SBI Clerk Mains అడ్మిట్​ కార్డులు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 15, 2025, 14:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) రిక్రూట్‌మెంట్ మెయిన్స్​ పరీక్ష కోసం అడ్మిట్ కార్డులు/ హాల్ టికెట్లను విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో ఇచ్చిన లింక్‌ను ఉపయోగించి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

SBI Clerk Mains అడ్మిట్​ కార్డులు విడుదల
SBI Clerk Mains అడ్మిట్​ కార్డులు విడుదల

ఎస్బీఐ క్లర్క్​ మెయిన్స్​ అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయడానికి కావాల్సిన వివరాలు..

ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అభ్యర్థులు లాగిన్ విండోలో ఈ కింది వివరాలను నమోదు చేయాలి:

  • రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్
  • పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ

ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

ముందుగా, అధికారిక వెబ్‌సైట్ sbi.co.in కు వెళ్లండి.

Careers ట్యాబ్‌ను ఓపెన్ చేసి, ఆ తర్వాత Current Openings విభాగాన్ని తెరవండి.

‘RECRUITMENT OF JUNIOR ASSOCIATES (CUSTOMER SUPPORT & SALES)’ ఆప్షన్‌ను, ఆపై కాల్ లెటర్ లేదా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ను తెరవండి.

అడిగిన సమాచారాన్ని అందించి, లాగిన్ అవ్వండి.

అడ్మిట్ కార్డును సరిచూసుకొని, డౌన్‌లోడ్ చేసుకోండి.

ఎస్బీఐ క్లర్క్​ మెయిన్స్​ అడ్మిట్​ కార్డులు డౌన్​లోడ్​ చేసుకునేందుకు కావాల్సిన డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్బీఐ క్లర్క్​ మెయిన్స్​ పరీక్ష వివరాలు..

నోటిఫికేషన్ ప్రకారం.. ఎస్బీఐ మెయిన్స్​ పరీక్షను నవంబర్ 2025 లో నిర్వహించడానికి తాత్కాలికంగా షెడ్యూల్ చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే మెయిన్స్​ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు.

పరీక్ష మొత్తం మార్కులు: మెయిన్స్​ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.

ప్రశ్నల సంఖ్య: మొత్తం 190 ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం: పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు.

పరీక్షా విభాగాలు

ప్రశ్నపత్రాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు:

జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్

జనరల్ ఇంగ్లీష్

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్

ప్రతి విభాగానికి విడిగా సమయ పరిమితి ఉంటుంది.

ఆబ్జెక్టివ్ పరీక్షలలో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి కేటాయించిన మార్కులో 1/4వ వంతు కోత విధిస్తారు.

అభ్యర్థులు మొత్తం మీద కనీస మార్కుల శాతాన్ని సాధించాల్సి ఉంటుంది. (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్​ఎస్​/డీఎక్స్​ఎస్​ అభ్యర్థులకు మొత్తం మార్కులలో 5% సడలింపు ఉంటుంది).

ఎస్బీ క్లర్క్​ ప్రిలిమినరీ పరీక్ష వివరాలు

ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్షను బ్యాంక్ సెప్టెంబర్ 20, 21, 27, 2025 తేదీల్లో నిర్వహించింది. ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఉన్నాయి. వాటిలో 30 ఇంగ్లీష్, 35 న్యూమరికల్ ఎబిలిటీ, 35 రీజనింగ్ ఎబిలిటీ నుంచి ఉన్నాయి. ఈ పరీక్ష ఒక గంట పాటు జరిగింది. దీని ఫలితం నవంబర్ 4 న ప్రకటించారు.

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో మొత్తం 5180 జూనియర్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని సంబంధిత వివరాల కోసం, అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More