Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక పరుగులు.. 29 ఏళ్లకే స్మృతి మంధాన చరిత్ర.. ఆసియా కప్ సెమీస్ లో టీమిండియా
Smriti Mandhana: ఇండియన్ వుమెన్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన హిస్టరీ క్రియేట్ చేసింది. 29 ఏళ్లకే మహిళల క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు ఖాతాలో వేసుకుంది. హాంకాంగ్ పై ఆమె సెంచరీతో చెలరేగింది. దీంతో ఆసియా కప్ 2026లో టీమిండియా సెమీస్ చేరింది.
Smriti Mandhana: మహిళల ఆసియా కప్ 2026 (Women's Asia Cup) టోర్నీలో ఇండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) చరిత్ర తిరగరాసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో 64 బంతుల్లోనే 124 రన్స్ చేసి సుడిగాలి సెంచరీతో విరుచుకుపడింది. ఒకేసారి ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను మంధాన బ్రేక్ చేసింది.

64 బంతుల్లో 124 పరుగులు
హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన చెలరేగిపోయింది. మంధాన తన 64 బంతుల ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో హాంకాంగ్ బౌలర్లను ఆటాడుకుంది. తొలి 50 పరుగులను 40 బంతుల్లో పూర్తి చేసుకున్న మంధాన.. తర్వాత సెంచరీ మార్కును కేవలం 18 బంతుల్లోనే చేరుకోవడం ఆమె విధ్వంసానికి అద్దం పడుతోంది.
సెమీస్ లో భారత్
మంధాన 124 పరుగుల వీరవిహారంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం హాంకాంగ్ 56 రన్స్ కే ఆలౌటైంది. దీంతో భారత్ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆసియా కప్ 2026లో సెమీస్ కు క్వాలిఫై అయింది.
స్మృతి మంధాన రికార్డులు
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన మూడు రికార్డులు ఖాతాలో వేసుకుంది.
- ప్రపంచంలోనే అత్యధిక పరుగులు: వుమెన్ క్రికెట్లో మిథాలీ రాజ్ పేరిట ఉన్న 10,868 అంతర్జాతీయ పరుగుల ఆల్ టైమ్ రికార్డును మంధాన (ప్రస్తుతం 10,880 పరుగులు) బ్రేక్ చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ గా అగ్రస్థానానికి చేరుకుంది.
- అత్యధిక సెంచరీలు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది మంధానకు 18వ సెంచరీ. దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లాన్నింగ్ (17), సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (17) లను వెనక్కి నెట్టి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.
- హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్: మహిళల ఆసియా కప్ చరిత్రలో 124 పరుగులు చేయడం ఒక రికార్డు. గతంలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (119 నాటౌట్ - మలేషియాపై, 2024) పేరిట ఉన్న రికార్డును స్మృతి బద్దలుకొట్టింది.
మంధాన ఎమోషనల్ కామెంట్స్
"ఇన్ని రికార్డులు బద్దలవుతాయని నాకు నిజంగా తెలియదు. స్పిన్నర్లను ఎదుర్కోవడం నాకు కొంత కష్టమే. హాంకాంగ్ బౌలర్లు పవర్ ప్లేలో చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. వారి ఎనర్జీ అద్భుతం. నేను కేవలం బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశా" అని మంధాన తెలిపింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


