RRB NTPC UG : అలర్ట్​! ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ పరీక్ష తేదీలు ఇవే..

RRB NTPC UG exam date : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్బీ) ఎన్​టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) పోస్టుల భర్తీకి సంబంధించి మొదటి దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ-1) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Apr 14, 2026, 12:22:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

RRB NTPC UG exam date 2026 : దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న 3,058 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్​టీపీసీ- అండర్​ గ్రాడ్యుయేట్) పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా నిర్వహించే మొదటి దశ పరీక్షల (సీబీటీ 1) షెడ్యూల్‌ను బోర్డు తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు తమ ప్రాంతీయ ఆర్‌ఆర్బీ వెబ్‌సైట్‌ల ద్వారా పూర్తి వివరాలను తనిఖీ చేసుకోవచ్చు.

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ అప్డేట్స్.. (Rajkumar)
ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ అప్డేట్స్.. (Rajkumar)

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ సీబీటీ 1- పరీక్షా తేదీలు ఇవే..

ఆర్‌ఆర్బీ ప్రకటించిన నోటీసు ప్రకారం, పరీక్షలు రెండు విడతల్లో జరగనున్నాయి:

మే నెలలో: మే 7, 8, 9 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

జూన్ నెలలో: జూన్ 13, 14, జూన్ 16 నుంచి 21 వరకు పరీక్షలు జరుగుతాయి.

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ సీబీటీ 1- పరీక్షా సరళి ఎలా ఉంటుంది?

సీబీటీ-1 అనేది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన నార్మలైజ్డ్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను మెరిట్ ప్రకారం రెండో దశ (సీబీటీ-2)కు ఎంపిక చేస్తారు.

మొత్తం ప్రశ్నలు: 100

సమయం: 90 నిమిషాలు

విభాగాలు:

జనరల్ అవేర్‌నెస్ : 40 ప్రశ్నలు

మ్యాథ్స్: 30 ప్రశ్నలు

జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: 30 ప్రశ్నలు

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ సీబీటీ 1- హాల్ టికెట్లు, ఎగ్జామ్ సిటీ వివరాలు..

అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రం ఉన్న నగరం, తేదీ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇక ఒరిజినల్ హాల్ టికెట్లు (అడ్మిట్​ కార్డులు) మాత్రం మీ పరీక్షా తేదీకి 4 రోజుల ముందు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది.

ఆర్​ఆర్బీ ఎన్​టీపీసీ యూజీ సీబీటీ 1- తేదీలను ఎలా చెక్ చేసుకోవాలి?

స్టెప్​ 1- మీ ప్రాంతీయ ఆర్‌ఆర్బీ (ఉదాహరణకు RRB Secunderabad) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్​ 2- హోమ్ పేజీలో ఉన్న 'RRB NTPC UG Exam 2026 Notice' లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్​ 3- అక్కడ ఓపెన్ అయ్యే పీడీఎఫ్ ఫైల్‌లో పరీక్షా తేదీల వివరాలను చూడవచ్చు.

స్టెప్​ 4- తదుపరి అవసరాల కోసం ఆ నోటీసును డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. ఆర్‌ఆర్బీ ఎన్టీపీసీ యూజీ (NTPC UG) ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,058 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

2. పరీక్ష ఎంత సమయం ఉంటుంది? నెగటివ్ మార్కింగ్ ఉందా?

పరీక్షా సమయం 90 నిమిషాలు. సాధారణంగా ఆర్‌ఆర్బీ పరీక్షల్లో 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది (అధికారిక నోటిఫికేషన్ నిబంధనలు గమనించగలరు).

3. ఎగ్జామ్ సిటీ ఎప్పుడు తెలుస్తుంది?

మీకు కేటాయించిన పరీక్షా తేదీకి 10 రోజుల ముందు ఎగ్జామ్ సిటీ లింక్ వెబ్‌సైట్‌లో యాక్టివేట్ అవుతుంది.

4. మొదటి దశ మార్కులు ఫైనల్ సెలక్షన్ కోసం లెక్కిస్తారా?

లేదు. సీబీటీ-1 కేవలం అర్హత పరీక్ష మాత్రమే. అభ్యర్థులను తర్వాతి దశకు ఎంపిక చేసేందుకు మాత్రమే ఈ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More