Mahindra BE 6 : బీఈ 6 ‘బ్యాట్‌మాన్ ఎడిషన్’ ఎలక్ట్రిక్ ఎస్యూవీ హవా- 7 నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
Mahindra BE 6 Batman Edition : మహీంద్రా సంస్థ లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసిన 'బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్' భారత్‌లో సంచలనం సృష్టించింది. రెండో బ్యాచ్ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం 7 నిమిషాల్లోనే.. కేటాయించిన 999 యూనిట్లు అమ్ముడయ్యాయి.
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. పరిమిత సంఖ్యలో విడుదల చేసిన ‘బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్’ కోసం భారతీయ వాహన ప్రియులు ఎగబడ్డారు. బుకింగ్ విండో తెరిచిన కేవలం ఏడు అంటే ఏడు నిమిషాల్లోనే.. కేటాయించిన 999 యూనిట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

మహీంద్రా బీఈ 6కి సంబంధించి ఇది రెండో బ్యాచ్! మొదటి బ్యాచ్ సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. తొలుత చాలా తక్కువ యూనిట్లనే సంస్థ అమ్మకానికి ఉంచింది. అవి నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోయాయి. డిమాండ్ దృష్ట్యా 999 యూనిట్లకు పెంచింది. అవి కూడా అమ్ముడుపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇప్పుడు రెండో బ్యాచ్‌లోనూ కూడా అదే మ్యాజిక్ కొనసాగుతుండటం విశేషం.
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్- ధర పెరిగినా తగ్గని డిమాండ్..
ఈ బ్యాట్‌మాన్ ఎడిషన్.. మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలోని టాప్-స్పెక్ 'ప్యాక్ త్రీ' వేరియంట్‌పై ఆధారపడి రూపొందించారు. ఈసారి దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 28.49 లక్షలుగా నిర్ణయించారు. మునుపటి బ్యాచ్‌తో పోలిస్తే ఇది రూ. 70,000 ఎక్కువ కావడం గమనార్హం. అయినప్పటికీ, ఇది ఒక 'కలెక్టర్ ఎడిషన్' కావడంతో కార్ల ప్రేమికులు, బ్యాట్‌మాన్ అభిమానులు దీనిని సొంతం చేసుకోవడానికి అత్యంత ఆసక్తిని కనబరిచారు.
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్- ప్రత్యేకతలు ఏంటి?
ఈ స్పెషల్ ఎడిషన్‌ను మిగతా కార్ల కంటే భిన్నంగా చూపేలా బ్యాట్‌మాన్ థీమ్‌తో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఎక్స్టీరియర్: కారు బాడీకి 'సాటిన్ బ్లాక్' ఫినిషింగ్ ఇచ్చారు. దీనికి తోడు బ్యాట్‌మాన్ గ్రాఫిక్స్, థీమ్ బ్యాడ్జింగ్‌ను జోడించారు. సస్పెన్షన్ భాగాలు, బ్రేక్ కాలిపర్లకు వేసిన గోల్డ్ కలర్ పెయింట్, నలుపు రంగు బాడీకి మంచి కాంట్రాస్ట్‌ను ఇస్తోంది. 20- ఇంచ్ భారీ అలాయ్ వీల్స్ ఈ కారుకు అగ్రెసివ్ లుక్‌ను తెచ్చాయి.

లోగోల హంగామా: 'ది డార్క్ నైట్' ట్రయాలజీలో కనిపించే ప్రసిద్ధ ‘బ్యాట్ ఎంబ్లెమ్’ని హబ్ క్యాప్స్, ఫ్రంట్ క్వార్టర్ ప్యానెల్స్, రియర్ బంపర్, విండోస్, రియర్ విండ్‌షీల్డ్‌పై ప్రత్యేకంగా అమర్చారు.
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌లోని మరికొన్ని ఫీచర్లు: ఇన్ఫినిటీ రూఫ్‌పై బ్యాట్ ఎంబ్లెమ్, రాత్రి వేళల్లో లోగోను నేలపై ప్రొజెక్ట్ చేసే 'నైట్ ట్రైల్' కార్పెట్ ల్యాంప్స్, వెనుక డోర్ క్లాడింగ్‌పై బ్యాట్‌మాన్ సిగ్నేచర్ స్టిక్కర్ వంటివి దీనిని ప్రత్యేకంగా నిలుపుతాయి.
అద్భుతమైన ఇంటీరియర్: ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ లోపలి భాగం కూడా పూర్తి నలుపు థీమ్‌తో నిండిపోయింది.
గోల్డెన్ టచ్: డ్యాష్‌బోర్డ్‌పై 'బ్యాట్‌మాన్ ఎడిషన్' ప్లాక్, డ్రైవర్ కాక్‌పిట్ చుట్టూ బ్రష్డ్ గోల్డ్ హలో, గోల్డ్ యాక్సెంట్ ఉన్న స్టీరింగ్ వీల్, కస్టమ్ కీ ఫోబ్ వంటివి దీనికి లగ్జరీ లుక్‌ను ఇచ్చాయి.
ప్రీమియం సీట్లు: సూయిడ్, లెదర్ అప్హోలిస్ట్రీపై గోల్డ్ సెపియా స్టిచింగ్, సీట్లపై బ్యాట్ ఎంబ్లెమ్ ఎంబోసింగ్ ఉండటం వల్ల లోపల కూర్చున్నప్పుడు ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది.
యానిమేషన్: ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలో బ్యాట్‌మాన్ ఎడిషన్ 'వెల్కమ్ యానిమేషన్' వినియోగదారులకు స్వాగతం పలుకుతుంది.
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్- రేంజ్..
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌లో మెకానికల్ పరంగా చూస్తే, ఇది స్టాండర్డ్ బీఈ 6 ప్యాక్ త్రీ వేరియంట్ లాగే ఉంటుంది. ఇందులో 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 286 పీఎస్ పవర్‌ను, 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రియర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 682 కి.మీ (క్లెయిమ్డ్ రేంజ్) వరకు ప్రయాణించవచ్చని మహీంద్రా పేర్కొంది.
కేవలం ఏడు నిమిషాల్లోనే స్టాక్ మొత్తం ఖాళీ అవ్వడం చూస్తుంటే, భారత మార్కెట్లో ఇటువంటి ఎక్స్‌క్లూజివ్, లిమిటెడ్ రన్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఎంతటి ఆదరణ ఉందో స్పష్టమవుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


