...
...
Next Story

టీమిండియా టీ20 టీమ్‌లోకి తిరిగి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్.. తిలక్ వర్మ దూరం కావడంతో..

టీమిండియా టీ20 టీమ్ లోకి శ్రేయస్ అయ్యర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ తిరిగి వచ్చారు. న్యూజిలాండ్ తో తొలి మూడు టీ20ల కోసం అనౌన్స్ చేసిన టీమ్ లో వీళ్లకు సెలెక్టర్లు చోటు కల్పించారు. ఇషాన్ కిషన్ కూడా ఇందులో ఉన్నాడు.

Published on: Jan 16, 2026, 21:31:58 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

న్యూజిలాండ్‌తో జరగనున్న రాబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయాల కారణంగా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ సిరీస్‌కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లను సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

తిలక్ వర్మకు పొత్తికడుపులో నొప్పి

టీమిండియా టీ20 టీమ్‌లోకి తిరిగి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్.. తిలక్ వర్మ దూరం కావడంతో.. (AFP)
టీమిండియా టీ20 టీమ్‌లోకి తిరిగి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్.. తిలక్ వర్మ దూరం కావడంతో.. (AFP)

హైదరాబాద్ యువ సంచలనం తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీ ట్రైనింగ్ సెషన్‌లో పొత్తికడుపులో అసౌకర్యం తలెత్తింది. దీంతో అతడు న్యూజిలాండ్‌తో జరగనున్న మొదటి మూడు టీ20లకు దూరమయ్యాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులో చేరాడు.

సుందర్‌కు పక్కటెముకల గాయం..

మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, వడోదర వేదికగా జనవరి 11న న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు. స్కానింగ్ రిపోర్టులో అతనికి పక్కటెముకల గాయం అయినట్లు తేలింది. దీంతో సుందర్ కేవలం వన్డే సిరీస్‌కే కాకుండా, టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.

అంతకుముందు వన్డే సిరీస్‌లో సుందర్ స్థానాన్ని ఆయుష్ బదోనితో భర్తీ చేయగా.. ఇప్పుడు టీ20 సిరీస్ కోసం రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. సుందర్‌కు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని, ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి రిపోర్ట్ చేయాలని బీసీసీఐ సూచించింది.

ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో రెండు టీమ్స్ చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. మూడో వన్డే జనవరి 18న జరగనుంది. ఐదు టీ20ల సిరీస్ జనవరి 21 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది.

టీ20 సిరీస్‌కు టీమిండియా ఇలా..

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks