క్రూజర్ బైక్ ప్రియుల ఆరాధ్య బ్రాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ ఆటోమొబైల్ రంగాన్ని మరోసారి షేక్ చేసింది! తన 125 ఏళ్ల సుదీర్ఘమైన సువర్ణ చరిత్రకు గుర్తుగా తీసుకొచ్చిన ‘క్లాసిక్ 650 - 125వ యానివర్సరీ ఎడిషన్’ బైక్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

భారతీయ మార్కెట్‌కు కేటాయించిన 125 పరిమిత సంఖ్య బైక్‌లు బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 6 నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం! ఈ అరుదైన స్పెషల్ ఎడిషన్ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 4,25,589గా నిర్ణయించింది. ఈ నవంబర్ నుంచే కస్టమర్లకు డెలివరీలు ప్రారంభించనున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ లైనప్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 125వ వార్షికోత్సవ ప్రత్యేక మోడల్ బైక్.. సెగ్మెంట్లోనే మోస్ట్ మోస్ట్ పాపులర్ ఎడిషన్‌గా నిలిచింది.
మెరిసే హైపర్‌షిఫ్ట్ రంగులు, క్లాసిక్ డిజైన్..
ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను సాధారణ క్లాసిక్ 650 మోడల్ కంటే ఎంతో భిన్నంగా, అత్యంత ప్రీమియం లుక్‌తో డిజైన్ చేశారు. ఇందులో ఉపయోగించిన ‘హైపర్‌షిఫ్ట్’ కలర్ ఫినిషింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది బ్రాస్ (ఇత్తడి) బేస్‌తో రూపొందింది. కాంతి పడే కోణాన్ని బట్టి బైక్ రంగు ఎరుపు, ఆకుపచ్చ. బంగారు (గోల్డ్) ఛాయల్లోకి మారుతూ కన్నులవిందు చేస్తుంది.
ట్యాంక్‌పై బంగారు పూతతో కూడిన ప్రత్యేక '125 Years' క్రెస్ట్ బ్యాడ్జ్, చేతితో గీసిన హ్యాండ్-పెయింటెడ్ పిన్స్ట్రైప్స్, సైడ్ ప్యానెల్స్‌పై ప్రత్యేక ముద్రలు దీనికి మరింత రాజసాన్ని ఇచ్చాయి. దీనితో పాటు క్లాసిక్ లుక్ ఇచ్చేందుకు క్విల్టెడ్ స్టిచింగ్‌తో కూడిన బ్రౌన్ కలర్ లెదర్ సింగిల్ సీటును అమర్చారు. టియర్ డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ హెడ్లాంప్, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో ఉండే ఇంజిన్ ఈ వింటేజ్ క్రూజర్కు విలక్షణమైన రూపాన్ని తేవడంలో దోహదపడ్డాయి.
శక్తివంతమైన 650సీసీ ఇంజిన్ పర్ఫార్మెన్స్..
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్ ఎక్స్టీరియర్ రూపురేఖల్లో విప్లవాత్మక మార్పులు చేసినప్పటికీ, ఇంజిన్ విభాగంలో నమ్మకమైన 650సీసీ ప్లాట్‌ఫారమ్‌ను యథాతథంగా కొనసాగించారు:
{{/usCountry}}రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్ ఎక్స్టీరియర్ రూపురేఖల్లో విప్లవాత్మక మార్పులు చేసినప్పటికీ, ఇంజిన్ విభాగంలో నమ్మకమైన 650సీసీ ప్లాట్‌ఫారమ్‌ను యథాతథంగా కొనసాగించారు:
{{/usCountry}}ఇంజిన్: 647.95 సీసీ ప్యారలల్-ట్విన్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజిన్.
పవర్ అండ్ టార్క్: ఈ ఇంజిన్ 7,250 ఆర్పీఎం వద్ద 46.3 హెచ్‌పీ గరిష్ట పవర్‌ను, 5,650 ఆర్పీఎం వద్ద 52.3 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గేర్‌బాక్స్: సులువైన గేర్ షిఫ్టింగ్ కోసం 6-స్పీడ్ కాన్స్టంట్ మెష్ గేర్‌బాక్స్ ఇచ్చారు.
బలమైన ఛాసిస్, బ్రేకింగ్, కంఫర్ట్ ఫీచర్లు..
హైవే ప్రయాణాల్లోనూ, సుదీర్ఘ రైడింగ్‌లోనూ మెరుగైన బ్యాలెన్స్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్‌ని స్టీల్ ట్యూబులర్ స్పైన్ ఫ్రేమ్‌పై నిర్మించారు.
సస్పెన్షన్: ముందు భాగంలో 43 ఎంఎం టెలిస్కోపిక్ ఫోర్క్స్ (120 ఎంఎం ట్రావెల్), వెనుక వైపు ట్విన్ షాక్ అబ్సార్బర్లు (90 ఎంఎం ట్రావెల్) అమర్చారు.
టైర్లు అండ్ వీల్స్: ముందు వైపు 19-అంగుళాల వీల్ (100/90 టైర్), వెనుక వైపు 18-అంగుళాల వీల్ (140/70 టైర్) ఇచ్చారు.
బ్రేకింగ్ సేఫ్టీ: మెరుగైన భద్రత కోసం ముందు 320 ఎంఎం డిస్క్, వెనుక 300 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో పాటు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ సదుపాయం ఇచ్చారు.
ఈ బైక్ సీట్ ఎత్తు 800 ఎంఎం, గ్రాండ్ క్లియరెన్స్ 154 ఎంఎంగా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.8 లీటర్లు కాగా, 90% ఇంధనంతో బైక్ మొత్తం బరువు 243 కేజీలు ఉంటుంది. నేటితరం రైడర్ల కోసం ఎల్ఈడీ లైటింగ్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఈ స్పెషల్ ఎడిషన్‌లో అందించారు.
ఈ క్లాసిక్ 650 125వ యానివర్సరీ ఎడిషన్ బైక్ కేవలం 6 నిమిషాల్లో సోల్డ్ అవుట్ కావడం రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ పై ఉన్న అభిమానానికి గొప్ప నిదర్శనం!