RRB ALP Admit card : ఆర్ఆర్బీ ఏఎల్పీ సీబీటీ-1 అడ్మిట్ కార్డులు విడుదల- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-1 పరీక్ష హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. నవంబర్ 3, 4, 5 తేదీల్లో జరగనున్న ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే విధానం, పరీక్ష కేంద్రంలో పాటించాల్సిన నిబంధనలు ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ రైల్వేలో డ్రీమ్ జాబ్ సాధించాలనుకునే నిరుద్యోగ యువతకు అత్యంత కీలకమైన ఘట్టం! రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్ఆర్బీ) అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ (CEN 01/2026) కు సంబంధించిన మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ-1) హాల్ టికెట్లను శనివారం అధికారికంగా విడుదల చేశాయి.

దేశవ్యాప్తంగా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి ఈ భారీ నియామక ప్రక్రియ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ ఆర్ఆర్బీ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అభ్యర్థులు తమ ప్రాంతీయ ఆర్ఆర్బీ వెబ్‌సైట్ల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న సీబీటీ-1 పరీక్షలు..
ఆర్ఆర్బీ షెడ్యూల్ ప్రకారం.. ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-1 పరీక్షలు నవంబర్ 3, 4, 5, 2026 తేదీల్లో వివిధ షిఫ్ట్స్‌లో జరగనున్నాయి. పరీక్ష రాసే నగరం వివరాలతో కూడిన 'సిటీ ఇంటిమేషన్ స్లిప్'ను అక్టోబర్ 24నే బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పరీక్షా కేంద్రం పేరు, సమయం, షిఫ్ట్ వివరాలతో కూడిన పూర్తిస్థాయి ‘ఈ-కాల్ లెటర్లను’ అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది.
పరీక్ష కేంద్రానికి వెళ్లేముందు ప్రతి అభ్యర్థి తమ హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ) ను తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఆర్ఆర్బీ ఏఎల్పీ హాల్ టికెట్‌లో చెక్ చేసుకోవాల్సిన కీలక వివరాలు..
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో అభ్యర్థులు నిశితంగా పరిశీలించుకోవాలి:
- అభ్యర్థి పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్
- పుట్టిన తేదీ, కేటగిరీ (ఓసీ/ ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ)
- అభ్యర్థి ఫోటో, సంతకం స్పష్టంగా ఉండాలి
- పరీక్ష పేరు, పోస్ట్ (Assistant Loco Pilot, CEN 01/2026)
- పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయం, రిపోర్టింగ్ సమయం, గేట్ మూసివేసే సమయం
పరీక్షా కేంద్రం పేరు, కోడ్, పూర్తి చిరునామా..
ఒకవేళ హాల్ టికెట్‌లో ఫోటో స్పష్టంగా లేకపోయినా లేదా పేర్లలో తప్పులు ఉన్నా వెంటనే సంబంధిత ఆర్ఆర్బీ హెల్ప్‌డెస్క్‌ను ఆశ్రయించాలి.
ఆర్ఆర్బీ ఏఎల్పీ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
అభ్యర్థులు ఈ కింది స్టెప్స్‌ని అనుసరించి తమ అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు:
మీరు దరఖాస్తు చేసుకున్న ప్రాంతీయ ఆర్ఆర్బీ (ఉదాహరణకు: rrbsecunderabad.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
హోమ్‌పేజీలో కనిపిస్తున్న "RRB ALP CBT 1 Admit Card 2026" లేదా "E-Call Letter" లింక్‌పై క్లిక్ చేయండి.
మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ (లేదా పుట్టిన తేదీ) నమోదు చేయండి.
లాగిన్ సమాచారాన్ని సమర్పించగానే మీ హాల్ టికెట్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
హాల్ టికెట్‌ను పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని, కనీసం రెండు కలర్ ప్రింట్ అవుట్లు తీసుకోవడం శ్రేయస్కరం.
ముఖ్య గమనిక: ఒకవేళ మీ పాస్‌వర్డ్ మరిచిపోతే, లాగిన్ పేజీలోనే ఉన్న “Forgot Password” ఆప్షన్ ఉపయోగించి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ద్వారా తిరిగి పొందవచ్చు. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు రాకుండా ముందే హాల్ టికెట్ ప్రింట్ తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని ఆర్ఆర్బీ అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


