Royal Enfield నుంచి కొత్త అడ్వెంచర్ బైక్- హిమాలయన్ 440 లాంచ్! ధర..

రాయల్ ఎన్‌ఫీల్డ్ మార్కెట్‌లోకి సరికొత్త 'హిమాలయన్ 440' అడ్వెంచర్ బైక్‌ను రూ. 2.29 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి తెచ్చింది. పవర్‌ఫుల్ 443సీసీ ఇంజిన్, 21-ఇంచుల ఫ్రంట్ వీల్, ట్రిప్పర్ నావిగేషన్‌తో వస్తున్న ఈ బైక్ వివరాలు ఇవే!

Published on: Sep 5, 2026, 06:11:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం సరికొత్త మోటార్‌సైకిల్‌ను భారత విపణిలోకి ప్రవేశపెట్టింది. అత్యంత ప్రజాదరణ పొందిన పాత హిమాలయన్ 411 డిజైన్ ఐడెంటిటీని తిరిగి గుర్తుచేస్తూ, మరింత పవర్‌ఫుల్ ఇంజిన్, ప్రాక్టికల్ మెకానికల్ సెటప్‌తో ‘హిమాలయన్ 440’ని మార్కెట్‌లోకి తెచ్చింది.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440 లాంచ్
రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 440 లాంచ్

ఇప్పటికే మార్కెట్లో ఉన్న కాస్ట్లీ అండ్ అధునాతన 'హిమాలయన్ 450' మోడల్ కంటే తక్కువ ధరలో, రోడ్డుపై సులువైన డ్రైవింగ్ అనుభూతిని కోరుకునే రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త హిమాలయన్ 440 ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2.29 లక్షలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

స్క్రామ్ 440 పవర్‌ఫుల్ ఇంజిన్​తో..

ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 బైక్‌లో స్క్రామ్ 440లో ఉపయోగించిన పవర్‌ఫుల్ LS440 ఇంజిన్‌ను అమర్చారు.

ఇంజిన్ సామర్థ్యం: 443సీసీ, సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్

పవర్ అవుట్‌పుట్: 6,250 ఆర్పీఎం వద్ద 25.4 హెచ్​పీ పవర్, 4,000 ఆర్పీఎం వద్ద 34 ఎన్​ఎం పీక్ టార్క్

గేర్‌బాక్స్: 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్..

పాత హిమాలయన్ 411 (24.5 హెచ్​పీ పవర్, 32 ఎన్​ఎం టార్క్)తో పోలిస్తే ఈ కొత్త మోడల్‌లో పవర్, టార్క్ మెరుగయ్యాయి. సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్స్ లేకుండా, లాంగ్ రైడ్లలో మొరాయించకుండా రఫ్ అండ్ టఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఈ ఇంజిన్‌ను డిజైన్ చేశారు.

ఆఫ్‌రోడింగ్ కోసం 21-ఇంచ్ వీల్ కాన్ఫిగరేషన్..

స్క్రామ్ 440తో పోలిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 మెకానికల్ పరంగా ప్రధాన మార్పు వీల్స్ సెటప్‌లోనే కనిపిస్తుంది. స్క్రామ్ 440లో 19-ఇంచ్ ఫ్రంట్ వీల్ ఉంటే, కొత్త హిమాలయన్ 440కి పక్కా అడ్వెంచర్ బైక్ డిజైన్ కోసం 21-ఇంచుల ఫ్రంట్ స్పోక్ వీల్‌ను అందించారు. వెనుక వైపు 17-ఇంచ్ వీల్ ఉంటుంది. రాళ్లు రప్పలు, గుంతల రోడ్లు, ఆఫ్‌రోడ్ ట్రాక్‌లలో బైక్ సులువుగా దూసుకెళ్లేందుకు ఈ పెద్ద వీల్స్, లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్ సహాయపడతాయి.

కొత్త డిజిటల్ కన్సోల్, ట్రిప్పర్ నావిగేషన్..

రైడర్ కాక్‌పిట్‌లో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ మునుపటి కంటే మెరుగైన మార్పులు చేసింది. పాత 411 ఫోర్-పాడ్ కన్సోల్ స్థానంలో ఇప్పుడు క్లీన్ అండ్ సింపుల్ ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను తెచ్చింది. ఇందులో ప్రధాన సమాచారాన్ని చూపించే స్పీడోమీటర్ డయల్‌తో పాటు, గూగుల్ మ్యాప్స్ ఆధారిత టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందించే 'ట్రిప్పర్ పోడ్' ప్రత్యేకంగా లభిస్తుంది. దీనివల్ల లాంగ్ రూట్లలో లొకేషన్ వెతుక్కునేందుకు ఫోన్ హోల్డర్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

ఐకానిక్ హిమాలయన్ 411 డిజైన్ లుక్..

మెకానికల్‌గా ఇది స్క్రామ్ 440 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ, బాహ్య రూపురేఖల పరంగా మాత్రం పాత హిమాలయన్ 411 ఐకానిక్ లుక్‌ను ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 బైక్​లో పునరావృతం చేసింది. ఎత్తైన విండ్ స్క్రీన్, క్లాసిక్ హెడ్‌లాంప్, జాలీ ఫ్రేమ్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొఫైల్ అచ్చం పాత హిమాలయన్ మోడల్‌నే తలపిస్తాయి.

అధునాతన వాటర్-కూల్డ్ హిమాలయన్ 450 కంటే తక్కువ ఖర్చుతో, క్లాసిక్ అడ్వెంచర్ లుక్ కోరుకునే వారికి ఇది సరైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More