నేను ఉండాల్సిన చోటే ఉన్నా-బాగా ఆడితేనే-అదే హ్యాపీ ప్లేస్: టీ20 ప్రపంచకప్ వేటుపై శుభ్‌మన్ గిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు
భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మౌనం వీడాడు. టీ20 ప్రపంచ కప్ లో తలపడే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై తొలిసారి రియాక్టయ్యాడు. తాను ఉండాల్సిన చోటే ఉన్నానని పేర్కొన్నాడు.
భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మౌనం వీడాడు. టీ20 ప్రపంచ కప్ లో తలపడే ఇండియన్ స్క్వాడ్ కు ఎంపిక కాకపోవడంపై తొలిసారి రియాక్టయ్యాడు. ఆసియా కప్ 2025కి వైస్-కెప్టెన్‌గా టీ20 టీమ్ ప్లేయింగ్ ఎలెవన్లో అడుగుపెట్టిన 26 ఏళ్ల గిల్ 2025లో ఆఢిన 15 టీ20లలో ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేక జట్టులో స్థానం కోల్పోయాడు.

శుభ్‌మన్ గిల్ కామెంట్లు
టీ20 ప్రపంచకప్ స్నబ్‌పై అడిగినప్పుడు శుభ్‌మన్ గిల్ ఎక్కువ వివరాలను వెల్లడించడానికి నిరాకరించాడు. అతను ఎంపికైన జట్టుకు రాబోయే టోర్నమెంట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ‘‘నా జీవితంలో నేను ఉండాల్సిన చోటే ఉన్నానని నేను నమ్ముతున్నా. నా విధిలో రాసిన ఏవైనా విషయాలు నా నుండి దూరం కావని అనుకుంటున్నా. స్పష్టంగా ఒక ఆటగాడిగా మీరు బాగా ఆడితే.. మీ జట్టు, మీ దేశం కోసం గెలుస్తారని మీకు ఒక నమ్మకం ఉంటుంది’’ అని శనివారం (జనవరి 10) ప్రెస్ మీట్ లో గిల్ చెప్పాడు.
టీమ్ కు ఆల్ ది బెస్ట్
‘‘అయితే సెలెక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తా. అది వారి నిర్ణయం. నేను టీ20 జట్టుకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. వారు మా కోసం ప్రపంచ కప్ గెలుస్తారని నేను నిజంగా ఆశిస్తున్నా' అని శుభ్‌మన్ గిల్ పేర్కొన్నాడు. ఆదివారం (జనవరి 11) న్యూజిలాండ్ తో ఇండియా ఫస్ట్ వన్డే సందర్భంగా మీడియాతో గిల్ మాట్లాడాడు.
హ్యాపీ ప్లేస్
‘‘ఒక అథ్లెట్‌గా, ఒక క్రీడాకారుడిగా ఇదంతా ప్రస్తుతంలో (ప్రజెంట్ టైమ్) ఉండటం గురించి అని నేను అనుకుంటున్నాను. మీరు మైదానంలో ఉన్నప్పుడు, మీరు ఒక బ్యాట్స్‌మన్‌గా లేదా బౌలర్‌గా మీ ప్రాథమిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు భవిష్యత్ గురించి ఆలోచించకూడదు. ఆ క్షణంపైనే ధ్యాస ఉండాలి. అప్పుడు మీరు విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు మీ జీవితాన్ని సులభతరం చేసుకుంటే అదే హ్యాపీ ప్లేస్’’ అని గిల్ అన్నాడు.
టీ20 ప్రపంచకప్ 2026
డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇండియా 2026 టీ20 ప్రపంచకప్ బరిలో దిగనుంది. ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారతదేశం, శ్రీలంకలోని ఎనిమిది వేదికలలో జరుగుతుంది. భారతదేశం గ్రూప్ Aలో యుఎస్ఏ, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌లతో పాటు ఉంది. ఇండియా ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియంలో యుఎస్ఏతో ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది.
టీ20ల్లో గిల్
2025లో 15 టీ20లు ఆడిన గిల్ 219 పరుగులే చేశాడు. సగటు 24.25, స్ట్రైక్ రేట్ 137.26 మాత్రమే. గిల్ గత సంవత్సరం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మూడు టీ20ల్లో వరుసగా 4, 0, 28 స్కోర్లు చేశాడు. అయితే నెట్స్ సెషన్‌లో కాలి బొటనవేలికి గాయం కావడంతో చివరి మ్యాచ్ ఆడలేకపోయాడు. ప్రస్తుతం టీమిండియాకు టెస్టు, వన్డే కెప్టెన్ గా ఉన్న గిల్ టీ20ల్లో మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. అందుకే అతనిపై వేటు తప్పలేదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


