టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన తర్వాత రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, స్టార్ ప్లేయర్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నఖ్వీని ఒక అసమర్థుడిగా అభివర్ణించాడు. ఈ ఓటమిని ఆ టీమ్ ప్లేయర్స్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారు.
"అసమర్థుడికి పెద్ద పదవి ఇస్తే ఇలాగే ఉంటుంది.."

కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన దాయాదుల పోరులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. దీంతో టీ20 ప్రపంచకప్‌లలో భారత్ రికార్డు 8-1కి చేరింది. ఈ ఘోర ఓటమి తర్వాత పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ‘ఏబీపీ న్యూస్’తో మాట్లాడుతూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్విని ఉద్దేశించి అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. "నన్ను ఈ ఛానెల్ చైర్మన్‌ను చేస్తే, ఇది ఎలా పని చేస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు మీరు క్రికెట్ అంటే ఏంటో తెలియని వ్యక్తిని చైర్మన్‌ను చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద నేరం.. ఒక అసమర్థుడికి అత్యున్నత పదవి ఇవ్వడం. ఒక అజ్ఞాని చేతిలో పగ్గాలు పెడితే ఇలాంటి విధ్వంసమే జరుగుతుంది" అని అక్తర్ మండిపడ్డాడు. మోసిన్ నఖ్వీ ప్రస్తుతం పాక్ ప్రభుత్వంలో ఇంటీరియర్ మినిస్టర్‌గా కూడా ఉన్నాడు.
"సూపర్ స్టార్స్ అని పేరు.. ఒక్క మ్యాచ్ గెలిపించలేరు!"
జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, ముఖ్యంగా బాబర్ ఆజం (Babar Azam) వంటి వారిని ఉద్దేశించి అక్తర్ విమర్శలు గుప్పించాడు. "మీరు ఒక వ్యక్తిని సూపర్ స్టార్‌గా మార్చారు. కానీ అతను ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేడు. కనీసం 10 ఓవర్లు కూడా వేయలేని (ఫిట్‌నెస్ లేని) వాళ్లను మీరు స్టార్లను చేశారు" అని ఎద్దేవా చేశాడు.
"ఇండియా మనకంటే ఎంతో ముందుంది.."
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అంతరం చాలా పెరిగిపోయిందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. "భారత్ చాలా ముందుకు వెళ్లిపోయింది, మనం వెనుకబడిపోయాం. ఇప్పుడు ఇదంతా కేవలం టీఆర్పీ కోసం మాత్రమే నడుస్తోంది. మైదానంలో అసలు పోటీనే కనిపించడం లేదు. కానీ పాకిస్థాన్ తదుపరి మ్యాచ్‌లో నమీబియాను ఓడించి, సూపర్ 8 దశకు చేరుతుందని, ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నా" అని అక్తర్ ముగించాడు. పాకిస్థాన్ టోర్నీలో ముందంజ వేయాలంటే రాబోయే మ్యాచ్‌లో నమీబియాపై కచ్చితంగా గెలవాల్సి ఉంది.
{{/usCountry}}భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అంతరం చాలా పెరిగిపోయిందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. "భారత్ చాలా ముందుకు వెళ్లిపోయింది, మనం వెనుకబడిపోయాం. ఇప్పుడు ఇదంతా కేవలం టీఆర్పీ కోసం మాత్రమే నడుస్తోంది. మైదానంలో అసలు పోటీనే కనిపించడం లేదు. కానీ పాకిస్థాన్ తదుపరి మ్యాచ్‌లో నమీబియాను ఓడించి, సూపర్ 8 దశకు చేరుతుందని, ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నా" అని అక్తర్ ముగించాడు. పాకిస్థాన్ టోర్నీలో ముందంజ వేయాలంటే రాబోయే మ్యాచ్‌లో నమీబియాపై కచ్చితంగా గెలవాల్సి ఉంది.
{{/usCountry}}