Stock market : హర్ముజ్​ జలసంధి దిగ్బంధనం- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు అతి భారీ నష్టాలు!

Gift nifty live : ఏప్రిల్​ 13, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధరలు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 13, 2026, 08:15:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Stock Market Latest news : ఇరాన్- అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాలు- భారీ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 919 పాయింట్లు పెరిగి 77,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 275 పాయింట్లు వృద్ధిచెంది 24,051 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1091 పాయింట్లు పెరిగి 55,913 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్ లేటెస్ట్​ అప్డేట్స్..

కాగా అమెరికా- ఇరాన్​ మధ్య శాంతి చర్చలు విఫలం అవ్వడం, ప్రపంచ చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్​ జలసంధిని పూర్తిగా బ్లాక్​ చేస్తున్నట్టు (ఒక్క ఓడ కూడా బయటకు వెళ్లకుండా) అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించడంతో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లలో రక్తపాతం కనిపిస్తోంది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 672.09 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ.410.05 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

“టెక్నికల్స్​ పరంగా నిఫ్టీ50కి 23,7450- 23,800 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. 24,200- 24,250 రెసిస్టెన్స్​గా ఉంది,” అని చాయిస్​ బ్రోకింగ్​ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ సుమీత్​ బగాడియా తెలిపారు.

కాగా అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో మార్కెట్లలో ఒడుదొడుకులు ఉంటాయని, బిగినర్లు ట్రేడింగ్​కి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 333 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.56 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.11శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.35 శాతం డౌన్​ అయ్యింది.

కాగా స్ట్రెయిట్​ ఆఫ్​ హర్ముజ్​ బ్లాక్​ చేస్తామని ట్రంప్​ చేసిన ప్రకటనతో అమెరికా ఫ్యూచర్లు భారీ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ట్రంప్​ ప్రకటన, ఇరాన్​తో అనిశ్చితి నేపథ్యంలో ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

హర్ముజ్​ జలసంధి చుట్టు ఉన్న అనిశ్చితి కారణంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బ్రెంట్​ క్రూడ్​ ఏకంగా 7.05శాతం పెరిగి బ్యారెల్​కు 101.91 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

జిందాల్ స్టెయిన్​లెస్​- బై రూ. 780.85, స్టాప్​ లాస్​ రూ. 753, టార్గెట్​ రూ. 836

రామకృష్ణ ఫోర్జింగ్స్- బై రూ. 544.05, స్టాప్​ లాస్​ రూ. 525, టార్గెట్​ రూ. 582

ఎన్​సీసీ- బై రూ. 153.06, స్టాప్​ లాస్​ రూ. 147.7, టార్గెట్​ రూ. 164

బ్రిగేడ్​ ఎటర్​ప్రైజెస్​ లిమిటెడ్​- బై రూ. 723.2, స్టాప్​ లాస్​ రూ. 697, టార్గెట్​ రూ. 775

ఫెడరల్​ బ్యాంక్- బై రూ. 291.7, స్టాప్​ లాస్​ రూ. 281, టార్గెట్​ రూ. 313

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More