Stock Market Holiday : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్- ఈ రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు, కారణం ఇదే..
Is today a stock market holiday : ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని భారత స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. ఇక రానున్న రోజుల్లో స్టాక్ మార్కెట్ హాలీడే లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
Stock market news today : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు, ఏప్రిల్ 14 2026న సెలవు ఉంటుంది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు ఈ రోజు పనిచేయవు. ఈక్విటీ విభాగంతో పాటు డెరివేటివ్స్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో కూడా ట్రేడింగ్ నిలిచిపోనుంది. తిరిగి బుధవారం (ఏప్రిల్ 15) ఉదయం యధావిధిగా మార్కెట్లు ప్రారంభమవుతాయి.

స్టాక్ మార్కెట్లకు సెలవు- కమోడిటీ మార్కెట్ పరిస్థితి ఏంటి?
మరోవైపు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) విషయానికి వస్తే, ఉదయం సెషన్ (9:00 – 5:00)లో ట్రేడింగ్ ఉండదు. అయితే, సాయంత్రం సెషన్ మాత్రం యధాప్రకారం రాత్రి 5:00 గంటల నుంచి 11:55 గంటల వరకు కొనసాగుతుంది. కమోడిటీ ట్రేడర్లు ఈ విషయాన్ని గమనించాలి.
2026లో రాబోయే సెలవులు ఇవే..
ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్‌కు ఇదే చివరి సెలవు. అనంతరం వచ్చే నెల మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లు మూతపడతాయి. ఈ ఏడాది మొత్తంగా చూస్తే మరో 10 సెలవులు రానున్నాయి.
మే నెలలో రెండు రోజులు, జూన్‌లో ఒక రోజు సెలవు ఉంటుంది.
జులై, ఆగస్టు నెలల్లో మార్కెట్లకు ఎలాంటి ట్రేడింగ్ సెలవులు లేవు.
సెప్టెంబర్, డిసెంబర్లలో ఒక్కో రోజు చొప్పున.. అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండేసి రోజుల చొప్పున సెలవులు రానున్నాయి.
| నెంబర్ | తేదీ | స్టాక్ మార్కెట్ హాలీడేకి కారణం |
|---|---|---|
| 1 | 14-Apr-2026 | Dr. Baba Saheb Ambedkar Jayanti |
| 2 | 01-May-2026 | Maharashtra Day |
| 3 | 28-May-2026 | Bakri Id |
| 4 | 26-Jun-2026 | Muharram |
| 5 | 14-Sep-2026 | Ganesh Chaturthi |
| 6 | 02-Oct-2026 | Mahatma Gandhi Jayanti |
| 7 | 20-Oct-2026 | Dussehra |
| 8 | 10-Nov-2026 | Diwali-Balipratipada |
| 9 | 24-Nov-2026 | Prakash Gurpurb Sri Guru Nanak Dev |
| 10 | 25-Dec-2026 | Christmas |
స్టాక్ మార్కెట్‌లను వణికిస్తున్న యుద్ధం..
ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్‌ను తీవ్ర ఒడుదొడుకులకు గురిచేస్తున్నాయి. గత వారం సుమారు 6 శాతం వృద్ధిని కనబరిచిన భారత సూచీలు, సోమవారం మాత్రం భారీ నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్: దాదాపు 1,700 పాయింట్లు పతనమై 75,868 స్థాయికి పడిపోయింది.
నిఫ్టీ: 500 పాయింట్లకు పైగా క్షీణించి 23,556 వద్ద కనిష్టాన్ని తాకింది.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలే ఈ పతనానికి ప్రధాన కారణం. గత వారాంతంలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడం ఇన్వెస్టర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. దీనికి తోడు ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ వద్ద దిగ్బంధనం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు, ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతాయనే ఆందోళనలు పెరిగాయి.
"అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో భారత మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. అమెరికా-ఇరాన్ చర్చలు ఫలించకపోవడం, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల వంటి అంశాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి," అని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మార్కెట్ గమనం ప్రధానంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడులపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. ఏప్రిల్ 14న స్టాక్ మార్కెట్ ఎందుకు సెలవు?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జాతీయ సెలవు కావడంతో మార్కెట్ పనిచేయదు.
2. ఎంసీఎక్స్ కూడా పూర్తిగా సెలవులో ఉంటుందా?
లేదు. ఉదయం సెషన్ మాత్రమే సెలవు. సాయంత్రం నుంచి ట్రేడింగ్ యధావిధిగా జరుగుతుంది.
3. మే నెలలో మార్కెట్ సెలవులు ఎప్పుడు ఉన్నాయి?
మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా సెలవు ఉంటుంది. ఆ నెలలో మొత్తం రెండు ట్రేడింగ్ సెలవులు ఉన్నాయి.
4. మార్కెట్ నష్టపోవడానికి ప్రధాన కారణం ఏమిటి?
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం, కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడం వల్ల మార్కెట్లు కుప్పకూలాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


