Stock market holiday : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్- ఈ రోజు స్టాక్​ మార్కెట్​ హాలీడే..

Stock market news today : మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు (మే 1, శుక్రవారం) భారతీయ స్టాక్ మార్కెట్లు పని చేయవు. మదుపరులు తమ ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి మే 4, సోమవారం వరకు వేచి చూడాల్సిందే.

Published on: May 1, 2026, 08:14:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Stock market updates : స్టాక్ మార్కెట్ టేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్! ఈరోజు దేశీయ స్టాక్​ మార్కెట్​లకు సెలవు. మే 1న మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్స్​ఛేంజీలు - బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు పనిచేయవు. సాధారణంగా ప్రభుత్వ సెలవు దినాల్లో మార్కెట్లు పనిచేయవు కాబట్టి అదే క్రమంలో ఈరోజు కూడా ట్రేడింగ్ నిలిచిపోనుంది.

ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు సెలవు.. (Photo: REUTERS)
ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు సెలవు.. (Photo: REUTERS)

స్టాక్​ మార్కెట్​ హాలీడే- పూర్తి వివరాలు..

నేటి సెలవు కారణంగా కేవలం షేర్ల కొనుగోలు, అమ్మకాలు మాత్రమే కాకుండా.. డెరివేటివ్స్, ఎస్ఎల్‌బి సెగ్మెంట్లలో కూడా ట్రేడింగ్ జరగదు. కరెన్సీ డెరివేటివ్స్ విభాగం కూడా పనిచేయదు. తిరిగి సోమవారం, మే 4వ తేదీన మార్కెట్లు యధావిధిగా ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతాయి.

కమొడిటీ మార్కెట్ పరిస్థితి ఏంటి?

మల్టీ కమొడిటీ ఎక్స్​ఛేంజ్ విషయంలో మాత్రం కాస్త వెసులుబాటు ఉంది.

మార్నింగ్ సెషన్: ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మార్కెట్ క్లోజ్ అయి ఉంటుంది.

ఈవెనింగ్ సెషన్: సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 11:55 గంటల వరకు ట్రేడింగ్ యధావిధిగా కొనసాగుతుంది.

అయితే నేషనల్ కమొడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్​ఛేంజ్ మాత్రం రెండు సెషన్లలోనూ మూతపడి ఉంటుంది.

గ్లోబల్ మార్కెట్లలోనూ సెలవుల సందడి..

కేవలం మన దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈరోజు 'మే డే' (కార్మిక దినోత్సవం) సందర్భంగా సెలవు ప్రకటించారు. చైనా, హాంగ్ కాంగ్, సింగపూర్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలతో పాటు.. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి యూరోపియన్ దేశాల్లో కూడా స్టాక్ మార్కెట్లు ఈరోజు పనిచేయవు. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

2026లో రాబోయే మరిన్ని సెలవులివే..

ఈ ఏడాది స్టాక్ మార్కెట్ క్యాలెండర్ ప్రకారం మరిన్ని సెలవులు మన కోసం వేచి ఉన్నాయి.

మే 28: బక్రీద్

జూన్ 26: మొహర్రం

సెప్టెంబర్ 14: వినాయక చవితి

అక్టోబర్ 2: గాంధీ జయంతి

అక్టోబర్ 20: దసరా

నవంబర్ 10: దీపావళి బలిప్రతిపద

నవంబర్ 24: గురునానక్ జయంతి

డిసెంబర్ 25: క్రిస్మస్

మదుపరులు తమ పెట్టుబడి వ్యూహాలను ఈ సెలవు దినాలను దృష్టిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

స్టాక్​ మార్కెట్​ పరిస్థితి ఇలా..

అమెరికా- ఇరాన్ యద్ధం వేళ గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 583 పాయింట్లు పడి 76,913 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 180 పాయింట్లు కోల్పోయి 23,997 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 540 పాయింట్లు పడి 54,863 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 8,047.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,487.10 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More