హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐపీ ఆధారిత ఫార్మా దిగ్గజం 'సాయి పేరెంటరల్స్ లిమిటెడ్' 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (Q2 FY27), తొలి అర్ధభాగం (H1 FY27) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. 2026 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికానికి గాను కంపెనీ ఏకీకృత రాబడి మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 9 శాతం పెరిగి రూ.196.1 కోట్లకు చేరింది.
ఆర్థిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన

కంపెనీ వ్యూహాత్మక చర్యలు, మెరుగైన ఇన్వెంటరీ నిర్వహణ వల్ల లాభదాయకత పెరిగింది.
గ్రాస్ ప్రాఫిట్: క్యూ2లో స్థూల లాభం రూ.93.1 కోట్లకు చేరుకోగా, మార్జిన్ 40.9 శాతం నుంచి 47.5 శాతానికి పెరిగింది.
ఎబిటా (EBITDA): మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 67.4 శాతం వృద్ధితో రూ.41.4 కోట్లను తాకింది. ఎబిటా మార్జిన్ 13.7 శాతం నుంచి 21.1 శాతానికి మెరుగైంది.
పన్ను తదుపరి లాభం (PAT): డిప్రిసియేషన్ వ్యయాలు పెరిగినప్పటికీ, క్యూ2లో నికర లాభం 32.7 శాతం పెరిగి రూ.10.5 కోట్లుగా నమోదైంది.
తొలి అర్ధభాగం (H1 FY27): ప్రథమార్ధంలో కంపెనీ మొత్తం రాబడి రూ.376 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న రూ. 750 కోట్ల లక్ష్యంలో ఇది దాదాపు 50 శాతానికి సమానం. నికర లాభం రూ.18.4 కోట్లుగా నమోదైంది.
ఐపీఓ నిధులతో రెండు కొనుగోళ్లు పూర్తి
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.98.8 కోట్లను వినియోగించి 'సాయికృతి ఫార్మా', 'సాయి ప్రత్యాక్ లేబొరేటరీస్' సంస్థల్లో 60 శాతం చొప్పున వాటాల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది.
సాయికృతి ఫార్మా: ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గుమ్మడిదలలో నూతన క్రిటికల్ కేర్ ఇంజెక్టబుల్ ప్లాంట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2027 జులై నాటికి పూర్తయ్యే ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం 155 మిలియన్ యూనిట్లకు చేరుతుంది. ఈ ప్లాంట్ అందుబాటులోకి వచ్చాక జీడిమెట్లలోని 1, 2 యూనిట్ల ఉత్పత్తిని నిలిపివేస్తారు.
సాయి ప్రత్యాక్ లేబొరేటరీస్: జీనోమ్ వ్యాలీలోని ఈ పరిశోధనా కేంద్రాన్ని గ్రూప్ వ్యాప్త ఆర్అండ్డీ (R&D) హబ్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ 28 మంది సైంటిస్టులు, 174 మాలిక్యూల్స్ ఉన్నాయి. రాబోయే రెండు త్రైమాసికాల్లో బయటి కంపెనీలకు ఒప్పంద పరిశోధన (CDMO) సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.
భువనగిరి యూనిట్ విస్తరణ, అంతర్జాతీయ ఒప్పందాలు
{{/usCountry}}సాయి ప్రత్యాక్ లేబొరేటరీస్: జీనోమ్ వ్యాలీలోని ఈ పరిశోధనా కేంద్రాన్ని గ్రూప్ వ్యాప్త ఆర్అండ్డీ (R&D) హబ్‌గా తీర్చిదిద్దారు. ఇక్కడ 28 మంది సైంటిస్టులు, 174 మాలిక్యూల్స్ ఉన్నాయి. రాబోయే రెండు త్రైమాసికాల్లో బయటి కంపెనీలకు ఒప్పంద పరిశోధన (CDMO) సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.
భువనగిరి యూనిట్ విస్తరణ, అంతర్జాతీయ ఒప్పందాలు
{{/usCountry}}భువనగిరి: భువనగిరి ప్లాంట్ విస్తరణ పనులు పూర్తయ్యాయి. దీనివల్ల నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం 85.5 మిలియన్ల నుంచి 81 శాతం పెరిగి 155 మిలియన్ యూనిట్లకు చేరింది. క్యూ4 నుంచి ఇక్కడి ఉత్పత్తి గణనీయంగా పెరిగి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లకు ఎగుమతి కానుంది.
నౌమెడ్ (Noumed) ఒప్పందం: ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఫార్మసీ చైన్‌తో 3 ఏళ్ల పాటు రూ.204 కోట్ల (AUD 30 మిలియన్లు) విలువైన ఓటీసీ నిత్యావసర ఔషధాల సరఫరా ఒప్పందాన్ని నూతనంగా పునరుద్ధరించుకుంది. దీంతో ఆస్ట్రేలియా మార్కెట్లో కంపెనీ మొత్తం కాంట్రాక్ట్ సరఫరా విలువ AUD 232 మిలియన్లకు (సుమారు రూ.1,506 కోట్లు) చేరింది.
అడిలైడ్ అండ్ ఫిలిప్పీన్స్: ఆస్ట్రేలియాలోని అడిలైడ్ ప్లాంట్ 2027 జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించి, ఏప్రిల్ నాటికి వాణిజ్య సరఫరాలు చేపట్టనుంది. ఫిలిప్పీన్స్ మార్కెట్లో క్యూ2 లో గుండె సంబంధిత విభాగంలో (Cardiovascular) 11 మాలిక్యూల్స్, 22 ఎస్‌కేయూలను లాంచ్ చేసింది.
లాభదాయకత బాటలో ముందుకు - సీఎండీ
"క్యూ2 ఫలితాలు మా పరివర్తనను, లాభదాయకతను స్పష్టంగా చూపిస్తున్నాయి. కొత్త ఈఆర్పీ సిస్టమ్, మెరుగైన ఇన్వెంటరీ పర్యవేక్షణతో గ్రాస్ మార్జిన్ 47.5 శాతానికి చేరింది. రాబోయే రోజుల్లో దీనిని 50 శాతానికి చేర్చడమే మా లక్ష్యం. ప్రథమార్ధంలో అంచనాల కంటే మెరుగైన పురోగతి సాధించాం. ద్వితీయార్థం వ్యాపారపరంగా మరింత అనుకూలమైన సమయం కావడంతో 2026-27 ఆర్థిక సంవత్సర నిర్దేశిత లక్ష్యాలను సులభంగా అందుకుంటాం" అని సాయి పేరెంటరల్స్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) అనిల్ కుమార్ కరుసాల ధీమా వ్యక్తం చేశారు.