...
...
Next Story

Samsung Galaxy A08 : ఇండియాలో శాంసంగ్ కొత్త స్మార్ట్​ఫోన్ లాంచ్- 6000ఎంఏహెచ్​ బ్యాటరీతో, ధర..

శాంసంగ్ ఇండియా మార్కెట్లోకి పవర్‌ఫుల్ 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మీడియాటెక్ హెలియో జీ99+ ప్రాసెసర్, జెమినీ ఏఐ ఫీచర్లు, 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వస్తున్న ఈ ఫోన్ విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 2, 2026, 10:01:05 IST
Advertisement

బడ్జెట్ ధరలో అధునాతన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు, సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వినియోగదారుల కోసం ప్రముఖ దక్షిన కొరియా దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘శాంసంగ్ గెలాక్సీ ఏ08’ పేరుతో ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, ఏకంగా 6 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌‌డేట్ల హామీతో వస్తున్న ఈ ఫోన్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో గట్టి పోటీని ఇచ్చేలా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ08 స్మార్ట్​ఫోన్..
శాంసంగ్ గెలాక్సీ ఏ08 స్మార్ట్​ఫోన్..

ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

శాంసంగ్ గెలాక్సీ ఏ08- డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్..

ఈ శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్​ఎస్ ఎల్​సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. స్మూత్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం కోసం ఇందులో 90హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. స్క్రీన్ రక్షణ కోసం ముందుభాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. ఫోన్ వేగవంతమైన పనితీరు కోసం మీడియాటెక్ హెలియో జీ99+ ప్రాసెసర్‌ను జోడించారు. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను ఏకంగా 2టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించారు.

శాంసంగ్ గెలాక్సీ ఏ08- కెమెరా వ్యవస్థ, ఏఐ సాంకేతికత

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ08 వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అమర్చారు. ఎఫ్/1.8 అపర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, ఎఫ్/2.4 అపర్చర్ ఉన్న 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

రోజంతా నిరంతరాయంగా వాడేందుకు అనువుగా 6,000ఎంఏహెచ్ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 25డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8 ఎంఎం మందంతో స్లిమ్‌గా కనిపిస్తుంది. ధూళి, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ను పొందింది. వినియోగదారుల వ్యక్తిగత డేటా భద్రత కోసం శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ ఇందులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ08- ధర, లభ్యత, ఆఫర్లు..

భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ08 ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.18,499గా నిర్ణయించారు. ఈ ఫోన్ డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, పార్ట్‌నర్ రిటైల్ షాపులు, శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ వేదికలపై కొనుగోలుకు అందుబాటులో ఉంది.

వినియోగదారులను ఆకట్టుకునేందుకు సులభ వాయిదాల పద్ధతిని కూడా ప్రకటించారు. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 6 నెలల వరకు, అలాగే ఎన్‌బీఎఫ్‌సీ భాగస్వాముల ద్వారా 9 నెలల వరకు వడ్డీ లేని నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తున్నారు.

మరి మీరు ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ08 స్మార్ట్​ఫోన్​ని కొంటున్నారా?

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks