...
...
Next Story

Classic 350 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ లవర్స్​కి షాక్- క్లాసిక్ 350 ధరను విపరీతంగా పెంచేసిన సంస్థ..

భారత మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధరలను కంపెనీ పెంచింది. అన్ని రంగుల వేరియంట్లపై రూ. 2,000 వరకు భారం పడింది. కొత్త ధరలు, ఇంజిన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 8, 2026, 06:46:03 IST
Advertisement

భారత టూవీలర్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్.. తన పాపులర్ మోటార్ సైకిల్ ‘క్లాసిక్ 350’ ధరలను గుట్టుచప్పుడు కాకుండా సవరించింది! కంపెనీ విక్రయిస్తున్న మొత్తం తొమ్మిది కలర్ ఆప్షన్లపై ఈ ధరల పెంపు వర్తిస్తుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350- ధరలు ఎంత పెరిగాయంటే..

రాయల్​ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350..
రాయల్​ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350..

ఎంట్రీ లెవెల్ మోడల్ రెడ్డిచ్ రెడ్ నుంచి టాప్-ఎండ్ వేరియంట్స్ అయిన ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ వరకు రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350లోని అన్ని కలర్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ. 2,000 వరకు ధరలను పెంచారు. ఆగస్టు మధ్యలో విడుదలైన గూర్ఖా ఎడిషన్‌పై రూ. 1,000 వరకు మాత్రమే ధర పెంచగా, ఎమరాల్డ్, సిగ్నేచర్ వైట్ వేరియంట్లపై పూర్తి రూ. 2,000 మేర భారం పడింది.

రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350- వేరియంట్ల వారీగా కొత్త ధరలు (ఎక్స్-షోరూమ్)

వివిధ రంగుల మోడళ్ల నూతన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

రెడ్డిచ్ రెడ్ : రూ. 1.89 లక్షలు

మద్రాస్ రెడ్ : రూ. 1.96 లక్షలు

మెడల్లియన్ బ్రాంజ్ : రూ. 2.01 లక్షలు

కమాండో శాండ్ అండ్ గూర్ఖా ఎడిషన్ : రూ. 2.12 లక్షలు

గన్ గ్రే అండ్ స్టీల్త్ బ్లాక్ : రూ. 2.21 లక్షలు

ఎమరాల్డ్ అండ్ సిగ్నేచర్ వైట్ : రూ. 2.26 లక్షలు

రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350- ఇంజిన్, ఫీచర్లలో మార్పులు లేవు

డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్లలో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్లు యథావిధిగా కొనసాగుతున్నాయి. బేస్ వేరియంట్ రెడ్డిచ్ రెడ్‌లో మాత్రం ఈ ఫీచర్లు లభించవు.

రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350కి మార్కెట్లో పెరుగుతున్న పోటీ..

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి పోటీగా మార్కెట్లోకి కొత్త బైక్‌లు వస్తున్న సమయంలో ఈ ధరల పెంపు చోటుచేసుకుంది. ఇటీవల ట్రయంఫ్ సంస్థ 350 సీసీ ఇంజిన్‌తో బొన్నెవిల్లే టీ4 బైక్‌ను రూ. 2.55 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు, బొన్నెవిల్లే టీ40 మోడల్‌ను రూ. 2.80 లక్షల ధరకు తీసుకొచ్చింది. వీటితో పాటు హోండా సీబీ350 కూడా క్లాసిక్ 350కి నేరుగా పోటీ ఇస్తోంది.

అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల ఇటీవలి కాలంలో ముడి సరుకు ధరలు పెరిగిపోయాయి. ఇది ఆటోమొబైల్​ రంగంపై ప్రభావం చూపిస్తోంది. అందుకే తమ మీద పడిన భారాన్ని తగ్గించుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాల రేట్లను పెంచేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రాయల్ ఎన్​ఫీల్డ్​ సైతం చేరింది. మరి ఈ తాజా ధరల పెంపు రాయల్ ఎన్​ఫీల్డ్ క్లాసిక్ 350 సేల్స్​ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks