ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న నిరుద్యోగులకు కీలక అప్డేట్. జూనియర్ అసోసియేట్ (క్లర్క్) నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష (ఫేజ్-1) 2026 ఫలితాలను ఎస్బీఐ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 7,680 క్లర్క్ పోస్టుల భర్తీ కోసం ఈ నియామక ప్రక్రియను చేపట్టారు. సెప్టెంబర్ 2026లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in లో తమ మార్కులు, అర్హత స్థితిని తెలుసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది యువత బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు. ప్రధానంగా ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు ఉండే భద్రత, వేతనాల కారణంగా ఈ పరీక్షకు తీవ్ర పోటీ నెలకొంటుంది. సెప్టెంబర్‌లో ఆన్లైన్ విధానంలో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. 100 మార్కులకు ఒక గంట వ్యవధిలో జరిగిన ఈ పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే మూడు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడిగారు.
మెయిన్స్‌కు 1:10 నిష్పత్తిలో ఎంపిక
ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అవరోహణ క్రమంలో (డిసెండింగ్ ఆర్డర్) జాబితాను రూపొందిస్తారు. బ్యాంక్ నిర్ణయించిన మేరకు ఆయా కేటగిరీల్లో ఉన్న ఖాళీలకు దాదాపు 10 రెట్లు (అభ్యర్థుల లభ్యతకు లోబడి) మందిని తదుపరి దశ అయిన మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారే మెయిన్స్ రాయడానికి అర్హులు.
ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ 2026 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
పరీక్షకు హాజరైన అభ్యర్థులు కింది దశలను అనుసరించి తమ ఫలితాలను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు:
- ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ సందర్శించండి.
- హోమ్ పేజీలోని ‘కెరీర్స్’ (Careers) విభాగంలో అందుబాటులో ఉన్న ‘SBI Clerk Prelims Result 2026’ లింక్‌పై క్లిక్ చేయండి.
- కొత్త పేజీ తెరుచుకుంటుంది. అక్కడ అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు (రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్వర్డ్) నమోదు చేయాలి.
- వివరాలు సరిచూసుకుని సబ్మిట్ (Submit) బటన్ నొక్కగానే స్క్రీన్‌పై మీ మార్కులు కనిపిస్తాయి.
- మీ స్కోరును పరిశీలించి, ఆ పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
- భవిష్యత్ అవసరాల కోసం ఫలితాల కాపీని ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
మెయిన్స్ పరీక్ష విధానం, నెగటివ్ మార్కులు ఇలా..
ప్రిలిమ్స్ గట్టెక్కిన అభ్యర్థులు తదుపరి మెయిన్ పరీక్షకు సన్నద్ధం కావాలి. మెయిన్ పరీక్ష మొత్తం 200 మార్కులకు, 190 ప్రశ్నలతో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.
{{/usCountry}}ప్రిలిమ్స్ గట్టెక్కిన అభ్యర్థులు తదుపరి మెయిన్ పరీక్షకు సన్నద్ధం కావాలి. మెయిన్ పరీక్ష మొత్తం 200 మార్కులకు, 190 ప్రశ్నలతో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి.
{{/usCountry}}ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగటివ్ మార్కుల నిబంధన అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు (1/4వ వంతు) కోత విధిస్తారు.
ఎస్బీఐ అప్రెంటిస్‌లకు ప్రత్యేక బోనస్ మార్కులు
ఎస్బీఐలో శిక్షణ పొందిన అప్రెంటిస్‌లకు (Trained Apprentices) మెయిన్ పరీక్షలో ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తున్నారు. గరిష్ఠ మార్కుల్లో 2.5 శాతం.. అంటే 200 మార్కులకు గాను 5 మార్కులను బోనస్ మార్కులుగా కేటాయిస్తారు. అభ్యర్థి సాధించిన మొత్తం స్కోరుకు ఈ బోనస్ మార్కులను కలిపి తుది అగ్రిగేట్ స్కోరును లెక్కిస్తారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి సమాచారం, మెయిన్స్ అడ్మిట్ కార్డుల వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.
ఫలితాల డైరెక్ట్ లింక్