సింగ్ ఎదిగిన తర్వాత కూడా ఖాన్‌చంద్‌ తన పని కొనసాగించారు. రింకు వద్దని చెప్పినా తండ్రి వినలేదు. పనిచేయకుండా ఖాళీగా ఉండాలా అంటూ తన వర్క్ కొనసాగించారు. తనకు లివర్ క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత మాత్రమే ఆయన తన పని మానేశారు.

లివర్ క్యాన్సర్ తోనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ హాస్పిటల్‌లో శుక్రవారం ఉదయం ఖాన్‌చంద్‌ తుది శ్వాస విడిచారు. టీ20 ప్రపంచకప్ కోసం ఇండియా టీమ్ తో ఉన్న రింకు సింగ్ ఈ వార్త తెలియగానే ఇంటికి బయల్దేరాడు.

చివరి కోరిక

కొడుకు క్రికెట్ కలను ఖాన్‌చంద్‌ నిజం చేశారు. రింకు సింగ్ ఇండియా టీమ్ కు ఆడుతుంటే తండ్రి గర్వంతో చూశారు. కానీ చివరి కోరిక తీరకుండానే కన్నుమూశారు. అదే రింకు సింగ్ పెళ్లి. సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో రింకు సింగ్ ఎంగేజ్మెంట్ జరిగింది. 2025 జూన్ 8న వీళ్ల నిశ్చితార్థం జరిగింది. 2025 నవంబర్ 18న పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మళ్లీ వాయిదా వేశారు.

పెళ్లి వాయిదా

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe