SBI Clerk Prelims ఫలితాలు విడుదల- మరి నెక్ట్స్ ఏంటి?
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025 విడుదలయ్యాయి. sbi.co.in లో చెక్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో పాస్ అయిన అభ్యర్థులు నెక్ట్స్ ఏం చేయాలి? వంటి వివరాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025ను విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ). అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ sbi.co.in లో చూసుకోవచ్చు.
జూనియర్ అసోసియేట్ పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 2025కు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకునే అవకాశం ఉంది.
అభ్యర్థులు sbi.co.in కి వెళ్లి, తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ఫలితాన్ని యాక్సెస్ చేయవచ్చు.
లక్షలాది మంది అభ్యర్థులు ఈ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. కేవలం కొన్ని వేల మంది మాత్రమే ఇందులో అర్హత సాధించారు. వీరందరూ నెక్ట్స్ జరిగే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ పరీక్ష 2025కు హాజరు కావాల్సి ఉంటుంది.
ఈ ఎస్బీఐ క్లర్క్ 2025 పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 6,589 క్లర్క్ (జూనియర్ అసోసియేట్) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2025: ఏ వివరాలు కనిపిస్తాయి?
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2025 పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఈ డాక్యుమెంట్‌లో అభ్యర్థికి సంబంధించిన ముఖ్యమైన వివరాలు కనిపిస్తాయి. అవి..
- అభ్యర్థి పేరు
- కేటగిరీ
- పరీక్ష తేదీ
- విషయాల వివరాలు
- సాధించిన మార్కులు
- మొత్తం మార్కులు
ముఖ్యంగా, ఈ ఎస్బీఐ క్లర్క్ స్కోర్ కార్డులోని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయో లేదో అభ్యర్థులు తప్పక నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఈ వివరాలు తరువాత ఫైనల్ మార్క్‌షీట్‌లో ప్రచురితమవుతాయి.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు 2025ను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1: ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ను సందర్శించండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న ‘కెరీర్స్’ విభాగాన్ని క్లిక్ చేయండి.
స్టెప్ 3: 'ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితం 2025' లింక్‌ను కనుగొని, ఎంచుకోండి.
స్టెప్ 4: మీ లాగిన్ ఆధారాలను నమోదు చేసి, వివరాలను సమర్పించి లాగిన్ అవ్వండి.
స్టెప్ 5: మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 6: ఫలితాన్ని సరిచూసుకుని, పేజీని డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 7: భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఒక కాపీని ప్రింట్ తీసుకోండి.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఉత్తీర్ణత తర్వాత నెక్ట్ ఏంటి?
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2025లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తదుపరి మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. మెయిన్స్ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
అధికారిక నియామక ప్రకటన ప్రకారం, ఎస్బీఐ క్లర్క్ పోస్టుల కోసం తుది ఎంపిక కేవలం మెయిన్స్ పరీక్షలో సాధించిన మార్కులపై ఆధారపడి ఉంటుంది. మెయిన్స్ తర్వాత భాషా ప్రావీణ్యత పరీక్ష (ఎల్పీటీ) కూడా ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


