SRH vs PBKS: అభిషేక్ విధ్వంసం.. దంచుడే దంచుడు.. కానీ లాస్ట్‌లో ట్విస్ట్‌.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్కోరు ఎంతంటే?

SRH vs PBKS: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి షేక్ ఆడించాడు. ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఎడాపెడా షాట్లు బాదేశాడు. కానీ లాస్ట్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు స‌న్‌రైజ‌ర్స్ జోరుకు బ్రేక్ వేశారు. 

Published on: Apr 11, 2026, 17:18:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

SRH vs PBKS: అభిషేక్ శర్మ వీర విధ్వంసం. బంతిపై ఏదో పగ ఉన్నట్లు, బౌలర్లు అంటే కసి ఉన్నట్లు అభిషేక్ రెచ్చిపోయాడు. తాను క్రీజులో ఉండి బాదితే ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. శనివారం (ఏప్రిల్ 11) పంజాబ్ కింగ్స్ తో పోరులో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ ఊచకోత కోశాడు.

అభిషేక్ శర్మ (PTI)
అభిషేక్ శర్మ (PTI)

ఆ ట్విస్ట్

ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 74) చెలరేగిపోయాడు. దీంతో ఆ టీమ్ ఈజీగా 250కి పైగా స్కోరు చేస్తుందనిపించింది. కానీ స‌న్‌రైజ‌ర్స్ కు పంజాబ్ బౌలర్లు బ్రేక్ వేశారు.

ఓపెనింగ్ ధనాధన్

న్యూ చండీగఢ్ లో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. ఆ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ (38) వీర విధ్వంసంతో రెచ్చిపోయారు. ముఖ్యగా అభిషేక్ బాదుడు వేరే లెవల్ లో సాగింది. దీంతో పవర్ ప్లేలోనే (6 ఓవర్లు) స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 105కు చేరింది.

శశాంక్ బ్రేక్

8 ఓవర్లలోనే 120 రన్స్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ కు ఈజీగా 250 స్కోరు చేస్తుందేమో అనిపించింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే ఆల్ రౌండర్ శశాంక్ సింగ్ తన బౌలింగ్ తో స‌న్‌రైజ‌ర్స్ కు డబుల్ షాకిచ్చాడు. తన స్లో డెలివరీలతో అదరగొట్టాడు. ఒకే ఓవర్లో హెడ్, అభిషేక్ ను ఔట్ చేశాడు. అక్కడి నుంచి స‌న్‌రైజ‌ర్స్ స్పీడ్ కు బ్రేక్ పడింది. ఇషాన్ కిషన్ (27) మెరుపులు ఎక్కువ సేపు కొనసాగలేదు.

క్లాసెన్ స్లో ఇన్నింగ్స్

డేంజరస్ బ్యాటర్ క్లాసెన్ లాస్ట్ ఓవర్ వరకు క్రీజులో ఉన్నాడు. కానీ ఎప్పుడూ ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగే క్లాసెన్ ఈ ఇన్నింగ్స్ లో మాత్రం స్లోగా ఆడాడు. భారీ షాట్లు కొట్టలేకపోయాడు. 33 బంతుల్లో 39 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లు క్లాసెన్ ను షాట్లు ఆడనివ్వలేదు.

12 నుంచి 16 ఓవర్ల మధ్యలో 39 రన్స్ మాత్రమే వచ్చాయి. లాస్ట్ మూడు ఓవర్లలో 22 పరుగులే వచ్చాయి. దీంతో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ చివరకు 219 పరుగులే చేయగలిగింది. లాస్ట్ లో ఇన్నింగ్స్ స్లో కావడం స‌న్‌రైజ‌ర్స్ ను దెబ్బకొట్టింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More