SAIL Recruitment 2025 : సెయిల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ అడ్మిట్ కార్డు విడుదల- ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) రిక్రూట్‌మెంట్ 2025 కి సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రోల్ నంబర్, మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) రిక్రూట్‌మెంట్ 2025కి సంబంధించిన అడ్మిట్ కార్డులను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు అధికారిక సెయిల్ వెబ్సైట్లో తమ రోల్ నంబర్, మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెయిల్ రిక్రూట్‌మెంట్ 2025 అడ్మిట్ కార్డు ఫిబ్రవరి 23 వరకు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. చివరి నిమిషంలో ఇబ్బందులు కలగకుండా ఉండేదుకు గడువు కంటే ముందే అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.
ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ ప్లాంట్లు, యూనిట్లలోని కీలక ఇంజనీరింగ్ విభాగాల్లో 124 మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మెటలర్జీ, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్) ఖాళీలను భర్తీ చేస్తారు.
సెయిల్ మేనేజ్‌మెంట్ ట్రైనీ అడ్మిట్ కార్డు 2025 డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు తమ సెయిల్ రిక్రూట్‌మెంట్ 2025 అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్‌ని అనుసరించవచ్చు:
స్టెప్ 1- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ sail.co.inని సందర్శించండి.
స్టెప్ 2- హోమ్‌పేజీలో ఉన్న 'Careers' సెక్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- 'Management Trainee (Technical) Recruitment 2025 - Admit Card' లింక్‌ను ఎంచుకోండి.
స్టెప్ 4- మీ రోల్ నంబర్‌తో పాటు మొబైల్ నంబర్ లేదా పుట్టిన తేదీని నమోదు చేయండి.
స్టెప్ 5- వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 6- హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసి, భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
సెయిల్ రిక్రూట్‌మెంట్ 2025- అభ్యర్థుల కోసం ముఖ్యమైన సూచనలు..
అభ్యర్థులు తప్పనిసరిగా తమ అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లాలి.
అడ్మిట్ కార్డ్‌లో ఉండే వివరాలు: హాల్ టిక్కెట్‌లో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, పరీక్ష తేదీ, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రం వివరాలు ఉంటాయి. అభ్యర్థులు ఈ వివరాలన్నింటినీ జాగ్రత్తగా తనిఖీ చేయాలి, ఏవైనా వ్యత్యాసాలు ఉంటే వెంటనే సెయిల్ అధికారులను సంప్రదించాలి.
సెయిల్ రిక్రూట్‌మెంట్ 2025 ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఆపై గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఎంపిక ప్రక్రియలోని ప్రతి దశలో అభ్యర్థుల పనితీరు ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు.
సెయిల్ సీబీటీ పరీక్ష ఫిబ్రవరి 23న జరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


