రైల్వేలో చేరాలనుకునే యువతకు దక్షిణ రైల్వే (Southern Railway) గొప్ప అవకాశం అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 4,308 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దక్షిణ రైల్వే అధికారిక వెబ్‌సైట్ sr.indianrailways.gov.in ద్వారా సెప్టెంబర్ 27, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
వయోపరిమితి నిబంధనలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలి. విభాగాల వారీగా గరిష్ట వయోపరిమితి ఇలా ఉంది.
- ఫ్రెషర్స్: గరిష్టంగా 22 సంవత్సరాలు
- ఎక్స్-ఐటీఐ / ఎమ్‌ఎల్‌టీ (MLT): గరిష్టంగా 24 సంవత్సరాలు
నెలకు లభించే స్టైపెండ్ వివరాలు
- అప్రెంటిస్‌షిప్ శిక్షణ సమయంలో అభ్యర్థులకు ప్రతి నెలా స్టైపెండ్ అందిస్తారు.
- ఫ్రెషర్స్ (10వ తరగతి ఉత్తీర్ణత): నెలకు రూ. 8,200
- ఫ్రెషర్స్ (12వ తరగతి ఉత్తీర్ణత): నెలకు రూ. 9,600
- ఎక్స్-ఐటీఐ అభ్యర్థులు: నెలకు రూ. 9,600
- ఎక్స్-ఐటీఐ అభ్యర్థులకు రెండో ఏడాది శిక్షణలో కనీస స్టైపెండ్‌పై 10 శాతం, మూడో ఏడాది శిక్షణలో అదనంగా 15 శాతం వరకు స్టైపెండ్ పెరుగుతుంది.
ఎంపిక విధానం ఇలా ఉంటుంది
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం అర్హత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫ్రెషర్స్ విభాగం: పదో తరగతిలో సాధించిన మార్కులను (కనీసం 50% అగ్రిగేట్ ఉండాలి) 200 మార్కులకు గుణించి మెరిట్ జాబితా తయారు చేస్తారు.
ఎక్స్-ఐటీఐ విభాగం: పదో తరగతి మార్కులను 100 మార్కులకు (కనీసం 50% అగ్రిగేట్), ఐటీఐ మార్కులను 100 మార్కులకు కుదించి, మొత్తం 200 మార్కులకు సమాన ప్రాధాన్యం ఇస్తూ మెరిట్ ఖరారు చేస్తారు.
ఎమ్‌ఎల్‌టీ (MLT) విభాగం: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) మార్కులను 200 మార్కులకు గుణించి మెరిట్ రూపొందిస్తారు.
దరఖాస్తు రుసుము
{{/usCountry}}ఎమ్‌ఎల్‌టీ (MLT) విభాగం: ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ) మార్కులను 200 మార్కులకు గుణించి మెరిట్ రూపొందిస్తారు.
దరఖాస్తు రుసుము
{{/usCountry}}ఈ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ (UPI) ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.