భారత ఆటోమొబైల్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న 'స్కోడా కైలాక్' ఎస్‌యూవీ లైనప్‌ను కంపెనీ మరింత విస్తరించింది. స్పోర్టి డిజైన్, మెరుగైన ఫీచర్లతో కూడిన కొత్త 'స్పోర్ట్‌లైన్' వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధరను రూ. 11.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా సంస్థ నిర్ణయించింది. కైలాక్ స్పోర్ట్‌లైన్ రాకతో ఈ సిరీస్‌లో మొత్తం వేరియంట్ల సంఖ్య ఏడుకు (క్లాసిక్, క్లాసిక్+, సిగ్నేచర్, సిగ్నేచర్+, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్+) చేరింది.
డార్క్ థీమ్.. అగ్రెసివ్ డిజైన్

స్కోడా మోటార్‌స్పోర్ట్ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ స్పోర్ట్‌లైన్ వేరియంట్‌ను ఆకర్షణీయమైన డార్క్ థీమ్‌తో తీర్చిదిద్దారు. డీప్ బ్లాక్ ఓఆర్‌విఎమ్‌లు (ORVMs), గ్లాసీ బ్లాక్ ఫ్రంట్, రియర్ డిఫ్యూజర్లు, టెయిల్‌గేట్‌పై నల్లటి బ్రాండింగ్, డీప్ బ్లాక్ డ్యూయల్-టోన్ రూఫ్ ఈ కారుకు ప్రత్యేక అందాన్ని ఇస్తాయి.
వీటితో పాటు 17-ఇంచుల బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్స్, సి-పిల్లర్‌పై స్పోర్ట్‌లైన్ స్టిక్కర్, ప్రత్యేక రియర్ స్పాయిలర్ వంటివి దీనికి మరింత స్పోర్టి లుక్‌ను అందిస్తాయి. మరింత కొత్తదనం కోరుకునే కొనుగోలుదారుల కోసం డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, బాడీ సైడ్ మోల్డింగ్‌తో కూడిన 'స్పోర్ట్‌లైన్ యాక్సెసరీస్ ప్యాక్'ను ఆప్షనల్‌గా అందిస్తున్నారు.
ప్రీమియం ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు
క్యాబిన్ లోపల కూడా బ్లాక్ థీమ్‌ను కొనసాగించారు. రూఫ్, డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్‌లను నల్లటి రంగుతో డిజైన్ చేశారు. హెడ్‌రెస్ట్‌లపై స్పోర్ట్‌లైన్ బ్రాండింగ్, కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో కూడిన లేథరెట్ సీట్లను అమర్చారు.
కారులో అల్యూమినియం పెడల్స్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో పాటు 25.6 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 20.32 సెంటీమీటర్ల వర్చువల్ కాక్‌పిట్ డిస్‌ప్లే అందుబాటులో ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ మోడళ్లయిన క్లాసిక్, క్లాసిక్+ వేరియంట్లలో కూడా క్లైమేట్రానిక్ ఆటోమేటిక్ ఏసీ, రియర్ డిఫాగర్‌ను కొత్తగా చేర్చినట్లు కంపెనీ తెలిపింది.
ఇంజిన్ సామర్థ్యం, సేఫ్టీ వివరాలు
స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.
{{/usCountry}}స్కోడా కైలాక్ స్పోర్ట్‌లైన్ వేరియంట్ 1.0-లీటర్ TSI టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 115 bhp పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో లభిస్తాయి.
{{/usCountry}}భారత్ ఎన్‌సిఎపి (BNCAP) క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన కైలాక్ సిరీస్‌లో, ఈ స్పోర్ట్‌లైన్ మోడల్‌లోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఇచ్చారు. వీటితో పాటు స్కోడా 'సూపర్ కేర్' ప్యాకేజీ కింద 4 ఏళ్ల వారంటీ, 4 ఏళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 4 ఫ్రీ సర్వీసులు లభిస్తాయి.
ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్):
- 1.0 TSI మాన్యువల్: రూ. 11.32 లక్షలు
- 1.0 TSI ఆటోమేటిక్: రూ. 12.32 లక్షలు