రోహిత్ శర్మకు పద్మశ్రీ.. విమెన్ టీమ్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు కూడా అవార్డు.. అద్భుతమైన స్టాట్స్

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ లకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమర్ నాథ్ కు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించింది. వీరితో పాటు క్రీడా రంగంలో పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

Published on: Jan 25, 2026, 20:13:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళల టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. దిగ్గజ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమర్ నాథ్ కు పద్మభూషణ్ అవార్డు వరించింది. హర్మన్‌ప్రీత్, రోహిత్ కంటే ముందు 40 మంది క్రికెటర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. హర్మన్‌ప్రీత్ ఐసీసీ వరల్డ్ కప్ గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించింది. మరోవైపు రోహిత్ శర్మ 9 నెలల వ్యవధిలో రెండు ICC టైటిళ్లను భారత్ కు అందించాడు.

రోహిత్ శర్మ (ANI)
రోహిత్ శర్మ (ANI)

రోహిత్ శర్మకు పద్మశ్రీ

క్రీజులో నిలబడితే చాలు పరుగుల తుపాను సృష్టించే రోహిత్ శర్మకు అరుదైన ఘనత దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు పద్మశ్రీ పురస్కారం వరించింది. ఇండియన్ క్రికెట్ కు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం హిట్ మ్యాన్ ను పద్మ శ్రీ పురస్కారంతో గుర్తించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ఆదివారం (జనవరి 25) ప్రకటించింది.

రోహిత్ స్టాట్స్

రోహిత్ శర్మ 67 టెస్టుల్లో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక వన్డేల్లో రోహిత్ రికార్డు ఘనంగా ఉంది. వన్డేల్లో 282 మ్యాచుల్లో 11577 రన్స్ చేశాడు. ఇందులో 33 సెంచరీలు, 61 ఫిఫ్టీస్ ఉన్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ రోహిత్ మాత్రమే. ఇక టీ20ల పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ 159 మ్యాచుల్లో 4231 రన్స్ చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

కెప్టెన్ గా

కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు కూడా ఘనంగా ఉంది. హిట్ మ్యాన్ కెప్టెన్సీ లో టీమిండియా 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. 2007 తర్వాత ఇండియా టీం టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ప్రపంచ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ కి రోహిత్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. 2025 లో ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ రోహిత్ కెప్టెన్సీ లో ఇండియా విజేతగా నిలిచింది.

లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ టెస్టులకు కూడా వీడ్కోలు పలికాడు. ఇప్పుడు హిట్ మ్యాన్ కేవలం వన్డేల్లోనే ఆడుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టాడు రోహిత్ శర్మ. ఇప్పుడు ఇండియా క్రికెట్ కి రోహిత్ చేసిన సేవలకు ఇప్పుడు పద్మ శ్రీ లభించింది.

ఫస్ట్ కెప్టెన్

ఇండియన్ మహిళల క్రికెట్ టీమ్ కు మొట్టమొదటి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ నిలిచింది. ఆమె కెప్టెన్సీలోని ఇండియా 2025 టీ20 ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది.హర్మన్ 6 టెస్టుల్లో 200 రన్స్ చేసింది. 161 వన్డేల్లో 4409 పరుగులు రాబట్టింది. ఇందులో 7 సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలున్నాయి. ఇక 187 టీ20ల్లో 3784 పరుగులు సాధించింది. ఇందులో ఓ సెంచరీ, 15 ఫిఫ్టీస్ నమోదు చేసింది.

NameFieldAward
Vijay AmritrajTennisPadma Bhushan
Baldev SinghHockeyPadma Shri
Bhagwandas RaikwarMartial ArtsPadma Shri
Harmanpreet KaurCricketPadma Shri
K PajanivelMartial ArtsPadma Shri
Praveen KumarPara-sportsPadma Shri
Rohit SharmaCricketPadma Shri
Savita PuniaHockeyPadma Shri
Vladimer MestvirishviliWrestlingPadma Shri
  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More