...
...
Next Story

SBI recruitment 2026 : ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​.. నోటిఫికేషన్ విడుదల- పూర్తి వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 1,538 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, పరీక్షా విధానం వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 8, 2026, 06:00:12 IST
Advertisement

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద 1,538 జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఎస్బీఐ కరీర్స్ పోర్టల్ ద్వారా ఆగస్టు 7 నుంచి ఆగస్టు 27, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు.

ఎస్బీఐ రిక్రూట్​మెంట్ 2026 అప్డేట్స్..
ఎస్బీఐ రిక్రూట్​మెంట్ 2026 అప్డేట్స్..

ఈ ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026 డ్రైవ్‌లో అభ్యర్థులు ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థి ఒకసారి మాత్రమే ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన స్థానిక భాషలో అభ్యర్థికి తగిన ప్రవేశం, ప్రావీణ్యం తప్పనిసరి.

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026- ఎంపిక విధానం..

ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఎంపిక ప్రక్రియ మూడు ప్రధాన దశల్లో జరుగుతుంది:

ప్రిలిమినరీ పరీక్ష

మెయిన్స్ పరీక్ష

లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (ఎల్​ఎల్​పీటీ)

తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబర్ 2026లో నిర్వహించనున్నారు. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్టోబర్ లేదా నవంబర్ 2026లో మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026- ప్రిలిమినరీ పరీక్షా విధానం..

ఆన్‌లైన్‌లో జరిగే ప్రిలిమినరీ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష వ్యవధి మొత్తం ఒక గంట కాగా, మూడు విభాగాలకు సమయాన్ని సమానంగా కేటాయించారు.

నెగెటివ్ మార్కింగ్: తప్పుగా రాసిన ప్రతి సమాధానానికి కేటాయించిన మార్కులలో 1/4వ వంతు (0.25 మార్కులు) కోత విధిస్తారు.

కటాఫ్ నిబంధన: సెక్షన్ల వారీగా లేదా మొత్తం ప్రిలిమినరీ పరీక్షకు ఎస్బీఐ ఎలాంటి కనిష్ట అర్హత మార్కులను నిర్దేశించలేదు. సెక్షన్ల వారీ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026- మెయిన్స్ పరీక్షా విధానం..

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026లో భాగంగా ప్రిలిమ్స్ దాటిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో ఎస్బీఐ నిర్దేశించిన మొత్తం అగ్రిగేట్ కనిష్ట మార్కులను అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా సెక్షన్ల వారీగా ప్రత్యేకంగా ఎలాంటి కటాఫ్ మార్కులు ఉండవు.

ఈ మెయిన్స్ పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. 2 గంటల 40 నిమిషాల్లో మొత్తం 190 ప్రశ్నలు ఉంటాయి. ఇవి 200 మార్కులకు ఉంటాయి.

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026- స్థానిక భాషా పరీక్ష..

ఎస్బీఐ జూనియర్ అసోసియేట్​ కోసం తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల్లో 10వ తరగతి లేదా 12వ తరగతిలో సంబంధిత స్థానిక భాషను ఒక పాఠ్యాంశంగా చదవని వారికి స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ద్వారా అభ్యర్థికి స్థానిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకునే సామర్థ్యాలు ఉన్నాయో లేదో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ పరీక్షల ద్వారా పరిశీలిస్తారు.

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026- వయోపరిమితి, అర్హతలు..

ఏప్రిల్ 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు:

కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి.

28 ఏళ్లకు మించకూడదు.

అభ్యర్థులు ఏప్రిల్ 2, 1998 - ఏప్రిల్ 1, 2006 మధ్య జన్మించి ఉండాలి (ఈ రెండు తేదీలు కూడా వర్తిస్తాయి).

ప్రభుత్వ, ఎస్బీఐ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్​మెంట్​ 2026- దరఖాస్తు ఎలా చేయాలి?

అభ్యర్థులు కేవలం ఎస్బీఐ అధికారిక కెరీర్స్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరే ఇతర మార్గంలో వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.

ఎస్బీఐ కెరీర్స్ పోర్టల్‌లో ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూర్తి చేయాలి.

డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నమోదు చేసిన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌లను యాక్టివ్‌గా ఉంచుకోవాలని బ్యాంకు సూచించింది. పరీక్ష, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అన్ని సమాచారాలు ఈమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా మాత్రమే పంపుతారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe