Senior citizen FD rates : సీనియర్ సిటిజన్లకు బంపర్ ఆఫర్! ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50% వరకు వడ్డీ..
Fixed deposits interest rates : సీనియర్ సిటిజన్లు తమ కష్టార్జితానికి సురక్షితమైన, స్థిరమైన రాబడిని పొందడానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉత్తమ మార్గంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు ఎఫ్‌డీలపై అధిక వడ్డీ రేట్లను ఇస్తున్న బ్యాంకుల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రిటైర్మెంట్ తర్వాత చేతిలో ఉన్న డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు, ప్రతి నెలా స్థిరమైన ఆదాయం రావాలని కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) ఎప్పుడూ అత్యంత నమ్మకమైన సాధనాలు! ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి లాభాలు సాధించాలనుకునే వారికి ఇప్పుడు సువర్ణావకాశం లభిస్తోంది. ఇటీవల జూన్ నెలలో జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ సమీక్షలో రెపో రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచడంతో.. దేశంలోని ప్రముఖ బ్యాంకులు, ముఖ్యంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు) సీనియర్ సిటిజన్లకు 8 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.

కొన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో అర్హతలను బట్టి గరిష్టంగా 8.50 శాతం వరకు వడ్డీ రేటు లభిస్తోంది. రూ. 3 కోట్ల కంటే తక్కువ విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై దేశంలోని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లోని 13 ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల పూర్తి విశ్లేషణ ఇక్కడ చూద్దాము..
రేసులో ముందున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు!
ఎఫ్‌డీలపై గరిష్ట రాబడిని అందించడంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. ఇప్పుడు కూడా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అత్యంత పోటీ పడుతూ వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్ని నిర్దిష్ట కాలపరిమితి (టెన్యూర్) గల డిపాజిట్లపై ఇవి 8% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీని ఇస్తున్నాయి.
ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి..
ప్రైవేట్ రంగ లెండర్లలో యెస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ వంటివి మీడియం టర్మ్ డిపాజిట్లపై 7.50 శాతం నుంచి 8 శాతం లోపు ఆకర్షణీయమైన వడ్డీని అందిస్తున్నాయి.
మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, ఇవి ప్రవేశపెట్టిన కొన్ని ప్రత్యేక కాలపరిమితి గల 'స్పెషల్ డిపాజిట్ స్కీమ్‌ల' ద్వారా సాధారణ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.
బ్యాంకు | టెన్యూర్/స్కీమ్ | ఎఫ్డీ రేటు |
|---|---|---|
| సూర్యోదయ ఎస్ఎఫ్బీ | 30 నెలలు | 8.25% |
| సూర్యోదయ ఎస్ఎఫ్బీ | 5 ఏళ్లు | 8.05% |
| ఈక్విటాస్ ఎస్ఎఫ్బీ | 3 ఏళ్ల 1 రోజు | 8.00% |
| జన ఎస్ఎఫ్పీ | >2–3 ఏళ్లు (1095 రోజులు) | 8.30% |
| జన ఎస్ఎఫ్బీ | >3–5 ఏళ్లు (1825 రోజులు) | 8.00% |
| ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ | 2 ఏళ్లు | 8.30% |
| ఉజ్జీవన్ ఎస్ఎఫ్బీ | 3 ఏళ్ల 1 రోజు – 3.5 ఏళ్లు | 8.05% |
| యూనిటీ ఎస్ఎఫ్బీ | 501 రోజులు | 8.30% |
| యూనిటీ ఎస్ఎఫ్బీ | 12 నెలలు | 8.00% |
| ఉత్కర్ష్ ఎస్ఎఫ్బీ | 2–3 ఏళ్లు (730–1095 రోజులు) | 8.00% |
| శివాలిక్ ఎస్ఎఫ్బీ | 18–23 నెలలు | 8.00% |
| శివాలిక్ ఎస్ఎఫ్బీ | 23 నెలల 1 ఒకరోజు – 27 నెలలు | 8.50% |
| శివాలిక్ ఎస్ఎఫ్బీ | 27–36 నెలలు | 8.00% |
| ఈఎస్ఏఎఫ్ ఎస్ఎఫ్బీ | 501 రోజులు | 8.00% |
| ఈఎస్ఏఎఫ్ ఎస్ఎఫ్బీ | 2–<3 ఏళ్లు | 8.25% |
| ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ | 500 రోజులు – 3 ఏళ్లు | 7.60% |
| యెస్ బ్యాంక్ | 18 నెలల 1 రోజు – <24 నెలలు | 7.75% |
| యెస్ బ్యాంక్ | 36–<60 నెలలు | 7.75% |
| హెచ్డీఎఫ్సీ బ్యాంక్ | 3 ఏళ్ల 1 రోజు – <4 ఏళ్ల 7 నెలలు | 7.00% |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | >5–10 ఏళ్లు | 7.00% |
| బ్యాంక్ ఆఫ్ బరోడా | 555 రోజులు (గోల్డెన్ గోల్ డిపాజిట్) | 7.25% |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 444 రోజులు | 7.10% |
| పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 666 రోజులు | 7.00% |
గమనిక: పై వడ్డీ రేట్లు జులై 2 నాటికి బ్యాంకుల అధికారిక సమాచారం ప్రకారం సేకరించినవి. ఇవి బ్యాంకుల నిర్ణయాలు, కాలపరిమితిని బట్టి మారే అవకాశం ఉంటుంది.)
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్బీఐ తన రెపో రేట్లను మార్చకపోవడంతో పెద్ద బ్యాంకులకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు మధ్య వడ్డీ రేట్ల వ్యత్యాసం ఇంకా అలాగే కొనసాగుతోంది. అందువల్ల ఎక్కువ రాబడి కోరుకునే సీనియర్ సిటిజన్లు తమ పెట్టుబడి ప్రణాళికలను దీనికి అనుగుణంగా మార్చుకోవడం మంచిది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా పెట్టుబడి చేసే ముందు మీరు మీ సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


