...
...
Next Story

T20 World Cup: టీమిండియా కష్టాలు డబుల్.. జట్టుకు దూరమైన డేంజరస్ బ్యాటర్.. అత్యవసరంగా ఇంటికి.. జింబాబ్వేతో మ్యాచ్ డౌట్!

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో డేంజర్ జోన్లో ఉన్న టీమిండియాకు కష్టాలు తప్పడం లేదు. స్టార్ బ్యాటర్ రింకు సింగ్ టీమ్ కు దూరమయ్యాడు. చెన్నై నుంచి తన సొంత ఇంటికి వెళ్లిపోయాడు. జింబాబ్వేతో మ్యాచ్ లో అతను ఆడటం అనుమానంగా మారింది.

Published on: Feb 25, 2026, 08:26:52 IST
Advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్ లో ఓడిన టీమిండియా సెమీస్ అవకాశాలు క్లిష్టం చేసుకుంది. ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్న ఇండియాకు మరింత షాకిచ్చే వార్త ఇది. టీమ్ కష్టాలు డబుల్ చేస్తూ డేంజరస్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును వీడాడు. ఈ స్టార్ బ్యాటర్ చెన్నై నుంచి డైరెక్ట్ గా యూపీ వెళ్లిపోయాడు. గురువారం జింబాబ్వేతో మ్యాచ్ లో అతను ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంటికి రింకు సింగ్

రింకు సింగ్ (PTI)
రింకు సింగ్ (PTI)

భారత జట్టు మిడిల్-ఆర్డర్ బ్యాటర్ రింకు సింగ్ ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైలో టీమ్ తో ఉన్న అతను హుటాహుటిన యూపీ బయల్దేరాడు. రింకు సింగ్ తండ్రి ఖాంచంద్ సింగ్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడమే ఇందుకు కారణం. ఫోర్త్ స్టేజీ క్యాన్సర్ తో పోరాడుతున్న రింకు సింగ్ తండ్రి ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్ పై ఉన్నట్లు తెలిసింది.

తండ్రి కోసం

క్యాన్సర్ తో పోరాడుతున్న తండ్రి పరిస్థితి అత్యంత సీరియస్ గా ఉండటంతో రింకు సింగ్ టీమ్ ను వీడాల్సి వచ్చింది. పీటీఐ ప్రకారం రింకు సింగ్ తండ్రి ఖాంచంద్ సింగ్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలోని ఓ హాస్పిటల్ లో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. "ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రింకు సింగ్ చెన్నై నుంచి ఇంటికి వెళ్లాడు. చెపాక్ లో ప్రాక్టీస్ సెషన్ కు అతను అటెండ్ కాలేదు’’ అని ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపాడు.

మ్యాచ్ ఆడేనా?

గురువారం (ఫిబ్రవరి 26) చెపాక్ లో జింబాబ్వేతో భారత్ మ్యాచ్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో తన ఫస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ చిత్తయింది. ఇండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే జింబాబ్వేపై భారీ విజయం సాధించాల్సిందే. ఈ పరిస్థితుల్లో విధ్వంసక బ్యాటర్ రింకు సింగ్ టీమ్ ను వీడటం టెన్షన్ కలిగించేదే. మరి ఈ మ్యాచ్ వరకు అతను తిరిగి టీమ్ తో కలుస్తాడా? లేదా? అన్నది చూడాలి.

రింకు రన్స్

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks