నిరుద్యోగులు, రైల్వేలో ఉద్యోగం పొందాలని చూస్తున్న వారికి బిగ్ అలర్ట్! ఆర్‌ఆర్బీ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు)కి సంబంధించిన గ్రూప్ డీ రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో, అంటే మార్చ్ 9, 2026తో ముగియనుంది. ఇంకా అప్లై చేసుకోని వారు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ప్రక్రియ జనవరి 31న మొదలైంది. వాస్తవానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఈ మార్చ్ 2తో ముగియాల్సి ఉంది. కానీ ఈ గడువును మార్చ్ 9కి పొడిగించారు. మరి మరోసారి ఈ డెడ్‌లైన్‌ని ఎక్స్టెండ్ చేస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. అధికారిక ప్రకటన లేదు కాబట్టి, ఈరోజే చివరి ఛాన్స్‌గా పరిగణించి, వెంటనే అప్లై చేసుకోవడం ఉత్తమం.
ఈ దఫా రిక్రూట్మెంట్లో భాగంగా 22,195 గ్రూప్ డీ పోస్టులను భర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2026- కీలక తేదీలు..
దరఖాస్తు కోసం చివరి తేదీ: మార్చ్ 9, 2026 (రాత్రి 11:59 వరకు)
ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీ: మార్చ్ 11, 2026
దరఖాస్తు సవరణ విండో: మార్చ్ 12 నుంచి మార్చ్ 21, 2026 వరకు
స్క్రైబ్ వివరాల సమర్పణ: మార్చ్ 22 నుంచి మార్చ్ 26, 2026 వరకు
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2026- ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
స్టెప్ 1- అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in సందర్శించాల్సి ఉంటుంది.
{{/usCountry}}స్టెప్ 1- అధికారిక వెబ్సైట్ www.rrbapply.gov.in సందర్శించాల్సి ఉంటుంది.
{{/usCountry}}స్టెప్ 2- వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) పూర్తి చేసుకోండి.
స్టెప్ 3- మీకు కావాల్సిన ఆర్‌ఆర్బీ రీజియన్‌ను ఎంచుకుని వివరాలను ఎంటర్ చేయండి.
స్టెప్ 4- అవసరమైన డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2026- రిజిస్ట్రేషన్ ఫీజు..
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు, మాజీ సైనికులు, పీడబ్ల్యూబీడీ అండ్ ఈబీసీ: రూ. 250 (పరీక్షకు హాజరైన తర్వాత ఈ మొత్తం పూర్తిగా రీఫండ్ అవుతుంది).
ఇతర అభ్యర్థులు: రూ. 500 (పరీక్షకు హాజరైన తర్వాత రూ. 400 రీఫండ్ అవుతుంది).
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2026- సెలక్షన్ ప్రాసెస్..
ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ రిక్రూట్మెంట్ 2026లో భాగంగా అభ్యర్థులను నాలుగు దశల్లో ఎంపిక చేస్తారు:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)
డాక్యుమెంట్ వెరిఫికేషన్
వైద్య పరీక్షలు
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ని, అధికారిక నోటిఫికేషన్ని సందర్శించాల్సి ఉంటుంది.