Samsung Galaxy A08 : శాంసంగ్ కొత్త బడ్జెట్​ స్మార్ట్​ఫోన్- 6000ఎంఏహెచ్​ బ్యాటరీతో గెలాక్సీ ఏ08 లాంచ్..

దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తక్కువ ధరలో భారీ బ్యాటరీ కలిగిన 'గెలాక్సీ ఏ08' స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌లో సైలెంట్‌గా విడుదల చేసింది. 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్ పూర్తి వివరాలు ఇవే..

Published on: Sep 17, 2026, 06:45:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు శాంసంగ్ మరో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్‌గా 'శాంసంగ్ గెలాక్సీ ఏ08' పేరుతో కొత్త స్మార్ట్​ఫోన్​ని గ్లోబల్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ ఉక్రెయిన్​కి చెందిన శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే భారత్ సహా ఇతర ఆసియా మార్కెట్లలోనూ ఈ మోడల్ అడుగుపెట్టే అవకాశం ఉంది.

శాంసంగ్ కొత్త స్మార్ట్​ఫోన్ ఇదిగో..
శాంసంగ్ కొత్త స్మార్ట్​ఫోన్ ఇదిగో..

తక్కువ బడ్జెట్‌లో రోజంతా సజావుగా పనిచేసే పవర్‌ఫుల్ ఫోన్ కోరుకునే యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ దీనిని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేసే 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది!

ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ08 ఫీచర్లు, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

శాంసంగ్ గెలాక్సీ ఏ08- డిస్​ప్లే, ప్రాసెసర్​..

గెలాక్సీ ఏ08 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల హెచ్​డీ+ (720 x 1,600 పిక్సెల్స్) పీఎల్​ఎస్​ ఎల్​సీడీ స్క్రీన్‌తో వస్తుంది. 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా నునుపుగా సాగుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ హెలియో జీ99 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను అమర్చారు. 6ఎన్​ఎం ప్రాసెసింగ్ టెక్నాలజీపై తయారైన ఈ ప్రోసెసర్ గరిష్టంగా 2.2జీహెచ్​జెడ్ క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, సాధారణ గేమింగ్‌కు ఇది సమర్థవంతంగా తోడ్పడుతుంది.

స్మార్ట్​ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ‘వన్ యూఐ 8’ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ శాంసంగ్ స్మార్ట్​ఫోన్‌కు 2032 వరకు (దాదాపు 6 సంవత్సరాలు) సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని సంస్థ స్పష్టమైన హామీ ఇచ్చింది.

బడ్జెట్ సెగ్మెంట్‌లోని ఫోన్‌కు ఇన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభించడం విశేషం.

శాంసంగ్ గెలాక్సీ ఏ08- కెమెరా..

ఫొటోగ్రఫీ విభాగం విషయానికి వస్తే, గెలాక్సీ ఏ08 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఎఫ్/1.8 అపెర్చర్, ఆటోఫోకస్, 10x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు డెప్త్ షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను జోడించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ (ఎఫ్/2.0) కెమెరాను అందించారు. ఈ ఫోన్ ద్వారా హెచ్​డీ క్వాలిటీ వీడియోలను 120 ఎఫ్​పీఎస్ వద్ద రికార్డ్ చేయవచ్చు.

శాంసంగ్​ ఫోన్​లోని 6,000ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి, ఆఫీస్ వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య లేకుండా అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుంది. భద్రత కోసం ఫోన్ పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ స్కేనర్‌ను అమర్చారు. డ్యూయల్ 4జీ ఎల్​టీఈ, డ్యూయల్-బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, యుఎస్బీ టైప్-సి పోర్ట్, జిపిఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 197 గ్రాములుగా ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ08- ధర..

శాంసంగ్ గెలాక్సీ ఏ08 ప్రస్తుతం 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఏకైక వేరియంట్‌లో లభిస్తోంది. ఫోన్‌లో సరిపోయే స్పేస్ లేదనుకునే వారు మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు ఎక్స్​ప్యాండ్ చేసుకోవచ్చు.

ఉక్రెయిన్ మార్కెట్‌లో దీని ధర యూఏహెచ్ 10,699గా నిర్ణయించారు. మన భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ. 23,000కు సమానం. కంపెనీ ఈ ఫోన్‌ను డార్క్ బ్లూ, గ్రీన్, సిల్వర్ అనే మూడు కంటికి ఇంపుగా ఉండే రంగుల్లో మార్కెట్లోకి తెచ్చింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More