Samsung Galaxy S27 : శాంసంగ్ నుంచి పవర్ఫుల్ గెలాక్సీ ఎస్27- ఇండియా లాంచ్ ఖాయం!
శాంసంగ్ నెక్ట్స్ జెనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్27 భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) వెబ్సైట్లో ప్రత్యక్షమైంది. భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో రాబోతున్న ఈ ఫోన్ ఫీచర్లు, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ వివరాలు ఇక్కడ చూడండి..
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు దక్షిణ కొరియా ఆటోమొబైల్, టెక్నాలజీ దిగ్గజం 'శాంసంగ్'కి సంబంధించి బిగ్ అప్డేట్. తమ తదుపరి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ 'శాంసంగ్ గెలాక్సీ ఎస్27' సిరీస్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అధికారికంగా విడుదల కాకముందే ఈ సిరీస్‌కు చెందిన బేసిక్ మోడల్.. భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సర్టిఫికేషన్ డేటాబేస్‌లో దర్శనమిచ్చింది.

యాపిల్ ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా శాంసంగ్ ఈ నయా వర్షన్‌ను సిద్ధం చేస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్సైట్లో ఫోన్ కనిపించడంతో భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందనే వార్తలకు బలం చేకూరింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్27- 4 వేరియంట్లతో ఎంట్రీ..
ఈసారి కంపెనీ గెలాక్సీ ఎస్27 సిరీస్‌లో నాలుగు మోడళ్లను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్27
శాంసంగ్ గెలాక్సీ ఎస్27+
శాంసంగ్ గెలాక్సీ ఎస్27 ప్రొ
శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా
ఇదివరకు ఉన్న స్టాండర్డ్, ప్లస్, అల్ట్రా వర్షన్లతో పాటు కొత్తగా ‘ప్రొ’ మోడల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రొ మోడల్ ప్లస్, అల్ట్రా వేరియంట్ల మధ్య స్థానాన్ని భర్తీ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్27- బీఐఎస్ సైట్లో ప్రత్యక్షమైన మోడల్..
ప్రముఖ టెక్ మీడియా జీఎస్ఎమ్ఎరీనా సమాచారం ప్రకారం, బీఐఎస్ డేటాబేస్‌లో SM-S952B/DS మోడల్ నంబర్‌తో ఒక శాంసంగ్ హ్యాండ్సెట్ నమోదైంది. ఈ మోడల్ నంబర్ రాబోయే శాంసంగ్ గెలాక్సీ ఎస్27 ఇండియన్ వేరియంట్‌కు చెందిందేనని భావిస్తున్నారు. సాధారణంగా బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన కొద్ది వారాల్లో లేదా నెలల్లో సదరు ఉత్పత్తులు భారత మార్కెట్లో లాంచ్ అవుతుంటాయి. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
శాంసంగ్ మునుపటి ప్లాన్ల ప్రకారం.. 2027 జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహించే 'శాంసంగ్ అన్ప్యాక్డ్' ఈవెంట్లో ప్రపంచవ్యాప్తంగా ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించాల్సి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్27- పవర్ఫుల్ చిప్సెట్..
పర్ఫార్మెన్స్ పరంగా ఈసారి శాంసంగ్ భారీ విప్లవాన్నే సృష్టించబోతోంది. గెలాక్సీ ఎస్27, ఎస్27+ మోడళ్లలో సొంతంగా తయారు చేసిన ‘ఎగ్జినోస్ 2700’ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. అత్యంత అత్యాధునికమైన 2 నానోమీటర్ (2ఎన్ఎం) ప్రాసెస్ సాంకేతికతతో ఈ చిప్‌సెట్‌ను రూపొందిస్తున్నట్లు శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల వెల్లడించారు.
గీక్‌బెంచ్ 6.5 బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్లో నిర్వహించిన మల్టీ-కోర్ సీపీయూ పరీక్షల్లో ఎగ్జినోస్ 2700 ప్రాసెసర్ అద్భుతమైన స్కోర్ నమోదు చేసింది. క్వాల్కమ్ టాప్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ట్రీమ్ జెన్ 6 కలిగిన షావోమీ 18 ప్రొ మాక్స్ ఫోన్ కంటే దాదాపు 20 శాతం ఎక్కువ స్కోర్ సాధించడం విశేషం. ఇక టాప్ ఎండ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా మోడల్లో కస్టమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను అందించనున్నారు.
డిజైన్ విషయానికి వస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్27 ఫోన్ 6.27-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో రానుంది. ఈ సిరీస్‌లోనే ఇది అత్యంత కాంపాక్ట్ డిస్ప్లే కలిగిన ఫోన్‌గా నిలవనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


